Skip to main content

రాజీనామా ఫాల్గుణ పౌర్ణమి

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
******************************
కవివరుల జాబితా
1.కోరాడ నరసింహరావు గారు
2.దోసపాటి వేంకటరామచంద్రరావు గారు 
3.అపరాజీత రెడ్డి గారు
4.గంటి మీనా కుమారి గారు 
5.మద్ధి పుల్లారావు గారు 
6.లలితా చండి గారు
7.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
8.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
9.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
10 . కె.దేవికారాణి రత్నాకర్ గారు
11.కొంజేటి రాధిక గారు
12.కొమురవెల్లి అంజయ్య గారు 
13.ఏడెల్లి రాములు గారు 
14.డా.భమిడి మఱ్ఱి కమలా దేవి గారు 
15.గొర్రెపాటి శ్రీ ను గారు 
16.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు 
17.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు గారు 
18. మేకల రామస్వామి గారు 
19.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
20.సింగీతం సంతోష్ కుమార్ గారు 
21.వేమూరి సత్యవతి గారు 22.దేవికారాణి రత్నాకర్ గారు
23. కవిత వెంకటేశ్వర్లు గారు
24. దారల విజయకుమారి గారు
 25. సింహాద్రి వాణి గారు
*********************
1.
. ( విన్నపాలు ... !)
. ***************
రాజీనామా చేసెయ్యాల్సిందే !
ఎన్నాళ్లీ... ఆత్మవంచన చాకి రీలు.... !
    నిలదియ్యలేక...., ఎదురు నిలువలేక..., అన్యాయానికి వత్తాసుపలుకుతూ....... !
       ఎదురుతిరిగి బ్రతకలేమనే 
భయంతో... ఈ జీవచ్ఛవపు బ్రతుకు ఇంకెన్నాళ్లు... !?
      స్వేచ్ఛలేని బ్రతుకు..... 
  చావుతో సమానమే కదూ.. !
     పులులు, సింహాలవంటి క్రూర మృగాల నెదిరించి.... ధైర్యంగా బ్రతకగలిగిన మనిషి కి... సాటి మనిషినిచూసి,భయ పడే ఈ దౌర్బల్యమెలాదాపురిం చిందో...... !!
      ఆరునెలల సావాసంతో.... 
 వారే వీరైపోయినట్లు...., సహ జత్వాన్ని కోల్పోయి... ఈ ఆవ లక్షణాలన్నీనా..... !
     నాలోని... నీతి, నిజాయతీ 
ఏమైపోయాయి.... !?
జాలి,దయ..
. ఎటుపోయాయి?! 
      కపటనటనలు - నయవం చనలు ఎప్పుడువచ్చి చేరాయి 
    ఇంకా ఇలానే ఉపేక్షిస్తే...., 
   నాలో మనిషి పూర్తిగామాయ
మైపోయి... మృగమే మిగిలే ప్ర మాడం దాపురించేలా వుంది ! 
 ఇకనైనా... త్వరపడి.... 
    ఈ అమానవీయ బ్రతుకుకి 
రాజీనామా ఇచ్చేయ్యాల్సిందే!
    ఆత్మ తృప్తితో... ప్రశాంత జీవనానికిశ్రీకారంచుట్టేయాల్సిం దే....!!
    ఓ దారితప్పిన సమాజమా !
నా ఈరాజీనామాను స్వీకరించి 
నా సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను... !!
       ******************
2.
2
అంశం:రాజీనామ
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:సమయస్పూర్తి
జీవితపోరాటంలో ఎన్నెన్నో మలుపులు
ప్రతీ మలుపు ఒక గుణపాఠం
ప్రతి గుడపాఠం ఒక అనుభవం
ప్రతి అనుభవం ఒక అనుభూతి
ఆ అనుభూతులే మార్గదర్శకాలు
గెలుపోటములు సహజాతిసహజములే
రాటుదేలితే రత్నాలు పొందవచ్చు
దొరికేవన్ని రత్నాలు కాకపోవచ్చు
రాళ్ళుకూడా రత్నాలనే భ్రమపడవచ్చు
మనప్రగతి ఇతరులకు అసూయే
మన మార్గం ధర్మపధం
ఆటంకాలు కలిగిస్తారు
నీతినిజాయితిలనే నమ్ముకుంటాము
అవరోధాలు కల్పిస్తారు
మనసునచ్చని పని చేయలేం
రాజీనామా తప్పదు
సమయస్పూర్తితో వ్యవహరించాల్సిందే
స్తితప్రజ్ఞతను ప్రదిర్శించాల్సిందే
ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేయాల్సిందే
ఆత్మనిబ్బరం కావాల్సిందే
వేడిగా ఉన్నప్పుడే ఇనుమును వంచగలం
నిరాశనిస్ప్రహలు దూరంకాల్సిందే
రాజీనామా చేయాల్సిందే!
3.
అంశం రాజీనామా
శీర్షిక : ప్రకృతి ప్రవృత్తి,,,,,,!
పేరు: అపరాజిత్ రెడ్డి
ఊరు: సూర్యాపేట
ఫోన్ 9848532031

