Skip to main content

శ్రావణ మాసం పౌర్ణమి 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
*******************
అంశం
వారణాసి
*****************
కవివరుల జాబితా
శ్రావణ మాసం పౌర్ణమి పోటీకి స్పందించిన కవివరులు 
****************
1.కోరాడ నరసింహారావు గారు 
2. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
3.మద్ది.పుల్లారావు గారు
4.కేశరాజు వేంకట ప్రభాకర్ రావుగారు
5.తాతపూడి సోమశేఖర శర్మ  గారు
6.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
7.డా.వేమూరి.సత్యవతి.గారు
8.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 
9.డా.నాగ లక్ష్మి తంగిరాల గారు
10.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
11.డా.బల్లూరి ఉమాదేవి గారు
12.డా.దీపక్ న్యాతి గారు
13.పొర్ల వేణుగోపాల్ రావు గారు
14.నల్లు రమేష్ గారు 
15.సింగీతం సంతోష్ కుమార్ గారు 
16.డా.పార్వతీపతి గారు 
17.సింహాద్రి వాణి గారు 
18.రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు 
19.కవిత వెంకటేశ్వర్లు గారు 
20.ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు 
21.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 
22.మన్నె లలిత గారు
23. గొర్రెపాటి శ్రీను గారు
24.ఇంద్రావత్ రాహుల్ గారు
25.పిన్నక నాగేశ్వర్ రావు గారు
26. దారల విజయ కుమారి గారు
27. ఏడెల్లి రాములు గారు
***********************

[15/08, 6:20 pm] Lalita Sister: సాహితీ *కేతనం* ఎగిరిస్తూ, 
కవితా *కుసుమాలను* పూయిస్తూ, 
ప్రతి మదిలో కవన ప్రసూన పరిమళాలను వెదజల్లుతూ సమూహాలన్నింటికి తల మానికంగా నిలచి, 
వినూత్న పంథాలో దూసుకుపోతున్న *సౌగంధికా దవనం* 
మన  *కవితా గానం...*

సమూహానికి *విద్వచ్ఛక్తి*
కవితాగానపు
*చోదకశక్తి అయిన*
*వీరాగారికి, లలితాకృష్ణ గారికి అభినందనలు*

తన పాళీలో 
ప్రేమాను రాగాలొలికించే *ధీర*
మమతాను బంధాలు కురిపించే *వీరా* గుడిపల్లి...

తన గొంతులో
సరిగమలుపలికించే *నవనీత*
కవితలతో పరవళ్లు తొక్కించే *ధీర లలిత...*

కవివరులందరు  *చిక్కని* పదసంపదతో *చక్కని* భావ స్ఫూర్తితో తమ కలాలను ఝళిపించినారు.  న్యాయ నిర్ణేతగా నాకొకింత కత్తి మీద సామే అయినది.. పోటీలో పాల్గొన్న వారందరికీ *అభినందనలు*

సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు కొలువు దీరిన
వారణాసి కవితా అంశానికి న్యాయ నిర్ణేతగా నాకు అవకాశం ఇచ్చినందుకు *వీరా గుడిపల్లి గారికి* మరియు *లలితాకృష్ణ* గారికి హృదయపూర్వక *ధన్యవాదములు...*
**********

 శీర్షిక: *పంచాక్షరీ- మంత్రాక్షరి*


*రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు*.......

ప్రళయకాల విన్యాసాలకు - ప్రణవనాద గమకాలకు  ఆవాసం చిద్విలాసం అని అంత్యాను ప్రాసలతో చక్కటి భావస్ఫూర్తితో వర్ణించడం బాగుంది.  *నాది-నేను* అనే అహంకారపు ఘోషలకు ఆయువు తీరిన సమయంలో ఆత్మ జ్ఞానానికి ఆఖరిప్రస్థానమని జీవన తత్వాన్ని తెలిపినారు. చెడిపోయిన శరీరాన్ని వదలి విడిపోయే ఆత్మ ప్రయాణాన్ని దిశానిర్దేశం చేస్తారనడంలో  ఔచిత్యానికి నిదర్శనం.  పుట్టుకకు గిట్టుకకు మధ్య బతుకుకు పంచాక్షరీ మంత్రము అద్భుతమైన ఊరట కలిగిస్తుందనే సందేశంతో ముగింపు పలికారు.. చాలా బాగుంది. 
హృదయ పూర్వక అభినందనలు

💐💐💐💐💐
 శీర్షిక : *వారణాసి*

*తిప్పావఝల నరసింహ మూర్తి గారూ*.....

