Skip to main content

రమణీయం 30122021

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
*******************
కవివరుల జాబితా
1.వేదాంతం సురేష్ బాబు గారు
2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
3.దోసపాటి రామ చంద్ర రావు గారు
4. గొర్రెపాటి శ్రీను గారు
5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
6.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
7.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
8.సింహాద్రి వాణి గారు
9.తరణికంటి సూర్య లక్ష్మి గారు
10.కోరాడ గారు
11.కవిత వెంకటేశ్వర్లు గారు
12.పిన్నక నాగేశ్వరరావు గారు
13.టేకుమళ్ళ విజయ లక్ష్మి గారు
14.అపరాజిత్ గారు
15.సునంద వురిమళ్ళ గారు
********************
**********************
1
తేదీ:- 30-12-2021, గురువారం
భగవాన్ ‌రమణ మహర్షి
************************
వేకువజామున ‌తొలి వెలుగై
జీవన యానపు తొలి అడుగై
మనిషి మనసులో మలినాలన్నీ
కడిగే పావన సుర ఝరియై
గాఢ నిద్రలో మునిగిన మనసుకు
సహజ స్వరూపపు జాడను తెలిపీ
ఆత్మను పరమాత్మను సంధించీ
ఆనందపు అనుభవముల పంచీ
మాయను మునిగిన మానవులకు ఆ
మాయను దాటే మార్గము చూపీ
మనసుకు పట్టిన తుప్పును దులిపీ
అలోచనలకు పదునే పెట్టీ
చెడు స్నేహం కలతలు తెస్తుందని
ముప్పులు తప్పే మార్గం చూపీ
ప్రపంచ మందున పవిత్ర వస్తువు
పరమాత్ముండని గ్రహించమంటూ
భగవంతుడు భక్తుల మధ్యన గల
దూరము బాపీ తీరము చేర్చీ
జ్ఞానముతో కూడిన నిజ భక్తియె
శరణాగతి యని సూత్రము నేర్పీ
తనను తాను ప్రశ్నించు కొనుచును
విచారములను సమర్పించుకొని
సాధన చేస్తే వేదన తొలుగని
జ్ఞాన జ్యోతి మనసున వెలిగించీ
స్వీయ నియంత్రణ లేనివారికి
పరులకు చెప్పిన ఫలము లేదనీ
'నేను' ఎవరని తెలుసుకొమ్మనీ
ఇతర తలుపులు మరచి పొమ్మనీ
'నేను' పోయిన మేలు జరుగునని
జీవన పరమార్థము అది యేనని
చితిని రగిల్చే కట్టె చివరకు
ఆ చితిలో పడి కాలిపోవునని
అహము వీడిన ఆత్మ దర్శనము
అనుభవమ్మున కాక తప్పదని
ఆత్మ యోగ సందర్శన భాగ్యము
తత్వమసి తత్వార్థము తెలిపీ
ప్రజ్ఞానము బ్రహ్మము అని తెలిపీ
విజ్ఞానపు వెలుగుల యిల పంచీ
ఆత్మ యొక్కటే అఖిలాండమ్మున
నిత్యము సత్యము నిజమని తెలిపీ
మౌనయోగియై మానవాళికి
మార్గదర్శియై మహిమాన్వితుడై
మహిలో వెలసిన మహానుభావుడు
అరుణాచలమున నిలిచిన రమణుడు

🖋️ వేదాంతం సురేశ్ బాబు
      చంద్రపూర్
      మహారాష్ట్ర
2
[30/12, 8:06 pm] +91 6281 697 982: మహర్షీ ఓ మహర్షి :::30122021
***************
ఓ మహర్షీ
అరుణోదయ కాంతి సైతం
అరుణాచలం ప్రదక్షిణ చేయవలసిందే

అచలమే చలించి జ్ఞాన చందన సుగంధాలు
అలుగు పోసిందే
అగోచరమైన అద్వైత సిద్ధాంతాన్ని
అక్షర జ్ఞానం లేని వారు కూడా అందుకొన్నారే
అది అందించిన మీ ఆధ్యాత్మిక చింతన
అమోఘమైన ఆత్మ శక్తికి ప్రతి రూపం...అదే
అచ్చు పోసిన సుందర దృశ్యం