జీవితమంటే మందార మకరందాల
సుగంధాల మార్దవ రసరమ్య గీతం కావాలి!
పువ్వు పుట్టగానే పరిమళాలు వెదజల్లినట్లు
లేఖిని లిఖించే సుతిమెత్తని పదబంధాలతో కావ్యమవ్వాలి!
జీవిత పుటలన్నీ విరితేనీయలు గుమ్మరించినట్లు
తన్మయత్వంతో మనస్సు విరిసిన పూవై
తుమ్మెదల ఝంకారాలతో రసరమ్యంగా
అక్షరాలు అల్లుకున్న మల్లెల మాల లవ్వాలి!
కనుపాపాల గోళాలు రెండు
సూర్య చంద్రుల వెలుగులలో పూత రెమ్మలు అవ్వాలి!
పొగమంచు లోని మంచు బిందువులు పడి
మొగ్గలు పూవులై వికసించాలి!
జయజయ ద్వాణాలతో దేవుడి పల్లకీ ఊరేగుతూ
రాత్రిపూట ఊళ్లోని ఆడపడుచులు ఇంటి ఇంటికి మంగళహారతులతో స్వాగతించాలి!
ఆకాశంలోని నక్షత్రాలన్నీ దోచుకుని వచ్చి
ఆలయప్రాంగణంలో తోరణాలు కట్టాలి!
పాలకోవా లాంటి పాపాయి పాకుతుంటే
ఇంటిపట్టున ఆవుల పాలు జున్ను మీగడలే!
కాలచక్రం గిర్రున తిరిగింది
ఆడపడుచులద్దని కృత్రిమ పసుపు రంగుల కడపలు కన్నీళ్ళు పెడుతున్నాయి!
ప్లాస్టిక్ పూలు మనుషుల కృత్రిమత్వంతో
రాజీపడక రాజీనామా చేస్తూ వసంతాలు శాశ్వతంగా నిష్క్రమించాయ్,,,,,,,,!!

అపరాజిత్

హామీ పత్రం : ఈ కవిత నా కలం సేతయని నా హామీ
4.
4
గంటి .మీనాకుమారి 
జిల్లా 
*
శ్రీకాకుళం
ఫోన్ నెంబర్ 
*
9494205334
కవిత
*
కవితా గానం సీజన్ 3 వారు నిర్వహిస్తున్న పాల్గుణ మాసం కవితల పోటీ కొరకు 
అంశం : రాజీనామా  
శీర్షిక: "మగువ రాజీనామా "
______________________________________
    రాజీనామా !
ప్రతి ఉద్యోగి తన ఇచ్ఛతో చేయవచ్చు రాజీనామా 
 గృహిణికి లేదే రాజీనామా 
స్త్రీ కెక్కడిదీ రాజీనామా 
ఉద్యోగానికిఇస్తే ఇవ్వవచ్చుగాక  
ఇంటిపనులకు లేదుగా రాజీనామా 
సూర్య,చంద్రులతో పోటీపడి  
 గడియారంతోపరుగులు పెట్టి
గడిసేపైనా విశ్రాoతి ￰ఎరుగక
యంత్రంలా పనిచేస్తూ  
జీవనపయనం సాగిస్తూ  
తనవారికొరకు తపిస్తూ  
బిడ్డల క్షేమం దృష్టిలో పెట్టి 
భర్తకు అన్నీ అమర్చ్చిపెట్టీ  
ఇల్లంతాసర్ది పెట్టి 
రోజూ చేసే పనైనా విసుగు చెందక  
ప్రతినిత్యం నూతనోత్సవాహం తెచ్చి పెట్టుకొని  
ఇంటాబయటా చక్కబెట్టి 
ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి  
ఒక్కమెచ్చుకోలుకై ఎదురుచూసి
అదిరాదనీ తెలిసి మనసుకు నచ్చజెప్పి
ఇంటిపనులలో తానే పనిమనిషిగా ,వంటమనిషిగా,చాక￰లిగా పిల్లలకు చదువు చెప్పే వేళటీచెర్గా ,ఇంటి లెక్కలు చూసేవేళఆడిటర్గా రక రకాల అవతారాలెత్తి  
పిల్లల చదువులు ఉద్యోగాలు ,పెళ్లిళ్లు ,మనుమలతో ఇల్లు తీర్చిదిద్ది  
జీవితచరమాంకంలో కూడా తపనతో పనిచేసి పెట్టి 
భగవంతునిఆజ్ఞతో కన్నుమూసి వెళ్లిన వేళఇచ్చును ఈ భువికి తన రాజీనామా 

5.
5
మద్ది.పుల్లారావు 

కవిత
*
కలియుగపు జీవితాలు
కలతల నడుమ రాజీనామాలు
ఏ పని యందు శ్రద్ధయుండదిచట
రాజీనామాకు వేయునదియే బాట
మిడిమిడి జ్ఞానంతో వేయుదురు ముందడుగు
కనిపించును దారిలో బురదమడుగు
సంబందాలన్నీ ఆర్థికాలే
అవసరాలు తీరిన పిదప రాజీనామాలే
ఆస్తి పంపకాల వరకే అన్నదమ్ములు
ఆలి వచ్చిన పిదప రక్తసంబందానికి రాజీనామాలే
చిన్న చిన్న తగవులతో ఆలుమగలు
విడాకులతో నూరేళ్ళ బందానికి రాజీనామాలు
కార్యాలయాల్లో కఠిన సమస్యలు
బేజారగుతూ సమర్ధులు సైతం రాజీనామాలు
నాయకులకు ఉండవెపుడు కారణసహిత రాజీనామాలు
వారిచ్చేవన్నీ స్వార్ధ పూరిత రాజీనామాలే
అమ్మతనానికి ఇచ్చేస్తున్నారు కొందరు రాజీనామా
సరోగసీని ఆశ్రయించుట వరమా?శాపమా?
వ్యవసాయం గిట్టక కర్షకుల రాజీనామా
ప్రోత్సాహకాలు లేవని పారిశ్రామిక వేత్తల రాజీనామా
ఉద్యోగాలు లేవని చదువుకు విద్యార్ధుల రాజీనామా
గ్లోబల్ వార్మింగ్ తో వరుణుడు రాజీనామా
మితిమీరిన స్వార్ధం తో మంచికి పలికిరి రాజీనామా
అశాంతి,అమంగళాలయ్యాయి మన చిరునామా
మాటపై నిలబడుట మానవ ధర్మం
నేడది లేకపోవుట మన కర్మం
రాజీపడగలిగిన నాడు రాజీనామాలుండవు
చక్కని ఆలోచనలతో కదులుదాం
విశ్వశ్రేయస్సుకు బాటలు వేద్దాం
6.
6

లలితా చండి

అంశము .....రాజీనామా


 జీవితం అంటేనే అనుక్షణం రాజీ
ఆరడుగుల దేహం రాక
ఐదు అడుగులతోన రాజీ
ఆకలికి పచ్చడి మెతుకులతోనో  
గుక్కెడు నీళ్లు తోనో రాజీ
జీవితంతో రాజీ కుదరనప్పుడు 
ఆఖరిన మిగిలేది అదోరాజీనామా
భార్య భర్తల నడుమ రాజీ కుదరనప్పుడు 
ఒప్పందాలతో విడాకుల రాజీనామా!