ఏ క్షేత్ర నామస్మరణే అత్యంత పుణ్యప్రదమో! అని త్రికరణ శుద్ధిగా చేసిన ప్రార్థన కడు కమనీయముగా ఉన్నది.
ఎక్కడ గద్దలు ఎగరవో!   ఎచ్చట గోవులు పొడవవో!  ఎక్కడ శవాలకు వాసన పట్టదో! .... అని ఆశ్చర్యమును ప్రకటిస్తూ వ్రాసిన విధం చాలా బాగుంది.  సృష్టంతా నశించినా చెక్కు చెదరనిది ఈ పుణ్య క్షేత్రం అని చెప్పడం వెనుక కవిగారి దృఢమైన ఆధ్యాత్మిక చింతనా ప్రవృత్తిని తెలియచేస్తుంది. కాశీ ప్రవేశం దుర్లభమని, కాలభైరవుని అనుమతి ఉంటేనే సాధ్యమని జీవిత తత్వాన్ని తెలియచేస్తూ జీవితంలో ఒక్కసారైనా విష్వేశ్వరున్ని , విశాలాక్షి దేవిని దర్శనం చేసుకోవాలనే ఆకాంక్షను కవిగారు తమదైన ప్రత్యేకమైన ఆశ్యర్యకరమైన శైలితో ఆద్యంతం పాఠకుల హృదయాల లోతులను తాకినారానడం లో  అతిశయోక్తి లేదు..!!
హృదయ పూర్వక అభినందనలు

💐💐💐💐💐
శీర్షిక: *నంది నిరీక్షణ*

*కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు*

*నంది నిరీక్షణ* అని ఎవ్వరూ ఊహించని విధంగా శీర్షికా ప్రకటనము చేసి  ఆకట్టుకున్నారు. ఎత్తుగడ చాలా బాగుంది.  *వరుణ-అసి* నదులు  *ఆత్మ పరమాత్మలై* సంగమించిన గంగ ఒడ్డున ఘనత వహించిన వారణాసి అన్నారు.. అంటే కవిగారు పరకాయ ప్రవేశం చేస్తే తప్ప ఈ విధమైన ఊహ తలపు కు తట్టదంటే అతిశయోక్తి కాదేమో. విశ్వనాథుడు భువికి దింపిన కైలాసమని, ఆదిశక్తి అన్నపూర్ణగా అవతరించిందని గొప్పగా అభివర్ణించారు. ఎందరో ముష్కర మూకలు కర్కశముగా కత్తులు ఝళిపించి నెత్తుటి యేరులు పారించి సర్వనాశనం చేశారని ఆనాటి దుశ్యర్యలను కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. 
పంచాక్షరీ మంత్రాన్ని పారాయణం చేస్తూ మహాలయాన్ని పునరుద్ధరించిన హైందవ ధర్మచారుల క్షమను అభివర్ణించిన తీరు లో హిందూ సంస్కృతిని తెలియ చెప్పినారు. ఇవన్నీ చూస్తూ తన ప్రభువు విశ్వనాథుడు ఎప్పుడు ముగింపు పలుకుతాడోనని నందీశ్వరునితో పలికించడం అద్భుతంగా ఉంది..
హృదయ పూర్వక అభినందనలు

💐💐💐💐💐
[: *అవిముక్తం*
*వేమూరి సత్యవతి గారూ*.......
శీర్షిక చాలా బాగుంది.  ఎత్తుగడ ఇంకా బాగుంది.  ఇంతలా మనసు అటే లాగుతుందేమిటి? మళ్ళీ మళ్ళీ మాటి మాటికి అని పాఠకుల మనస్సులు హత్తుకునేలా ప్రశ్నిస్తూ ఆరంభించారు.  
త్రివేణీ సంగమ దృశ్యాలా?  ఇసుక తిన్నెలా? ప్రేమతో అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లా? మణికర్ణికా ఘట్టామా?  లోపా ముద్ర లీలా వనామా? జ్యోతిర్లింగమనా?  ద్వాదశాదిత్యులున్నారనా?  కాలభైరవుని బెత్తపు దెబ్బల భయమా? పాపహరమౌ వేలాది లింగాకారాలా?  విద్యా విజ్ఞానమిచ్చే మహా విశ్వవిద్యాలయమా?  చివరికి అవిముక్తమనేగా? అనే ప్రశ్నతో ముగించారు. కాశీని దర్శించుకోవాలనే అభిలాష ఏదో ఒక ప్రశ్నతో మొదలవుతుందని కవిగారు తనదైన శైలితో ప్రశ్నలతో ఆద్యంతం అలరించారు.
విభిన్న కోణాలలో ప్రశ్నలను సంధించి కవిత్వికరించిన తీరు పసందైన పదాలతో రమణీయంగా ఉన్నది.
హృదయపూర్వక అభినందనలు