అల్పులానల్పులాయనే మీమాంస మచ్చుకూ  అగోచరమే
అందరినీ ఆదరించి అక్కున చేర్చుకుని
ఆలించి పాలించే ఆత్మయోగి 
అడిగిన ప్రశ్నకు సూటిగా చూపులలతోనే
అర్ధం చెప్పిన పరమహంస

అనంతుడవై అభాగ్యుల రోదనావేదనలు 
ఆలకించి మోదము గూర్చిన మధుసూదనా
అరుణాచలం ప్రదక్షిణ అనంత విశ్వ ప్రదక్షిణ
ఆది దంపతుల ఆశీర్వాద బలము బలగము
ఆత్మ పరమాత్మల అనుబంధాన్ని సూక్ష్మంగా
మౌనం గానే ప్రబోధించిన మౌన ముని

ఓ మహర్షీ నీ స్మరణం మాకు సదా శిరోధార్యం
మీరు చూపిన మార్గం మాకు సదా సుపథం

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
30122021
3
[30/12, 8:14 pm] +91 99373 80136: కవితాగానం(సీజన్2)
తేది30122021,గురువారం
అంశం:శ్రీరమణతత్వం.
శీర్షిక:ఆధ్యాత్మిక వేత్త.
ఒక సామాన్యమానవుడాయన
అతిసామాన్యబ్రాహ్మణకుటుంబంలో జననం
చదివింది పెద్దగా లేదు
దేహదారుఢ్యంగలవ్యక్తి
నడుస్తూ దూరప్రాంతమునకు చేరిన బాటసారి
తమిళనాట తిరువన్నామలై జన్మస్థలం
చిరుప్రాయమందే ఆలోచనలతో గడిపాడు
అరుణాచల శిష్యుడైనాడు
కొండగుహలో దీర్ఘకాలం తపస్సుచేశాడు
ఆత్మజ్ఞానం పొందాడు
అద్వౌతతత్వాన్ని బోధించాడు
ప్రేమతత్వాన్ని పెంచాడు పంచాడు
మౌనముద్రలో జీవించాడు
మౌనసందేశాలనందించాడు
మనుషులనుబట్టి మాటలాడాడు
నేనెవరో నని తెలుసుకోమన్నాడు
స్వయంశోధన ముఖ్యమన్నాడు
సర్వమతసారాంశమును తెలిపాడు
పశపక్ష్యాదులనుకూడా ప్రేమించమన్నాడు
అసలుపేరు వెంకట్రామన్ అయ్యర్
ఆత్మజ్ఞానిగామారి రమణమహర్షిగా మారాడు
రమణాశ్రమాన్ని స్థాపించాడు
అన్నదానములను చేశాడు
అరుణాచలేశ్వరునికి ఆరాధించాడు
గిరిప్రదర్శనమే ముక్తికిమార్గమని నమ్మాడు
అతడోక ఋషిపుంగవునిగా చిరస్మరణీయుడయ్యాడు!

ఇది నాస్వీయరచన.
దోసపాటివెంకటరామచంద్రరావు
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
చరవాణి7780594995.
4
[30/12, 8:30 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం (సీజన్ -2)
అంశం : రమణ మహర్షి

శీర్షిక : "మౌన మహర్షి !"