 రాజీ కుదరనపుడు 
చేసేదే రాజీనామా
రాజకీయలలో ఎక్కువగా  
పనికొచ్చే పదం 
ఒకరికి పట్టం కట్టేందుకు
కావాలి ఒక రాజీనామా 
 పదవికిఅ ముప్పువస్తుంటే
 అందంగా తప్పు కునేందుకు
  రాజీనామా ఒక అస్త్రం
 చేసిన స్కాములు బయటపడే లోపు  
కప్పుకునే ఓ వస్త్రం
 కొన్నిచోట్ల రాజీనామా శస్త్రం  
 ఉద్యోగాలలో ఎన్నో రాజీనామాలు   
 పెంపులకో పంపకాలకో
 రాజీ కుదరనప్పుడు తప్పదు రాజీ నామా! 
  అమ్మ రాజీనామా చేస్తే...
  అద్భుత చిత్రమేగా!
7.
7
అంశం: రాజీనామా 
శీర్షిక... అమ్మ రాజీనామా 
స్వీయ రచన:::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
పాతర్లపాడు....ఖమ్మం .
***********************************************************

జన్మనిచ్చిన తల్లి పురిటి నొప్పులు మరిచి
మోము ముద్దాడుచు గోముగా తల నిమిరి 
చనుబాలు పట్టి మురిసి మెటికలు విరిచి
కనుపాపలను పెట్టి కావలి కాయుచు !!

ఏ రోగమొచ్చి ఏమౌతుందోనని
ఏమరుపాటున కునుకు తీస్తుంటే
ఏగోలమొచ్చి ఎత్తుకెళ్తుందేమోనని
ఏనాడు పోలేదు నిద్ర... నీవు పెద్దయ్యేవరకు!!

కంటికింపైన నిద్ర పోకుండా
ఇంటి చూరు కింద వెన్నెల్లో ఆడించి 
గోరు ముద్దలు పెట్టి పెద్ద చేసి...!!

తేరు మీద నీవు తిరుగాడు తున్నట్టు
పరగు భ్రాంతిలోన పరుగు దీయుచు
కాలంతో కాలుదువ్వి కళ్ళెం వేసి నిలువరించి 
కష్టాలకు ఇష్టమనే తావులు పులిమి !!

ఇంటిల్లిపాదీ భారాన్ని బండెడు చాకిరీని
ఒంటి చేతితో తొణకక బెణకక సాధించే అమ్మ
ఏనాడూ అనలేదు అమ్మో అని!!

ఆమయము లెన్నడు అమ్మను ఆపలేకపోయాయి
ఆమె అనుష్ఠించినవన్ని ఆమె అనుకున్నట్టు గానే
ఆవిష్కరించబడినాయి అవధులంటు లేకుండానే!!

ప్రాయమంత కరిగి... కాయమూ సడలి పోయినా 
అమ్మ సెలవు చీటీ ఇవ్వలేదు జీవితంలో ఒక్కసారైనా!!

ఎనబై ఐదు సంవత్సరాల ముదిమి వయసులో
ముక్కు చీదింది లేదు... అయినా హఠాత్తుగా

 హృదయంలో నొప్పిరా నాన్నా ఈ రోజే నా ఆఖరి రోజు
అంటూ రాజీనామా పెట్టేసింది ఈ లోకానికి!!
వెలుగులు చిమ్మే దీపావళికి తాను వెలుగులు చిమ్ముతానంటు చిమ్ముతూ వెళ్ళి పోయింది!!
 8.
కవితాగానం (సీజన్-2) ఫాల్గుణ మాస పౌర్ణమి కవితల పోటీకి
తేది:-27-02-23
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- హైదరాబాద్
9963265762
అంశం:- రాజీనామా
శీర్షిక:-
ప్రగతికి సోపానమే
.............................
పుడమి పై పుట్టినది మొదలు
పంచభూతాలలో కలిసేసమయం వరకు
మానవజన్మ రాజీనామాల పర్వమే..!!

బాల్యంలో అమ్మ నాన్నలకు
ఐదో సంతానంగా ఆడపిల్లనై జన్మించినపుడు
పండుగనాడే కాదు పుట్టినరోజున కూడా
రాజీనామా పడి అక్కల వస్త్రాలనే అమ్మ చెప్పినట్లు ధరించాను..!!

జిల్లాకే కళాశాలలో ప్రథమస్థానంలో నిలచి
రాష్ట్రస్థాయిలో పదవస్థానం సంపాదించి
డాక్టర్ గా అవ్వాలనుకుంటే
ఆడదానివి నీకెందుకు అని
అన్నయ్యను డబ్బుపెట్టి చదివించినపుడు రాజీ పడ్డాను..!!

అక్కయ్య ఇద్దరుపిల్లలకి జన్మనిచ్చి అర్ధాంతరంగా తనువు చాలిస్తే నాన్న కోరికపై రాజీ పడి బావను పెళ్ళిచేసుకున్నాను..!!

చాలీచాలని జీతంతో బావ పడుతున్న బాధను చూసి
ఉద్యోగం చేస్తానంటే
నేను అసమర్థుడిని కాదు భార్యాపిల్లలని పోషించగలను అన్న బావతో రాజీ పడ్డాను..!!

షిరిడిసాయి చెప్పిన ఓర్పు సహనంతో అక్క పిల్లలనే
నా పిల్లలని భావించి చదువు సంస్కారం నేర్పి
ప్రయోజకులై నన్ను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటున్న సమాయాన అనుకున్నా
జీవితంలో రాజీపడటమే
ప్రగతికి సోపానమన్నది...!!
..............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
................................
9
కవితా గానం సీజన్ 3
ఫాల్గుణ మాస పౌర్ణమి కవితలు పోటీకి
అంశం: రాజీనామా
శీర్షిక:నైతిక బాధ్యత .


రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా ఎంచిన శ్రీరాముడు మన కాదర్శం.
ఆయన బాటలో నడిచి ఎందరో అయినారు చిరస్మరణీయులు.
కేంద్రమంత్రిపదవులను పూచికపుల్లలుగాతలచి చేసారు రాజీనామాలు.
రైలుప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామచేసి ఆదర్శులయ్యారు శాస్త్రి గారు.
ఎందరో త్యాగమూర్తులు తమ ఉన్నత పదవులకు చేసిన రాజీనామాలే స్వాతంత్రోద్యమ సోపానాలు.
నాడు రాజీనామాలు మహోన్నత వ్యక్తి త్త్వాలకు‌ ప్రతిరూపాలు.
   
స్థితప్రజ్ఞతకు నిదర్శనాలు.
నైతిక నిబద్దతకు నిలువుటద్దాలు.
నిశ్ళబ్ద విప్లవాలు.
రాజీనామా అనే పవిత్రపద
 పరమార్ధాన్నే మార్చాయి నేటి రాజకీయాలు.
రాజీనామాలయ్యాయి బెదిరించే జీవ రసాయన బాంబులు.
పదవీ కాంక్షకు పరాకాష్టలు.
బుజ్జగింపులకు,బేరసారాలకు రాచమార్గాలు.
పదవిస్తే స్తోత్రాలు,రాకపోతే రాజీనామా అస్త్రాలు.
పార్టీకి చేస్తారు రాజీనామా,పదవిని మాత్రం వదలరు.
విధులను సరిగానిర్వర్తించలేకపోతే
రాజీనామా చేయండని గురివిందల్లాంటి ఆఫీసర్ల గదమాయింపులు.
మా పని చేయకపోతే రాజీనామా చేయండని మంత్రుల హుకుంలు.
మానసిక ఒత్తిడితో ఉద్యోగుల రాజీనామాలు,ఆత్మహత్యలు.
రాజీనామాలీయండని హింసిస్తారు శాడిస్టు లు.
నైతిక విలువలకు కట్టుబడి చేస్తారు రాజీనామాలు యోగి పుంగవులు.
స్వార్థంతో చేస్తారు రాజీనామాలు ఊసరవిల్లులు.
రాజీనామా కానేకారాదు పాశుపతాస్త్రం.

తిప్పావఝల నరసింహమూర్తి

బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
10
కవిత గానం సీజన్ 3
ఫాల్గుణ మాసం కవితల పోటీకి..
అంశం రాజీనామా
శీర్షిక : తిరస్కృతి.
రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
------------------------------
--ఆత్మాభిమానం ఉల్లిపాయని
అతిపెత్తనం కత్తితో కొస్తే
విరిగి ముక్కలైన మనసు
ఎదురు తిరిగి పౌరుషంధాటితో
తెప్పించిన కంటనీరు.... రాజీనామా


నిజాయితీ పెంచిన ఆత్మగౌరవం
క్రమశిక్షణలనిమ్మకు నీరెత్తినప్పుడు
యాజమాన్యపు జులుం అడకత్తెరలో
శ్రమ శక్తిని పోక చెక్కని చేసినప్పుడు
అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడే ఈ రాజీనామా..

బాధ్యతలు బరువై గుండె చెరువై
దారి తెన్ను తెలియక నిస్సహాయతతోచేసే
స్వయం ఉపసంహరణే.... ఈ రాజీనామా

దీక్ష దినచర్యగా కష్టం పెట్టుబడిగా
విలువల రాట్నంపై ప్రతిభాపాటవాలు
సృజనాత్మకతల పడుగూ పేకా అల్లినప్పుడు
నిరాదరణ మరయంత్రమై వెక్కిరించినప్పుడు
ఎంచుకున్న వృత్తి పెంచుకున్న ప్రవృత్తి
నీవేలితో నీ కన్నే పొడిచినప్పుడు
సంధించిన చివరి ఆయుధం.. రాజీనామా..

అంచనాలు తలకిందులై అశక్తత బలీయమైనప్పుడు
నైతిక బాధ్యతావహనం... కొందరి రాజీనామా

దుఃఖం ఘనీభవించి నైరాశ్యం గుండెలో చిక్కబట్టినప్పుడు అవ్యక్తమైన విషాదం
ఓటమి నిజాన్ని అంగీకరించి గాంభీర్యపు ముసుగు వేసుకొని పరిణతితో వెలువడే వెడ నవ్వు ఈ రాజీనామా....

అనుబంధాలకు ఆత్మీయతలకు ఇవ్వలేవులే రాజీనామా
 అది తుదిశ్వాస వరకు వెంట వచ్చే జీవిత బీమా..
11
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను...
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం... రాజీనామా
శీర్షిక... నిష్క్రమణ