💐💐💐💐💐
శీర్షిక: *ముక్తికి మార్గం*


*మొహమ్మద్ అఫ్సరవలీషా గారూ......*

*ముక్తికి మార్గం* కాశీ దర్శనంలొనే ఉంటుందని జీవన తాత్వికతను శీర్షికా ప్రకటనతో స్పష్టం చేశారు.  జీవన పోరాటంలో *కష్ట-సుఖాలు* అనే *జోలె* లో  అని వినసొంపైన ఉపమాన పదంతో ఆరంభించడం అద్భుతంగా ఉంది. సంసార కడలిలో నుండి బయట పడి కాశీలో మునిగి *ముక్తి* ని పొందాలని జనుల కోరిక అని తెలపడం కవి గారికి ఉన్నటువంటి విశాల దృష్టి అవగతమవుతుంది. అలాగే కాశీలో మునక లేసి ఇష్టమైన దొకటి వదులు కోవాలనే ఆశయముంటుందని తెలిపినారు. వారణాసి గొప్ప నగరమని ఆధ్యాత్మికత చింతనకు ఆలవాలమని, ముక్తి ధామమని, ఇతిహాస పురా ణాలలో వారణాసి ప్రసక్తి ప్రశంస నీయమని, మహాత్ములు నడయాడిన నగరమని, ఎన్నో దేవాలయాల సముదాయమని, సాక్షాత్తు ఆ శివుడే ఈ నగరాన్ని స్థాపించి నాడని అద్భుతంగా తెలిపారు.. ముగింపు బాగుంది.. హృదయ పూర్వక అభినందనలు..


💐💐💐💐💐

1.

శ్రావణ పూర్ణిమ కవితల పోటీ 
అంశం  :-      * వారణాసి  *
శీర్షిక  :-  * భక్తుల పాలిట... కొంగు బంగారo.... !  *
   కోరాడ నరసింహా రావు !
   .. ***************
పావన గంగా తీరం.... 
  పవిత్రపుణ్యక్షేత్రం !
   విశాలాక్షీ సమేత... 
    విశ్వేశ్వర నిలయం !!

వారణాసిగ వాసికెక్కిన... 
  కాశిలో ఏడురాత్రులుగడిపినా 
   దేహమును చాలించినా... 
   పునర్జన్మ రహిత  మోక్షం  !

ప్రతిదినము బ్రహ్మీముహూర్తాన
దేవతలు, దివ్య పురుషులును దిగివచ్చి,శుద్ధిస్నానములు జేయు  పవిత్ర నదీమ తల్లికి భక్తి,శ్రద్దల మలిసంధ్య హారతి... అత్యంతరమణీయమనోహరం

 అన్నపూర్ణ  కొలువై... 
   కాలభైరవు నెలవై... 
    అడుగడుగున కానవచ్చు 
     కోటిలింగాల అలరారు... 
      కాశీ విశ్వేశ్వరు కరుణయే 
        మనకు ఎళ్లవేళల రక్షణ     కల్పించు..రాఖీ యనితెలుసుకో