రచన : గొర్రెపాటి శ్రీను 

మౌనం లో దాగిన మహత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన  మహర్షి !
స్వీయ శోధన ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చని ప్రబోధించిన విశ్వర్షి !
16 సంవత్సరాల వయస్సులో మోక్ష జ్ఞానం పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడిన సత్పురుషుడు ..
భక్తులకి సాక్షాత్తు దైవస్వరూపులై నిలిచిన మౌన జ్ఞాని..రమణ మహర్షి !
అరుణాచలం ఆలయంలో కి అడుగుపెట్టగానే..పరుగెత్తుకొని వెళ్లి..
స్వయంభూలింగాన్ని ఆనంద పారవశ్యంతో ఆలింగనం చేసుకున్న.. అరుణాచలేశ్వరుడి ప్రియతముడు ! 
సాటి జీవుల పట్ల సఖ్యతగా మసలుకోవాలని సూచించడమే కాకుండా ..ఆచరించి..
సకల ప్రాణులని చేరదీసి ఆదరించిన సమస్త జీవకోటి హితుడు..రక్షకుడు ..రమణ మహర్షి !
నిరాడంబరతకు నిలువెత్తు రూపమై..
ఈర్షాద్వేషాలకు అతీతుడై ..
ప్రేమమూర్తి గా జీవితం గడిపిన రమణుల వారు ..
భూతదయ, అహింసను తన జీవన విధానంగా కలిగి ..
శాంతిసౌఖ్యాలకు చిరునామాయై ..అరుణాచలేశ్వరుడి సన్నిధిలో జీవిత కాలాన్నంతా గడిపి ..
అరుణాచలేశ్వరుడిలో జ్యోతియై ఐక్యమైన పవిత్రుడు ..యోగ సాధకుడు ..రమణ మహర్షి !

(రమణ మహర్షి జన్మదినమైన డిసెంబర్ 30 న వారి స్మరణలో .._ గొర్రెపాటి శ్రీను ).
5
[30/12, 9:09 pm] Aalla Nageshwar Rao Poet: కవితాగానం( సీసన్2)
అంశం ; రమణ మహర్షి జయంతి
శీర్షిక;
   "" ఆత్మ జ్ఞాన బోధకుడు ""

అరుణాచల క్షేత్రంలో
ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిన ఆశ్రమం
రమణ మహర్షి ఆశ్రమం!
మానవసేవే మాధవసేవ యని
ప్రతి జీవిలో పరమాత్మను దర్శించి
సాటి మనిషికి ఉడుతాభక్తిగా సాయం చేయాలని
కర్మానుసారమే మానవజన్మ లభిస్తుందని
లభించిన ఈ ఉత్తమ మానవజన్మను
పుణ్యకార్యాల తో పునీతం చేసుకోవాలని ప్రభోదించిన
ఆత్మ జ్ఞాన బోధకుడు రమణ మహర్షి!
నిశ్చల మనస్కులై
మౌనంగా పరమాత్మను ద్యానిస్తూ
అహంకారంకు తిలోదాకాలిచ్చి
విధాత రాతను స్వాగతిస్తూ
వినయ విధేయతలను ప్రదర్శిస్తూ
పరిశుద్ధ ఆత్మతో దైవారాధన గావిస్తూ
సమాజానికి దూరంగా ఉండక
సమాజంలో ఒకడిగా మెలుగుతూ
ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతూ
సమాజ హితాన్ని ఆకాంక్షిస్తూ
మానవత్వంతో మనిషిగా మసలుతూ
జీవనయానం కొన సాగించాలని
ప్రబోధించిన మహనీయుడు రమణ మహర్షి!
ఆయన బోధనలు నిత్య సత్యాలు
ఆచరించడమే ముక్తికి మార్గాలు!
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
రచన
ఆళ్ల  నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని .7416638823
.......................................
పై వచనకవిత నా స్వీయారచన అని హామీ ఇస్తున్నాను.
6
[30/12, 9:23 pm] సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: కవితా గానం (సీజన్  2)
తేది: 30-12-2021

అంశం: 
శ్రీ రమణ మహర్షి

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు.
చరవాణి: 9505152560
*********************
    *సూక్తి స్ఫూర్తి*

దేవునికి మనిషి ఎంత దూరంలో వుండునో
దేవుడు ఎంతో దూరంలో...

ఉపవాసం వుంటూ భుక్తిని ధ్యానించుట అల్పం
భుజించి భక్తిగా ధ్యానించుట శ్రేష్ఠం!

కష్టసుఖాలు అనుభవించినపుడే
జీవన మాధుర్యం స్ఫురితం!!

మనసు ఆలోచనలు విస్తరించిన ప్రతి ఆలోచన హీనమవుతూ...
ఆలోచనలు నశింపజేయగా ఏకాగ్రమై దృఢమగును!!