ఉపసంహరించుకునే బాణం లాంటిది కాదు రాజీనామా అంటే...
 ఐదేళ్ల పదవికో, స్వచ్ఛందంగా ఉద్యోగం నుండి విరమించుకునే నిష్క్రమణ కాదు రాజీనామా...
రాజీ పడని జీవిత పోరాటానికి బతుకు మంత్రం తెలిసినా రాజీ పడక రాజీనామా చేస్తే మనసును బంధించినట్టే...
 వయసుకు రాజీనామా ఉందేమో కానీ మనసుకు కాదు...
 బంధాలకు బాంధవ్యాలు,బాద్యతల పర్వతాలను మోసి మోసి బతుకు బరువెక్కినప్పుడు రాజీనామా చేయాల్సిందే తప్పదు మరి...
 నీకు అభిలాషనీయమైన బతుకుకై నీవు వెతుక్కునే సంతోషానికై ఉన్న బాధ్యతల అంపశయ్య నుంచి విముక్తి కోరాల్సిందే...
  మనసు నిష్క్రమింపజేసుకోవడమంటే మరణించినట్టే..
అపప్రదలు ఆ లింగనం గావించి పదవీ భ్రష్టతనొ నరిస్తే తప్పక రాజీనామా చేయాల్సిందే...
 సద్యోగం సమస్యల సుడిగుండం లోనికి లాక్కెళ్ళి బతుకు మునక తప్పనిసరైతే రాజీనామా చేయాల్సిందే...
రాజీ పడక, రాజీ కుదరక బతుకులో పరిస్థితులు నిప్పు రాజేస్తే,
 బతుకు దగ్ధం కాకమునుపే రాజీనామా చేయాల్సిందే... మనసు రక్తసిక్తం కాకమునుపే,
 రణక్షేత్రం కాకమునుపే రాజీనామా చేస్తేనే జీవితానికి శాంతి లేపనం రాసుకుంటేనే బతుకు ప్రశాంతత.
12
రాజీనామా
జేబులో 'రాజీ'నామా పత్రం
గాలిలాంటోళ్లు నీడలా వస్తారనుకున్నా
ఉప్పు తిన్నవాళ్లు ఉడుంలా ఉంటారనుకున్నా
వెంట పెంపుడు కుక్క కూడా రాలే
అవకాశవాదినని అందరికీ తెలిసిందేమో

ఇంట్లో ఆల్ రౌండర్ అమ్మ
జేబులు కాదు కడుపులు చూస్తది కమ్మగా నింపేందుకు
ఉన్నదాంట్లో సర్దుబాటు చేయడంలో దిట్ట
అమ్మ రాజీనామా చేస్తే చమురు లేని దీపం వెలిగించినట్లే

జై కిసాన్ నినాదం అయింది బై కిసాన్
విత్తు విత్తంగా మారకున్నా
పంటెనుక పంట మారని జీవితం
మట్టిని నమ్ముకున్నోళ్ళు మట్టిలో కలుస్తున్నారు
రైతు రాజీనామా చేస్తే లోకం చిప్పలో ఆకలి దొప్ప

పిల్లలు నవ్వుల కొవ్వొత్తులు
మరిపించి మురిపించడం తెలిసిన విద్య
కలిసి మెసిలితే వయసు మరుస్తాం
జ్ఞాపకాలుగా మిగిలిపోతే మిగిలేది కడుపులో దుఃఖం

ప్రజల పేర వంచకులు పాలకులు
ఓటును చెల్లని నోటులా చేయడంలో దిట్టలు
మో చేతికి బెల్లం పూత పూయడంలో సిద్ధహస్తులు
వారి రాజీనామా కోసం ప్రజల ఎదురుచూపులు

రాజీనామా పక్కలో పెట్టుకుని పడకేసినా
ఆపేసే ఆపద్బంధువుల కోసం ఎదురుచూపులు
పాణానికి ప్రాణమన్నోళ్లు అడ్డుకుంటారనుకున్నా
కన్నీళ్ల ఎక్కిళ్లతో చేతులెత్తేశారు
అందరికీ ఆఖరి శ్వాస మీద ధ్యాస
..................................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేది...28-02-2023
13
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
కవితా గానం -3
అంశం*రాజీనామా
శీర్షిక*పృథ్వీ సమ్మెట 

సృష్టి లో శృతి లయలు
జీవన మాధుర్య గీతికలు
పంచభూతాల సమ్మేళనం
మనిషి ముని జీవితం 

సౌశీల్యం సహనం 
భూమి నేర్పిన పాఠం
సౌభ్రాతృత్వం సమానత్వం
గాలి నీరు అందించిన సహజన్యాయం

నిత్యం నిజాన్ని అన్యాయం చెరబడుతుంటే
కోపతాపాలకు అధికారం పొగపెడుతుంటే

ధర్మం మూగబోతుంది
న్యాయం మౌనంగానే నవ్వుకుంటుంది

బ్రతుకు అర్థం కాసుకు తులాభారం
స్వచ్ఛతకు స్వేచ్ఛకు కారాగారం

శాంతి 
విస్పోటనానికి గురౌతుంటే
ఎవరు రాజీనామా లేఖ రాయాలి
సౌమ్యం 
సౌజన్యం కోల్పోతుంటే
ఎవరు కళ్ళు తెరుచుకోవాలి

మతాల మధ్య రక్తపాతాలు
దేశాల మధ్య సంధి కుదరని యుద్ధోన్మాదాలు చెలరేగి
బాంబుల్లో మనుషులు దగ్దమౌతుంటే
ఎవరు రాజీనామా లేఖలు రాయాలి 

ఒక పుటుకకు
ఒక చావుకు సహజత్వం ఇవ్వలేమా
చరితకు అంటుకత్తెరలేని అక్షరం అందించలేమా

పదవి కుర్చీ కాళ్ళకింద
హత్యలు నిత్య సూత్రాలు లేని
అధికారం జనమైత్రిని కోరేదెపుడో
సంపుడు పందేలు లేని
విశ్వవిద్యాలయాల జాడలెక్కడో 

మనిషి మనిషిని
సంస్కరించే జ్ఞానం కోసం
ఎన్ని కన్నీళ్ళతో సత్యం అభిషేకించాలో 
అహింస అవనిపై నిలబడడానికి
మలినమంటని చిరునవ్వులు
చిరంజీవిగా వర్దిల్లాడానికి
ఎవరు రాయగలరు రాజీనామాను 

