Skip to main content

తొలి మెట్టు

నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి 
**********
కవి వరుల జాబితా
1.శ్రీ కొరడ నరసింహ రావు గారు
2.శ్రీ దీపక్ న్యాతి గారు 
3.గజవెల్లి శ్రీనివాస చారి గారు 
4.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 
5.సింహాద్రి వాణి గారు 
6.కొంజేటి రాధిక గారు 
7.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 
8. కవిత వెంకటేశ్వర్లు గారు 
9.దారల విజయ కుమారి గారు 
10.లలితా చండి గారు 
*"*****
1
....కోరాడ నరసింహా రావు !
......*****************
బ్రతుకు బాటలో.... జీవనగమనానికి ఎక్కవలసి నవి, ఎన్నో మెట్లు... !
  బాల్య, యవ్వన,వృద్దాప్యాలు  
మనిషిజీవితానికి.. ప్రధానమైన మూడు మెట్లే... !!
    ఆమూడుమెట్లనుసునాయా సంగాఎక్కి గమ్యాన్ని సుఖంగా చేరుకోవటమే జీవన సాఫల్యం 

  జన్మనెత్తాక..మనిషిజీవితాన్ని 
చక్రవర్తిని చేసినా... బికారిని చే సినా... ఆవ్యక్తి గొప్పవ్యక్తిగా పే రుతెచ్చుకున్నా, దుర్మార్గుడై... 
దుష్టునిగా ముద్రవేయబడినా ఆ వ్యక్తి యొక్క జీవితానికి మొదటిమెట్టయిన  బాల్యం మీదే ఆధారపడుంది !

 బాల్యంసక్రమంగావిద్యాబుద్ధు
లతో... క్రమశిక్షణగా సాగితేనే 
ఆ వ్యక్తికి సుఖము,శాంతి, పేరు -ప్రఖ్యాతి... !ఆ మొదటిమెట్టే 
సరిగ్గా లేకపోతే...సవ్యముగా దానిని అధిరోహించలేకపోతే... 
పొరబడో... తడబడో... జీవన గమ్యాలైన స్వర్గ - నరకాలలో 
మొదటి అడుగును నరకమార్గపు మొదటి మెట్టుపై వేస్తే..... బ్రతుకంతా నరకమే కదూ.... !

ఆమొదటిమెట్టునుఅవివేకంతో  నిర్లక్ష్యంచేస్తే ఆ గమ్యమ్...అగ మ్యగోచరమే....!!

ఏమి చదువుకోవాలో...సరైన నిర్ణయం తీసుకోవటం... చదువుకు మొదటి మెట్టు... !
  తగిన ఉద్యోగాన్ని దానికి తగిన ప్రణాలికను సిద్ధం చేసుకోవటం వ్యక్తి వికాసపు మొదటిమెట్టు !!
 వివాహము...పిల్లలభవిష్యత్తు 
  ఇలా యేవిషయానికైనా బాగా
ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవటం పైనే ఆయా విషయాల విజయాలు ఆధారపడి ఉండేది !
ఆ నిర్ణయాలే  ఆయావిషయాల 
 జయాపజయాలకు మూలము లైన మొదటి మెట్లయ్యేది !!

   ప్రధానంగా... జీవిత అభివృద్ధికి, వికాసానికి, ఆనందానికి తీసుకుకే నిర్ణయప్రణాళికే ఆవ్యక్తి జీవితానికి మొదటి మెట్టు !
బాగా ఆలోచించి సక్రమమైన రీతిలో సవ్యముగా ఆ మొదటి మెట్టును మనము అధిరోహించాలి ! అప్పుడే మిగతామెట్లను సునాయాసముగా ఎక్కి గమ్యాన్ని ఆనందముగా చేరుకోగలుగుతాం... !!
*************************
2
అంశం : తొలిమెట్టు
శీర్షిక  : మట్టినేలు