ఇది కాశీపురం,వారణాసీపురం 
  నిర్మల భక్తి, విశ్వాసులకు..
   ఈభూకైలాసంకొంగుబంగారo
      *****************
2.
కవితగానం( సీజన్-3) శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీ
అంశం:- వారణాసి
శీర్షిక:-భూలోక కైలాసం
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
9963365762
................................
భగీరథుడు పరమేశ్వరుని అనుగ్రహముతో భాగీరదిని
భువి కి తెచ్చిన తీరాన గల
వసుధైకమన అతి ప్రాచీన
పురాతనమైన  పుణ్యక్షేత్రం
వారణాసి
ద్వాదశ జ్యోతిర్లింగములలో ప్రధాన మైనది.
సాక్షి గణపతి దర్శనం సర్వ విఘ్న వినాశనం
కాశీ లో ఉన్న అన్నపూర్ణమ్మ సందర్శనం
సకల మంగళ దాయకం
కాలభైరవ దర్శనమొనర్చిన
సకల దోష పరిహారం
మణికర్ణిక ఘాట్ లో మధ్యాహ్న స్నానమొనర్చి
పితృకార్యమాచరించిన 
ముక్తి నొందురని ప్రతీక
ఆదిశంకరులు, స్వామి వివేకానంద,రామకృష్ణ పరమహంస ఎందరో మహనీయుల నడయాడిన పుణ్య క్షేత్రం.
వీరనారి ఝాన్సీ పుట్టిన పరమ పవిత్ర భూమి.
ఎన్ని దాడులు జరిగిన నాటికి, నేటికి చెక్కుచెదరని  పరమ పావన మైనది
రామచరితమానస్ వ్రాసిన
తులసిదాస్ మందిరం
భక్తజనుల పాలిట దేవాలయం.
దేశభక్త మదన్ మోహన్ మాలవీయ స్థాసించిన
బెనారస్ విశ్వవిద్యాలయం
సరస్వతీ నిలయం.
పుష్కర,కుంభమేళా సమయాన నాగ సాధు సందర్శనం ,గంగానదీ స్నానం మోక్ష ప్రదాయకం.
కాశీ లో మరణం జన్మ రాహిత్యం అని మహాత్ముల
మాటలు వేద ప్రామాణికం
అందుకే  వారణాసి ఇలలో వెలసిన కైలాసమే....!!
................................
హామీపత్రం
ఇది నా స్వీయకవిత
కవితాగానం పౌర్ణమి పోటీకి
మాత్రమే వ్రాసినది
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762
...............................
3.
శీర్షిక:  శ్రావణ కాంతులు
.......
తేటగీతి పద్యాలు
1)
ప్రకృతి శోభతో రైతులు ప్రవేశించు
జలము నిండు ను మడులందు శ్రావణమున
వ్యవసాయ పనులు సాగు పల్లెలు
కాడి,మేడితో యానందం కర్షకులకు

2)
అమ్మ వారి పూజలు తోటి కార్యాలు
మహిళలందరు రాత్రి సమయము లందు
భక్తి తోడ గుడులకెళ్ళి భజన జేయు
కోర్కలీడెర్చమనుచును కోరుకుంటాడు

3)
పట్టు చీరలు గట్టుచు పరిమళాలు
 జల్లు పూలతో సుందర జడలు గట్టి
కంఠ సీమను స్వర్ణాలంకరణ జేయ
చూడ కళ్ళు చాలవు గదా జూచుటకును

4)
శుక్రవారము రోజున శుద్ది జేసి
బూరెలరిసెలు,పులిహోర ,గారెలనుచు
వివిధ నైవేద్యములు తోడి ప్రేమ మీర
అమ్మను గొలిచెదరతివలంత గూడి

5)
పూర్ణిమ దినము తోబుట్టువులకు చాలా
ప్రముఖమైనదై భాసిల్లు శ్రావణాన
సోదరుల చేతి రాఖీలు శోభనిచ్చు
గుర్తు జేయును సోదరి కోరికలను
....
4.
కవనజ్యోతి రాఖీ పౌర్ణమి శ్రావణ మాసం శుభకృత్సంవత్సర నగదు బహుమతుల కవితా పోటీకి కవిత 
అంశం... వారణాసి
శీర్షిక:::నంది నిరీక్షణ
స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు 
3/8/22
**************"*************************

వరుణ - అసి నదులు... ఆత్మ పరమాత్మలై సంగమించిన,
గంగ ఒడ్డున ఘనత వహించిన వారణాసి !!

వెలుగు దిమ్మై విశ్వమందున ఆధ్యాత్మిక విజ్ఞాన కాంతులు విరజిమ్మి , భక్తిరసమును మనసు ముంతలొ  తొణికిసలాడగ నింపిన శక్తి ప్రదాయిని కాశీ!!

విశ్వనాథుడు కటాక్షించి  భువికి దింపిన కైలాసం!
అన్నపూర్ణగ ఆదిశక్తి అవతరించి ఆకలి తీర్చెడి శక్తిస్థలి!!

వేలవేల సంవత్సరాలుగ విరాజిల్లుతున్న విరూపాక్షుని మందిరం!!
ప్రమదగణాలు కొలువు తీరిన మండపాన... నంది ముకుళిత హస్తాలతో భక్తిపరవశమున వేచి యుండగ

ముష్కర మూకలు కర్కశ కత్తుల ఝళిపించి నెత్తుటి యేరులు పారించి మహాదేవుని భవ్య మందిరాన్ని
కూల్చి సంపదనంతా దోచి సర్వ నాశనం చేసినా...