గాఢనిద్రలో అనుభవమవుతున్న
సహజస్వరూప సౌందర్యం పొందాలంటే తన ఆత్మను గురించి తెలుసుకోవాలి!!!
      * * *
      హామీ పత్రం
ఈ సూక్తి కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
[30/12, 9:32 pm] నాయకంటి నరసింహ శర్మ గారు: కవితాగానం సీజేన్ 2
డా.నాయకంటి నరసింహ శర్మ.
అంశం . రమణమహర్షి.


నియమ నిష్టలకు నిలువెత్తు నిదర్శనం
అతి పవిత్రతకు శిఖరమంత ఉదాహరణ
ఐహిక వాసనలు ససేమిరా అంటని 
పరమ తాత్త్వికుడు
అతులితమైన జ్ఞాని 
ఆత్మావలోకనం చేసుకునే గొప్ప దార్శనికుడు
చీమకైనా కలలో కూడా హాని తలపెట్టని సర్వ ప్రాణుల పట్ల 
దయా ,అంతఃకరణ గల 
ఆత్మవత్ సర్వభూతాని అనే వాక్కు త్రికరణ శుద్ధిగా ఆచరించిన మహాయోగి 
భోగి అన్న పదానికి అణుమాత్రం కూడా చోటివ్వని 
నిరాడంబరంగా అతి సామాన్యంగా జీవించే యోగీశ్వరేశ్వరుడు 
అరుణాచల క్షేత్రానికి సరైన చిరునామా
ప్రాణం ఉన్నా నిర్జీవసముడు
జీవితం బుద్బుద ప్రాయమని అక్షరాలా విశ్వసించే ఆచరణశీలి
భూతద్దంలో వెదికినా తనలో
ఈషణ్మాత్రం లోపం లేని 
పూతదేహుడు 


హామీ పత్రం 
ఇది స్వీయరచన
7
[30/12, 9:43 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం సీజన్ 2
తేది:-30-12-21
అంశం:- రమణమహర్షి
శీర్షిక:- ఆత్మజ్ఞాని
...............................
పుడమి పై పుట్టిన మానవుని నీవెవరివో తెలుసుకుంటే  వసుదైక కుటుంబమే నీ వశమవుతుంది అన్న రమణులు  మహిమాన్వితులు...!!

తమిళనాడు లో తిరువన్నామలై లో అరుణాచలేశ్వర స్వరూపమే సాక్షాత్తు రమణ మహర్షి
ప్రపంచమున అన్ని జీవరాసులు పరమాత్మ స్వరూపాలేనని చాటి
ప్రేమతత్వమే జీవితత్వమని భోదించి ఆచరించిన పుణ్యపురుషులు....!!

సాక్షాత్తు వాశిష్ఠ గణపతి ని
నాయన అని సంభోధించి
గణపతి అంశయేనని  ప్రజలకు చెప్పిన  రమణులు  వారి రమణ గీత జీవనముక్తి కి సోపానం 
అందుకే రమణులు సాక్షాత్తు అరుణాచలేశ్వరులే
అరుణాచల శివ అరుణాచల శివ అంటు గిరి ప్రదర్శన చేస్తు, రమణాశ్రమ దర్శనం భూలోక కైలాసమే...!!
..............................
హమీపత్రం:-
ఇది నా స్వీయకవిత
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
..............................
8.
[31/12, 6:45 pm] Siimhadri Vani Poetess: తేదీ31--12--2021
ప్రక్రియ:--పద్యం
ఛందస్సు:--‌సీసం
శీర్షిక:-- నూతన వత్సరానికి స్వాగతం
రచన:--సింహాద్రి వాణి