అన్నింటికీ ఆరంభం అనివార్యం
తొలిమెట్టు విజయ సాధనకు అంకురం
అవార్డులు రివార్డులు రికార్డుల మాత్రమే
విజయాలు కావు ఏ ఒక్క మదిలో స్థానం పొందగలిగినా విజయమే 
ఆ విజయం రుచి అంది నీ సొంతమైతే
అందరి మదిలో చోటు సంపాదన సులువౌతుంది
ప్రేమ లందుకోవడం నీకలవాటౌతుంది
కొందరి ఎద గుడిలో పూజలందుకొంటావు
ఆ తొలిమెట్టుకై పట్టును కట్టుబాటుగా మార్చుకో
ఆర్థక హార్థిక అర్హతలు తొలిమెట్టుకవసరంలేదు
వివేకవంతమైన సౌమ్యత  వంటబట్టించుకో
ఎవరో వస్తారని సాయం చేస్తారని ఆశపడకు
శ్రమతో కూడిన ఆలోచన విధానాన్ని అలవర్చుకో
దృఢ సంకల్పాన్ని శక్తివంచన లేక
కార్య రూపకల్పన సక్రమ మార్గాన తెములు
తొలిమెట్టు గట్టిదైతే మట్టినేలవచ్చు
పదిమందికీ ఆదర్శమై గౌరవింపబడొచ్చు
ఇంకెందుకు ఆలస్యం తొలిమెట్టుతో అడుగిడు

డా.దీపక్ న్యాతి
సినీ రచయిత
3
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: తొలిమెట్టు 
...
లక్ష్య ఛేదనలో 
ఓటమి ఎదురైతే
కంగారు పడకోయ్ 

ఓటమిని 
విజయానికి తొలిమెట్టుగా భావించు 
కారణాలు విశ్లేషించి 
ద్విగుణీకృత ఉత్సాహంతో 
ముందడుగు వేయాలోయ్ 
నిన్ను చూసి గేలిచేసిన వాళ్ళకు 
నీవు సవాల్ విసరాలోయ్ 
విజయాన్ని ఒడిసి పట్టాలోయ్
4.
[కవితా గానం (సీజన్.... 3)
అంశం... తొలి మెట్టు
శీర్షిక... ఆదర్శాల పాఠశాల

విధి చాలా చిత్రమైనది.... 

నీవెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు,... 

ఇద్దరి మధ్య బంధమై కలిసింది
ఏడడుగులు నడిపింది... 

అందరికి స్ఫూర్తినిచ్చింది
బరువు బాధ్యతల కావడి మోసింది... 

అటు ఇటు బంధువులను ఒకటి చేసింది 
సంతోషాల తివాచీ పరిచింది... 

ఒకరి హృదిలో మరొకరు వెలిగే ప్రేమ దివిటీ వెలిగించింది
అనురాగపు పందిరి వేసింది... 

ఆత్మీయ దుప్పటి కప్పింది
అందాల తోటలో సుమాలై పరిమళాలు వెదజల్లింది... 

తొలి మెట్టు ఎక్కిన మన ప్రేమ
 అందరికీ ఆదర్శాల పాఠశాల అయింది.... !! 

మొహమ్మద్ అఫ్సర వలీషా
 ద్వారపూడి (తూ గో జి)
5
  కవితా గానం
అంశం:-- తొలిమెట్టు
రచన:-- సింహాద్రి వాణి శీర్షిక:--తొలిమెట్టు
చరవాణి:--7569820872

ఉట్టికెగరలేనివారు 
స్వర్గానికి చేయలేరు
పునాదులే లేకుండా
భవనాలను కట్టలేరు
అక్షరాలు నేర్వకుండ
అజ్ఞానం వీడలేరు
శిఖరాన్ని చేరాలంటే
ఒక్కసారి యెక్కలేరు
అపజయం కలిగెననీ
వెనుతిరిగితే విజయమేది?
ప్రయత్నం పట్టుదల
తొలిమెట్టు విజయానికి
ఒక్కసారె ఏదైనా
వచ్చి ఒడిని చేరదులే
కుసుమం విరబూయాలంటే
మొగ్గ పుట్టి పెరగాలి
ఆలోచన‌ చేయకుండ
సాహిత్యపు సృజన లేదు
అసలు మొదలు లేకుండా
చివరుండునా ఎక్కడైనా?తొలిమెట్టు ఎక్కేందుకు
భయపడితే ఎవ్వరైనా
సాగలేరు బ్రతుకుబాట
సవ్యంగా ఎప్పుడైనా
తొలిమెట్టున అడుగుపెట్టి
కాలుజారి పోతున్నా
ధైర్యంగా పట్టుపట్టి
ముందుకెపుడు సాగాలి
విజయాన్ని ఒడిసిపట్టి
శిఖరానికి చేరాలి
6
పేరు: కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం... తొలి మెట్టు