వారికి ఈ పృథ్వీ తరపున శుభాకాంక్షలు 
వారికే అసలు సిసలైన
హృదయ స్పందనల మాలలు 

ఏడెల్లి రాములు ✍️
ది*01*03*23(04*11)
ఎల్కలపెల్లి 🌹
జిల్లా* పెద్దపల్లి
14
ఫాల్గుణమాస పౌర్ణమి నగదు
బహుమతి కవితా పోటీకి
నాకవిత
అంశం : రాజీనామా
శీర్షిక : లేదు రాజీనామా
ఉంటుంది రాజీనామా
ఉద్యోగాలన్నిట
చేస్తూంటారు రాజీనామా
మంత్రులు, రాజకీయనాయకులు
యాజమాన్యం నచ్చకపోయినా
తాను అనుకున్నట్లు ఉపాధి
సౌకర్యాలు లభ్యంకాకపోయినా
పై అధికారులతో మనస్పర్థలు
వచ్చినా ఇస్తారు రాజీనామా
పత్రాలను
మనస్ఫూర్తిగానే జరుగుతుంది
రాజీనామా తంతు సాధారణంగా
అనివార్యకారణాలవలన
అధికారుల ఒత్తిడివలన
ఇవ్వవలసి వస్తుంది రాజీనామా ఒక్కొక్కపరి
సర్వసాధారణము ఇది
అన్ని కార్యాలయాలలోను
ఐతే రాజీనామా లేని పోస్టు
ఉంది ఒక్కటే ఒక్కటి లోకంలో
అదే గృహిణి పోస్టు
లేవు సెలవురోజులు, ఆదివారాలు
అన్నిరోజులు ఒకటే ఈపోస్టుకి
చేయవలసిందే ప్రతీపనిని
లేచింది మొదలు నిద్ర పోయేటంతవరకు
తప్పవు నైట్ డ్యూటీలు ఒక్కొక్కసారి
లంచ్ బ్రేకులు, టీబ్రేకులు లేని
గొప్ప ఉద్యోగమిదే
పరగణనలోనికి రాని ఓవర్ టైమ్ గంటల పని
రాజీనామా ఇద్దామన్నా ఇవ్వలేని పోస్టు
అత్తమామలను ఆదరిస్తూ
ప్రేమాభిమానాలను భర్తకు
కుటుంబ సభ్యులకుపంచుతు
పిల్లల ఆలనాపాలనా చూస్తూ
బావమరుదులతో వదిన ఆడపడుచులతో,తోడికోడళ్లతో సఖ్యతగా మెలగుతూ
నెగ్గుకువస్తుంది గృహిణి
పోషిస్తుంది ఎన్నో పాత్రలను
భార్య,అమ్మ, అక్క చెల్లి; వదిన , మరదలు అన్నీతానే
సవ్యసాచి ఈమె
అనురాగ మమతలు పంచు
తుంది అమ్మలా
అవుతుందితానేతొలిగురువు, అపరధన్వంతరి
త్యాగమయి, సహనశీలి, శాంతమూర్తి కరుణామయి
గృహిణి
కార్యదక్షురాలు ఇంటాబయటా కూడా నిర్వహిస్తుందిసర్వకార్యాలను సమర్థవంతంగా
లేదు రాజీనామా ఈపోస్టుకి
రాజీనామా లేని ఒకే ఒక్క పోస్టు ఇది
కష్షనష్టాలను భరిస్తూ చేయవలసిందే ఈ ఉద్యోగాన్ని
సమర్పిస్తారు ఉద్యోగస్తులు
రాజీనామా పత్రాలను సంబోధన సంతకాలతో
 పై అధికారులకు
మరి గృహిణి ఎవరికి ఇస్తుంది
రాజీనామాపత్రాన్ని
కన్నతల్లిగ ఎవరికి అందజేయ గలదు తన రాజీనామా పత్రాన్ని
లేనేలేదు రాజీనామా ఈ ఫోస్టుకి.
పేరు : డా. భమిడిమఱ్ఱి కమలాదేవి
15.
"కలిసి వుంటే కలదు సుఖం !"  

కుటుంబ బాధ్యతలు మోసే నాన్న రాజీనామా చేస్తే..
ఆ కుటుంబం అప్పుల పాలవుతుంది !
కుటుంబ ఆర్థిక అభ్యున్నతికి కారణమైన నాన్న..
శ్రమకి మారు పేరై రాత్రింబవళ్ళు కష్టిస్తూ ..
జీవితమనే నావని
సంద్రమనే కాలంతో పాటు గా
ఇష్టంగా జరుపుతూ కుటుంబ శ్రేయస్సు కు పాటుపడతాడు !
ఇంట్లో వాళ్లకు అన్నీ తానై ..
ప్రేమకు ప్రతిరూపమై నిలిచే అమ్మ రాజీనామా చేస్తే ..
ఆ కుటుంబం సమాజం లో నవ్వుల పాలవుతుంది !
కుటుంబ సంక్షేమమే ప్రాణంగా జీవించే అమ్మ
ఇంట్లోని వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చుతూ..
అక్ష్యయపాత్ర లా ఆదరణకు నెలవై..దేవతలా నిలిచి ..
సంసారమనే నావకి చుక్కానిలా ఉండి సన్ మార్గదర్శిలా
అందరి అభివృద్ధి కి అలుపెరగక కృషిచేస్తుంటుంది !
అమ్మా నాన్నలు బిడ్డల ఎదుగుదలకు మూల స్థంబాలు !
అమ్మా నాన్నలు మనకు నిజమైన నేస్తాలు !
వాళ్లు చెప్పే మాటలు ..
వాళ్లు చూపే బాటలు..
వాళ్లు అందించే ప్రేరణలు ..సదా స్ఫూర్తివంతం !
అమ్మ నాన్న లు ఒక్కటై వున్న సంసారాలు జగతికి విజయ సోపానాలు !
పిల్లలున్న పెద్దవాళ్లు విడిపోవడం తగదు !
తప్పని తెలుసుకోండి !  
వస్తున్న చిన్ని చిన్ని తగవులకే విడాకులంటూ కోర్టుమెట్లెక్కకుండా ..
కన్న బిడ్డల పసి(డి)మనస్సులను చూసైనా మారండి !
ఏదైనా "కలిసి వుంటే కలదు సుఖం !" .
ఒంటరితనం బాధాకరం ..
జంటగా కుటుంబ సమేతంగా సాగే బతుకు పయనం అర్థవంతం !
16
అంశం: రాజీనామా:
డా. నాగలక్ష్మి తంగిరాల