సీ. నూతన వత్సరం 
నూతనోత్సాహమై
యరుదెంచ వలయును నాశ దీర్చ

కొత్త కోరిక లెన్నొ కోరుచుండె ప్రజలు
తీర్చగా‌ రావలెన్ తేజ మలర

ముసురుకున్న ‌తెగులు మొదలంట పెకలించి
యారోగ్య మిడవలెన్ యవని నిండ

శాంతి సౌఖ్యము లిచ్చి శాపాలు తొలగించి
దీవించ రావలెన్ దిగులు తీర్చి

ఆ.వె. ముందు కాలమందు మోదమ్ము గూర్చగా
స్వాగతమ్ము నీకు‌సాగి రమ్ము
నీదు రాక కొరకు ‌నెనరుతో జగమంత
ఎదురు చూచు ‌చుండె నెంతగానొ.
9
[31/12, 8:17 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం( సీజన్‌2) 31/12/2021/ శుక్రవారము
అంశము:- రమణమహర్షిజయంతి
శీర్షిక:- రమణరుషి
                ( 1 )
సీ!  అరుణాచలము జూడ  ఆధ్యాత్మ క్షేత్రము
మనసునకోర్కెలు  మాయమగును

మహనీయతంతయు  మానవులెరుగగ
Mouనముగదెలిపె  Mouనమునియె

తననుతానెరుగను  తగినసాధనచేయ
జ్ఞానము బోధించె  జ్ఞానియనగ

శోధనస్వయముగ   శోధించమనుచును
జ్ఞానమార్గమునకు  జాడదెలిపె

ఆ!  సూటిగారమణులు  చూపులతోడనె
మనుజభావనలను  మనసునెరుగు
మూగజీవులెరుగు  మూగభావనలను
మూగభావనలను  మునియు నెరుగు!
                   (2)
సీ!  మహిమాన్వితుడనగా  మహరుషి రమణులు
అరుణాచలనివాసి  నవనివెలిగె

తలపుల నుత్పత్తి  తలనెత్తకుండగ
వాటినణచివేసి  వాటి నొదలు

మనసున వైరాగ్య  మంతయు పట్టగ
మమతానురాగాలు  మాసిపోవు

నీముక్తిమార్గము  నీగురువులుచూప
దానికి బాటల  దారివెతుకు

ఆ!  కర్మననుసరించి  కలుగుమానవజన్మ
జనన మరణ ములకు  జంకవద్దు
జగతినొక్కరీతి   జగతిమెచ్చువిధము
ప్రేమతత్వమంత  పెంచగాను!
            తరణికంటి సూర్యలక్ష్మి.
                      ------------
10
[31/12, 8:19 pm] Korada: కవితా గానం 
     అరుణారుణ రమణీయం 
      కోరాడ నరసింహా రావు!
          **************
బంధనములన్ని  ద్రెoచు కుని...
సంసారమును  త్యజించి.... 
అరుణాచలమును  జేరి.... 
జ్ఞానారుణిమ వై   నీవు.... 
జీవన్ముక్తుడ వై నావు... !

నేను -  నేను అంటున్న... 
ఆ నే నెవరో  తెలుసుకుని.... 
నేను - నేనను భ్రమలను వీడి 
నీవెవరో తెలుసుకున్న ఆత్మ జ్ఞానివి... నీవయ్యా.... !

నాకన్ను, నా కాలు... నాముక్కు, నాచెవి వలెనే... 
ఈ దేహమే నీవు కావని... 
చివరకు... మనో బుద్ది, చిత్త హంకార ప్రాణము సైతము అవన్నీ... నీవి  యనీ.... అవేవీ 
* నీవు * కావని సోదాహరణగ బోధచేయగల సద్గురువే.... 
నీవయ్యా... !

అజ్ఞానమే... ఈ బంధనములు 
బాధలకెల్ల మూలమని... 
సు జ్ఞానమె పూర్ణానందమని 
తాత్వికచింతనెనిజమార్గమ్మని
సత్యమునెరిగిన దార్శనికుడవు
కర్మఫలము ననుభవింప యెరికైనాతప్పదని..... స్వయముగా... ప్రారబ్ధ బాధ ననుభవించి దెలిపినావు.... !
సనాతనధర్మ విరుద్ధ భావజాల 
చలమునుసైతము నిశ్చలుని జేసి...నిజమునొప్పుకొనునటుల మార్చిన మహనీయుడవు !
కావ్యకంఠ గణపతి ముని చే... 
భగవాననిపించుకున్న.... మహోన్నతుడవు... !!
వందనమిదె... వందన మిదె... 
వేదాంత వేద్యుడా.... !
నీ ఆత్మ జ్ఞాన ప్రకాశమును 
ఈ భువిపై.....నిరతము  ప్రసరింపుము !!
     ***************--
      ...... కోరాడ.
11
[31/12, 8:45 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 2 
అంశం:: రమణ మహర్షి జయంతి
తేదీ::31.12.21..శుక్రవారం
శీర్షిక:: నేను ను కనుక్కో