పర్వతాన్నదిరోహించాలంటే తొలి మెట్టు ఎక్కితేనేగా పర్వత శిఖరాగ్రాన్ని చేరుకోగలిగేది...
 శిఖరాన్నైనా,
 జీవిత గమ్యానికైనా తొలిమెట్టేగా ఆరంభం, ఉన్నతికి పరమపద సోఫానం...
తొలి అడుగు వేయడానికే సంశయిస్తే నీ లక్ష్య సాధన ఎలా?
 మీ గమ్యం దారిలో ఎన్నెన్నో ముళ్ళ పొదలుంటాయి...
 ఎన్నెన్నో ఆటంకాలు అవాంతరాల అడ్డుగోడలు నీ లక్ష్య సాధనకు అడ్డుగోడలైతే విజయ కేతనం ఎగురవేసేదెప్పుడు?
 తొలి మెట్టు ఎక్కి,
 ఎన్నెన్నో కష్టానష్టాల పద్మవ్యూహాన్ని ఛేదించి విజయకేతనం ఎగురవేయించే తొలి మెట్టును వెనుకడుగు వేయక,
 సందేహించక ముందడుగు వేయి...
 ఆత్మవిశ్వాసాన్ని 
తివాచీగా పరచి నీ సంకల్పబలంతో తొలిమెట్టును  ఎక్కి,
 నీ ఆశయాన్ని నెరవేర్చుకో...
అపుడేగా నీ పెదాలపై విజయ దరహాసం నవ్వుల పువ్వై విరబూస్తుంది.
7
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
అంశం... తొలి మెట్టు
శీర్షిక.... విజయానికి సోపానం
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
పాతర్లపాడు... ఖమ్మం... 507183.
సెల్ ఫోన్...6281697982
26/11/22
***********************************************

తొలి అడుగు వేసిన బిడ్డను చూసి
తల్లి ఆ అడుగుల్లో అరిసెలు బొబ్బట్లు వేసి
తలా కొంచెం తీయని పాయసం  పోసి
తనియు తల్లి దండ్రుల ఆనందం వెన్నెల రాసి!!

తడబడే అడుగులను తమాయించుకుని
తగురీతులు తరగతి గదిలో తర్ఫీదు పొందుకుని
తకరారు లేని తాలిమి కలిగిన మేలి భావినందుకుని
తనయుడు విరాజిల్లగ తల్లిదండ్రి మది తళుకు లీనే !!

సంకల్పాన్ని ఆమంత్రించి కార్యార్ధియై కార్యాచరణను 
సంప్రోక్షించి సంకటము లెదురైనా సహనంతోను
సంకటి దొరికినా సంతోషంగా సమయాన్ని సంభావించి 
సాధించిన సాఫల్యం  తొలి అడుగుల విజయ కేతనం!!

ఎన్నెన్నో తెలియని ఒడిదుడుకుల మధ్య జీవనం
మున్నెన్నడూ ఎరగని వ్యధాభరిత మనుగడ
ముందు నుయ్యి వెనుక గొయ్యి చందంగా సమస్యలు
అధిగమించే సాహసాన్ని అందుకునేందుకు ఎక్కిన
తొలి మెట్టు

ఇస్తుంది నిలకడగా మలిమెట్టు ఎక్కడానికి ధైర్యం,
8.
కవితా గానం
అంశం:: తొలిమెట్టు
శీర్షిక:: మొదటి అడుగు