రాజీ పడుతూ బ్రతికే కంటే రాజీనామా చేస్తేనే బెటర్
అక్రమాలు, అన్యాయాలు, ఆందోళనలు కలుపు మొక్కల్లా పెరుగుతున్న సమాజానికి రాజీనామా చేయాలి
కులమతాల జాడ్యం హెచ్చు మీరుతూ
పురాతన కట్టడాల్ని కూల్చువేస్తున్న సంఘాలకు
 చేయాలి రాజీనామా తొలగాలి దూరంగా
హత్యలు కుట్రలు దోపిడీల అగ్ని మంటల్లో
చిక్కుకోకుండా దౌర్జన్యానికి చేయాలి రాజీనామా
అహంకారంతో నేను భర్తను నా మాటే వినాలి అనే మనస్తత్వమున్న మగ మహారాజుల పాలనకు 
చెప్పాలి ఉద్వాసన చేయాలి రాజీనామా
జీవితపు విలువలు తెలియకుండా 
మద్యపాన మత్తులో మునిగిపోతూ మగువులను ఆట బొమ్మల్లా ఆడుకుంటూ
దురలవాట్లకు బానిస లైన చీడ పురుగులను ఏరిపారేయాలి. దగ్గరగా ఉండాల్సి వస్తే 
  చేయాలి రాజీనామా
యాంత్రికం గా టైం అండ్ మనీ కాన్సెప్ట్ తో
కాలం గడుపుతూ స్వస్థానాన్ని మరచి
తల్లి దండ్రులను వదలి వృద్ధాప్యం లో వారి ఆలనాపాలనా చూడకుండా సంపాదనకై అడ్డదారులు త్రొక్కుతూ
స్వార్థంతో గడిపే జీవనానికి
 చేయాలి రాజీనామా
మంచి బాట వేసే నవచైతన్యానికి వద్దు రాజీనామా
సంస్కృతిని గౌరవిస్తూ సమసమాజ జీవనానికి కాదు రాజీనామా
కష్టాల ప్రవాహానికి ఆనకట్ట వేసి
సుఖాల పయనానికి జై కొట్టు
అమ్మా, నాన్న అక్కా, చెల్లి అన్నా, తమ్ముడు భార్యా బిడ్డలు 
అనే బంధాల అనుబంధాల పరిమళ సుమాలు వెల్లి విరిసే ఆనంద నందన వనాలకి చేయకు రాజీనామా
పిరికి వాడివై పారిపోకు
ప్రయోజకత్వం చూపించు
శాంతి భద్రతలు స్థాపించు
సత్య ధర్మాల విలువలను నిలబెట్టు
స్నేహానికి ప్రాణం పెట్టు
 విజయాన్ని చేపట్టు
  చరిత్రలో చిరస్మరణీయం గా మిగిలిపో
చివరిగా ఈ ప్రపంచానికి రాజీనామా
చేసి మరో ప్రపంచంలోకి అడుగిడాలి తప్పదు.
17
అంశం... రాజీనామా
శీర్షిక.... దరఖాస్తు

సంసారపు ఆటుపోట్లకు
గాయపడిన ఆ దేహం
ఎన్ని సార్లు రాజీనామాకు
దరఖాస్తు చేసుకోలేదు 
కానీ.... 

ఆకుపచ్చ బంధాల మధ్య 
కమ్ముకున్న నిశీధి మేఘాలు తొలగి
ప్రేమ వర్షం కురిపించి నప్పుడు
ఆ మనసుకు సప్త వర్ణాలు అద్దుకున్నప్పుడు...

ఒకే దారానికి కట్టిన
సుమ మాలలా
బాధ్యతల బంధాల గోడలు
జగమంత కుటుంబం
నాదంటూ పుడమంత వేళ్ళూనినప్పుడు
ఆ సంతోషానికి నీలి వర్ణాలు 
ఆప్యాయంగా అల్లుకు పోయినప్పుడు... 

ఆత్మ విశ్వాసపు పలుకులతో 
అణువణువునా భుజం తడుతూ 
ఆకుపచ్చ వర్ణాలతో
ఆత్మీయ దుప్పటి కప్పుతున్నప్పుడు.... 

ఎండగట్టి పోయిన హృదయం 
నిస్సత్తువల తలపుల నావను చేరుతుంటే
ఉత్సాహాల తీరానికి చేరుస్తూ
ఎనలేని అభిమానపు ఎరుపు
 మెరుపు వర్ణాలను ఎగుర వేస్తున్నప్పుడు... 

ఛెంగు ఛెంగున ఆడుతూ పాడుతూ
చేరువగా ఆనందాలు పంచుతుంటే
ఎవరికైనా అనిపిస్తుంది కదా
ఈ జీవితానికి విశ్రాంతి అవసరం లేదని...!! 
హామీ...నమస్తే సార్ 🙏ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను సార్ 🙏
మొహమ్మద్ అఫ్సర వలీషా
 ద్వారపూడి (తూ గో జి)
18.
 ఓ రాజీనామా నీకు నమస్సులు
*************************
సమస్యలకైనా సాధనలకైనా
అలుకలకైనా పిలుపులకైనా
పదవులకైనా బాధ్యతలకైనా
పోరాటాలకైనా పొత్తులకైనా
అనుకున్నది సాధించాలన్నా
కలగన్నది నెరవేర్చాలన్నా
ఆశయాల నిచ్చెనలెక్కడానికైనా
ఆలోచనల తీవ్రత తెలుపడానికైనా
నాటినుండి నేటివరకు
సంధించేబ్రహ్మాస్త్రం
రాజీనామానే సుమా
అమ్మ రాజీనామా చేస్తే
ఆకలెవరు తీరుస్తారు
నాన్న రాజీనామా తలిస్తే
ఉన్నతి ఎలా కలుగుతుంది
భార్య రాజీనామా పదమెత్తితే
సర్వం శంకరగిరి మాన్యాలే
ఓ స్థాయిలో రాజీనామా
విజయాన్ని దరిచేరుస్తుందేమో
స్థాయి మించితే మాత్రం
తెగిన పతంగమౌతుంది జీవితం
అందుకే తెగేదాక లాగకుండా
మాటిమాటికి రాజీనామా ఊసెత్తకుండా
సమయోచితంగా,సందర్భోచితంగా వాడితే
వజ్రాయుదమే రాజీనామా
*********************
మేకల రామస్వామి
19
ఆళ్ల నాగేశ్వరరావు 