నీలోని నేను ను కనుక్కో
అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో
అన్ని జీవాల్లో చైతన్యముంది
ఆ చైతన్యమే దేవడన్నాడు

అన్ని కాలాల్లో కౌపీనమే
మూగ జీవాలతో స్నేహమే
అందరూ సమానమే
పసిపిల్లల మనస్తత్వమే

నడయాడే మానవోత్తముడు
మౌన మునీంద్రుడు
బోధలు చేయని బోధిసత్వుడు
శివాంశ సంభూతుడు

భగవాన్ రమణ మహర్షి
గిరి ప్రదక్షిణతో పాపాలు తొలుగు
ఆయన దర్శనంతో పుణ్యం కలుగు
అరుణాచలం అగ్నిలింగం
శివతత్వానికి ప్రతిరూపం
జ్ఞాన మార్గానికి సులభతరం
రమణ మహర్షి సన్నిధానం

రాచపుండు వచ్చిన భయ పడడు
నొప్పి అని బాధపడడు
అన్నిటినీ భరించే ఆత్మనిబ్బరం
కలవాడు
మాములు మనిషిలా ప్రవర్తించనివాడు
అందుకే అతడు ఆరాధ్యుడు
భక్తితో పిలిస్తే పలికేవాడు
కోరిన కోరికలు తీర్చువాడు
వెన్నంటి నడిచేవాడు
వెలుగులు నింపేవాడు!!
                కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.    8309920625
12
[31/12, 9:12 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్2).      31--12--2021.
పిన్నక నాగేశ్వరరావు. 
అంశము :-- రమణ మహర్షి జయంతి.

శీర్షిక  :-- భారతీయ ఋషి.

1. తే.గీ.
తండ్రి సుందర, మగళమ్మ  తల్లి కాగ
తమిళనాడు తిరుచ్చుళిన్ తాను పుట్టె 
పేరు వెంకటరామన్ గ పెట్ట నతడు 
నేక సంథాగ్రహిగ  పేరు నిడిరి హితులు.

2. తే.గీ.
పదునారు వత్సరముల ప్రాయమందు
మోక్షపున్ జ్ఞానమును తాను పొంది పిదప
తనను "అతియాశ్రమి" గ ప్రకటనను చేసి
స్థిరపడె నరుణాచల గిరుల పైన.

3. తే.గీ.
తక్కువగ మాటలాడెడు తత్త్వ మరసి 
మౌనముగ నుండునెపుడు రమణ మహర్షి
మౌన సందేశమును పొందలేని వార్కి 
మాత్రమే మాటలను చెప్పు మార్గదర్శి.