ఒక్కొక్క అడుగు
అవుతుందది ముందుడగు
నెమ్మదిగా అదే అవును పరుగు
ఎక్కడైనా ఎప్పుడైనా
ఎక్కాలి తొలి మెట్టు
అదే మనిషికి పట్టు
ప్రయత్నాన్ని మొదలు పెట్టు
ప్రయత్నము లేనిదే పని జరగదు 
మొదలు పెట్టనిదే ముగింపు ఉండదు 
కూర్చుంటే ఏదీ సాధించలేము
పయనము సాగకుంటే గమ్యము చేరలేము
పరీక్ష రాస్తేనే తెలియును ఫలితము 
తొలిమెట్టు అన్ని విజయాలకు
కారణము
ఆత్మ విశ్వాసానికి అదే ఆభరణము 
ఎన్ని ఆటంకాలు ఎదురైన విడువకూడదు అనుకున్న లక్ష్యము
సంకల్పము సడలించరాదు
వెనుకడుగు వేయరాదు
విజయము వచ్చే వరకు
దిగ్విజయం దిగి వచ్చే వరకు!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.     8309920625
పోస్తుంది నిండుగ అన్నింటినీ అధిరోహించే శౌర్యం
వేస్తుంది జీవన వనములో కొచ్చెటి ముళ్ళ క్రౌర్యం 
పరుస్తుంది బతుకు బాటలో పూల సౌకుమార్యం 
9.
తొలిమెట్టు
**********

తొలి మెట్టంటే
ఇంకా తెరచుకోని..
తలుపుల ముందు నిలుచున్నట్టు
వెలుతురు లేని చోట..
అడుగులేసినట్టు

ఏ పాదం మోపాలో 
ఏ దిశకు మళ్ళాలో
అయోమయం లో
కొట్టుమిట్టాడుతున్నపుడు

నిన్ను ఎత్తులకు ఎత్తుకుందుకు
నీ భవిష్యత్తు తీగ ఉన్నతంగా 
అల్లుకుందుకు 
తల్లిదండ్రులే తొలిమెట్టుగా  
తడబడి తనకలాడేది
నువ్వనే మలి మెట్టు నిలకడకోసమే
 
శ్రమ సౌందర్యంతో మెరిసే ఆ మెట్టును
తేరిపార చూడు
ఇంకిన కన్నీళ్లు
కన్న ప్రేమ ప్రవహించిన గుర్తులు
నెత్తురోడిన పాదాల జాడలు
కష్టం మరకలు కనబడతాయి

పై మెట్టు పైన 
మిరుమిట్లు గొలిపే 
నీ విజయం విరబూసిన దృశ్యం 
కళ్ళబడితే
తొలి మెట్టు ఆశయం సిద్ధించి నట్టే

డా.దారల విజయ కుమారి
10.
*అంశం----తొలి మెట్టు*


 జీవిత   సౌధంలో
ఏది తొలి అడుగో తెలియదు
 తెలుసుకునే పాటికి  
దారిలో  సాగుతూ సాగుతూ....
జారుతూ పైకెగ పాకుతూ

 మంచి చెడు తెలియనితనంలో 
 అమ్న నాన్నల దారులలో
 అడుగుల   వడివడిగా సాగుతుంటే
వారి ఆశల  అనుభవాల ధారల లో
మరో లోకంలో పరుగులు.... 
 విజయాలు, విఫలాలు   
 తెలియని వయస్సు
వలపు చూపుల విరుపులలో
 కాసుల గలగలలో ఏదోగమనం
 ప్రతి  విజయానికి వేసే
 తొలి అడుగే  
 లక్ష్య  సాధనకు   మూలం
 ఎక్కే తొలి మెట్టు
 అశయ సిద్దికి సంకేతం 

 *లలితా చండీ*
9885552922

ఏవో సాధించాలని ఇంకేదో ఆవిష్కరించాలని
ఎంతో తపన ఇంకెంతో ఆరాటం!!
ఎంతకైనా తెగించి పోరాడే పరాక్రమం
ఎంతైనా !! ఆ కన్న తల్లి వేయించిన తొలి అడుగే కన్నా!!

స్వీయ రచన::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
26/11/22

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...