శీర్షిక : ఆఖరి అస్త్రం

చేసే ఉద్యోగాల్లో
పొందుతున్న పదవుల్ల్లో
ప్రతికూల పరిస్థితులు దాపురించి
ఆత్మభిమానం దెబ్బతిన్న తరుణంలో....
నైతిక విలువలకు విఘాతం కల్గించేలా
అధికారుల ప్రవర్తనా తీరు ఉన్న సందర్బంల్లో
పరిస్థితులతో రాజిపడలేక
మానసిక సంఘర్షణకు లోనైన
ప్రతి మనిషి సందించే ఆఖరి అస్త్రమే రాజీనామా!
తప్పని పరిస్థితుల్లో ప్రతి అభ్యుదయవాది
తన ఉద్యోగాన్ని, పదవిని త్యజిస్తూ రాసిచ్చే పత్రమే రాజీనామా!
లాల్ బహదూర్శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు
దేశంలో ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి
తాను కారణం కానప్పటికి
నైతిక బాధ్యత వహిస్తూ ఆయన చేసిన రాజీనామా
ఆయన పదవీకే వన్నె తెచ్చింది
రాజీనామా అన్న పదానికి వెలుగునిచ్చింది!
ఇలా నైతికతకు ప్రాముఖ్యతనిచ్చి రాజీనామా సమర్పించి
స్వచ్చందంగా పదవులను, ఉద్యోగాలను తృణప్రాయంగా త్యజించిన
త్యాగధనులు ఎందరో ఆనాడు!

అవినీతి ఊభిలో కూరుకుపోయి
ప్రజాదనాన్ని దోచుకుతుంటూ
పందికుక్కుల్లా నల్లదనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటూ
సమాజానికి చీడ పురుగుల్లా దాపురించిన రాజకీయ (వి )నాయకులు,
బడా పారిశ్రామిక వేత్తలు, ప్రజా ప్రతినిధులు, అవినీతి ఉద్యోగులు అడుగడునా తారసపడుతూ,
కోర్టుల చుట్టూ ముద్దాయిలుగా తిరుగుచున్న దుస్థితుల్లోనూ
తమ పదవులను, ఉద్యోగలను త్యజించక
ఆ కుర్చీలనే పట్టుకు వేలాడుతున్నారు నేడు!
నేటి వీరి దుశ్చర్యలకు రాజీనామా అనే పదానికి విలువ లేకుండా పోయింది
అది ఒక బెదిరింపు అస్త్రంగానే మిగిలింది!
20
సింగీతం సంతోష్ కుమార్ 
*
కొందరు ఉధ్యోగానికి రాజీనామ
రాజకీయానికిరాజీనామా
శాసనసభ్యుడు యం.పి.గాఎన్నికైతే శాసనసభ్యత్వానికిరాజినామా
భార్య భర్తకు విడాకులు ఇస్తే రాజీనామాలాంటిదే
రాజీలేని పోరాటం చేసి రంగంలో నుండి మరలితే రాజీరామా
కొత్తగా పదవి లోకి వస్తే పాతవాడు రాజీనామా
చనిపోయి
వెళ్ళిపోతే జీవితానికి శాశ్వత రాజీనామా రెండూ కుటుంబాల్లో గొడవల వల్ల విడిపోతే ఒక రకమైన రాజీనామా....
21
వేమూరి.సత్యవతి
శీర్షిక.. ఇన్ని రాజీనామా లా?
ప్రతి రాజీనామా వెనుకా. కొండంత కథ వుంటుంది!
కొన్ని చోట్ల ఖేదం!, కొన్ని సార్లు ప్రమోదం!!
రాజీనామా ల్లో ఆడా,మగా తేడాలున్నాయండోయ్ !!
మహిళలిచ్ఛే రాజీనామా ల్లో బలవంతపు పరిస్థితులెన్నో!!
అనుమానాలో,అవమానాలో పురుషాహంకారపు బుసలెన్నో!! 
ప్రతిభ, నేర్పులున్నా,విద్యా,వివేకాలున్నా...
ఇంక్రిమెంటు దేముంది? ఇంటిపని ముఖ్య మంటుంది!
మాతృత్వం రాజీనామా తో రాజీ చేస్తుంది!
మరో మంచి మెట్లెక్కి మనసు పడ్డ జీవితం వూరిస్తుంటే లెక్కేలేని రాజీనామా!
లంచపు సొమ్ము కోసం నీతి-నిజాయితీలకి రాజీనామా !
రాజకీయాల్లో విలువలకు రాజీనామా!
ఆధునికత తో 
సంప్రదాయాలకు,సంస్కృతులకీ రాజీనామా!
ఉత్సాహంగా కదం తొక్కాల్సిన యువత మత్తు తో, మాదక ద్రవ్యాలతో వూగుతుంటే
భవ్యమైన భవిష్యత్తుకు రాజీనామా !!
కడపటి దాకా ఎవరూ అంగీకరించనిది అమ్మ రాజీనామా !!
కాళ్ళ నెప్పులు, కళ్ళ బూజులు వంటింటి పని కి రాజీనామా చేస్తే..
రుచులు కోసం హాహాకారాలు, సవాలక్ష సంక్షోభాలు!!
ఉన్నతోద్యోగాలకి రాజీనామా కన్నా
బాధ్యతలకి తాగుబోతుల రాజీనామా మాత్రం మనసుని నిత్యం మెలిపెడుతుంది. ం
బలవంతపు రాజీనామా లు బాధాకరమే!!
బతుకు తెరువుక్కాని, భవబంధాలక్కానీ--

                 &&&&&&&&&-
 ఈ కవిత నా స్వంత రచన!
డా.వేమూరి.సత్యవతి
విజయవాడ.
23.
24.
25

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...