4. తే.గీ.
ఆత్మ జ్ఞానమె బోధనలందు ముఖ్య
మనును, స్వీయ శోధనె యుత్తమమను,
                                                   నిదియె
మోక్షమునకు సులభ మార్గమనెడు వాడు
నుపనిషత్తులు,వేదాంతములనె గాక
నితర మతముల బోధన లిచ్చువాడు.
**************************************
13
[31/12, 9:15 pm] +91 85000 99051: మహిమాన్వితం
~~~~~~~~~~~
నిన్ను నీవు తెలుసుకుంటూ 
నీలో దేవుని ధ్యానిస్తే 
మహానుభావుల మార్గంలో, 
ఆదర్శమూర్తుల అడుగుజాడలలో 
మును ముందుకు మనము సాగుతుంటే,
ఓర్పు, సహనం పాటిస్తూ, 
నిష్ఠతో స్మరణ చేస్తుంటే,
భక్తి మార్గాన పయనిస్తే, 
ముక్తి,మోక్షం తథ్యం తథ్యం.
మనలో ఉన్న మహాదేవుని 
దర్శన భాగ్యం కాదు దుర్లభం 
మానవత్వమే మహిమాన్వితం
====================
టేకుమళ్ళ.విజయలలిత
ఉపాధ్యాయిని
14
[31/12, 9:17 pm] Aparajith: నూతన సంవత్సరం!

ఆనందాల ఊహల ఉల్లాసంతో 
కలల రాణిలా అరుదెంచె నూతన సంవత్సరం 
వణుకు పుట్టించే చలిగాలుల్లో అవని గజ గజ వణుకుతూ 
మంచు తెమ్మెరలతో కురుస్తున్న హిమబిందువులు 
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి!
జలుబు చలిజ్వరాలతో జనం అతలాకుతలం 
దాంట్లోనే కరోనా ఒమిక్రాన్ భయం సరేసరి!
నూతన సంవత్సరమంటే యువత కొంగ్రొత్త ఆశలు ఆశయాల ఆలోచనలుండాలి 
ఈ వత్సరం తాగుడు తిండితో ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటూ ఆరంభించవద్దు 
కొత్త సంవత్సరం గొప్పదనాన్ని ఒక్కరోజులో కొల్లగొట్టలేం కదా!
కొత్త కొత్త దారుల్లో అరుదైన అందాలు చవిచూస్తూ 
నూతన సంవత్సరం ఆహ్లాద భరితం కావాలి!
విద్య ఉద్యోగాలలో ఉన్నతమైన అవకాశాల నందిపుచ్చుకుంటూ 
గతించిన వెతలు మనస్సులోంచి చెరిపేసి 
నూతన పంథాలో వైవిద్యభరితంగా ముందుకు దూసుకు పోవాలి!
కారుచీకట్ల కబంధహస్తాల్లో నలిగిన యువతకు 
తొలకరి చినుకుల జల్లుల్లా ఉద్యోగావకాశాలు రావాలని కోరుకుందాము!
కరోనా వైరస్ రూపాంతరాలు సమసిపోయి 
పట్టణాలు పల్లెల్లో వసంతాలు పూయాలి !
కస్టాలు కన్నీళ్ళమయామైన రైతుల లోగిళ్ళలో 
పంటల సిరి సంపదలతో తొలికోడి కూయాలి!
ఆలోచనా ధారలు చైతన్యమై ఈ వత్సరం ఫలవంతమవ్వాలి 
మకరందాలు గ్రోలు తుమ్మెదలు పూల సుగంధాలలో సొమ్మసిల్లినట్లు 
విరితేనియల ఆనందం ఈ వత్సరం సొంతమవ్వాలి!
ప్రకృతి ప్రకోపించకుండా సకాలంలో వర్షాలు కురియాలి 
ఆకాశంలో తూరుపు దిక్కున ఇంద్రచాపం సొగసులద్దాలి 
నూతన సంవత్సరం పచ్చని పైరుల నందనవనాలవ్వాలి!

అపరాజిత్ 
సూర్యాపేట
15
[31/12, 9:42 pm] సునంద వురిమళ్ళ గారు: *కవితా గానం*
తేదీ:31-12-2021
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:రమణ మహర్షి
*******************
స్వీయ శోధనే జ్ఞాన మార్గమని 
ఏ స్థితిలో మనసు ప్రశాంతంగా ఉంటుందో
అదే సమాధి స్థితియని
అక్కడే దేవుని స్వరూపాన్ని దర్శించగలుగుతుందని
బోధించిన మహితాత్ములు రమణ మహర్షి!
జన్మ రాహిత్యాన్ని 
ముక్తి మార్గాన్ని చూపే దీప స్థంభం!

నిర్లక్ష్యమే నిజమైన శత్రువనీ
ఆయుధాల కన్నా ఆవేశం
మహా ప్రమాదమని
మనలోని అరిషడ్వర్గాలను అధిగమించేందుకు
ధ్యానమే ప్రధానమని బోధించిన
మహా జ్ఞానర్షి రమణ మహర్షి!

 *వురిమళ్ల సునంద, ఖమ్మం*

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...