భజనల శక్తే ఉలులై, బండలు తొలిచి, సొగసుల నద్ది ,శిల్పాలను చెక్కి , పారిన రుధిరంతో సున్నం కలిపి ...

భక్తి బట్టీలో ఇటుకలు కాల్చి "ఓం నమః శివాయ" పంచాక్షరీ మంత్రం పారాయణ చేస్తు
పరమేశ్వరుడికి మహాలయం నిర్మించిన హైందవ ధర్మాచరులు!!

ఎన్నో సార్లు దాడులు చేసి విధ్వంసం చేసినా సైచి
మళ్లీ మళ్లీ నిర్మించుకున్న సహనమూర్తుల క్షమ!!

పరమత పీడిత ప్రజలు కరుకు కత్తులకు కుత్తుకలను
అప్పగించి యెదిరించినా, ఘోరం నిలువరించ లేక...కూలగొడుతున్న గుడిని రక్షించలేక
నివ్వెరపోయింది విధ్వంసం చూడలేక జ్ఞానవాపి 

పవిత్రమైన మహాశివలింగాన్ని నీటి తొట్టిలో పడవేసి
అపవిత్ర పనులు చేస్తూ అవమానిస్తున్నా... 
వందల ఏళ్లుగా ఓపికగా నంది నిరీక్షిస్తూనే ఉంది...
తన ప్రభువు విశ్వనాథుడు బయటకు ఎప్పుడు వస్తాడోనని

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
5.
Tatapudi somasekhara sarma 
జిల్లా 
*

అంశం.. శ్రావణ పూర్ణిమ 
శీర్షిక.. రక్తసంబంధమైన బంధం 
ప్రక్రియ.. వచన ప్రక్రియ 

వచ్చింది వచ్చింది రక్షాబంధనపండుగ వచ్చింది
తెచ్చింది తెచ్చింది  ప్రేమాభిమానాలు తెచ్చింది 
కట్టింది కట్టింది విలువైనరక్షాబంధనమే కట్టింది 
మెచ్చింది మెచ్చింది చెల్లాయి మనసే మెచ్చింది 
విచ్చింది విచ్చింది అక్కయ్య వదనమే విచ్చింది 
పొంగింది పొంగింది అన్నయ్య మనసే పొంగింది 

రాఖీలో నిండె అన్నయ్య ప్రేమ
రాఖీలో వుండె సోదరి అనురాగం
రాఖీలో ఇమిడె జీవన సారాంశం
రాఖీతో కలిసె అన్నాచెల్లెళ్ళబంధం

సోదరి రక్షణే సోదరుడు
సోదరి గౌరవ బాధ్యుతుడు
సోదరి విలువకు రక్షకుడు
సోదరి ప్రేమకు ఆరాధ్యకుడు
రక్షణపండుగ....అన్నాచెల్లెళ్ళపండుగ 

అమ్మ కడుపున పుట్టిన బంధము
అనురాగం మూర్తీభవించినబంధము 
అవనియందు అపురూపమైనబంధము 
అమూల్యమైనదే ఈ ఆత్మీయబంధము
సోదరీసోదరుల పవిత్ర తోడు బంధము
రక్షాబంధనబంధం.. సోదరిరక్షణబంధం

తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

హామీ పత్రం
                 ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
6
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
*
శీర్షిక: వారణాసి

ఆటవెలది
వారణాసిపుణ్య క్రేత్రముమహిమలో
వెలుగుజూపువాసి మేలుగొలుపు
దీనజనులయందు దీప్తియువెలుగును
భక్తితోడగొలువ భవ్యమగును


తేటగీతి
గంగనదిలోనమునిగిన ఖర్మఫలము
తొలగిపోవునుముక్తియు దొరుకుచుండు
కాశియందునమరణము కాంక్షతీరిన
ముక్తిలభించునరులకు భక్తితోడ

తేటగీతి
విద్యలందునమేటియు విరులుగొలుపు
పట్టు వస్త్రములందున పేరుగలది
అన్నపూర్ణమ్మ మాతయు నాలయమును
జైన భౌద్ధ మతములను కానవచ్చు

తేటగీతి
కాశిశివుడునుకొలువున్న విశ్వవాడ
హిందుజాతికినిపవిత్ర బిందువగును
శక్తిపీఠాలలో యొకటి ముక్తి నొసగు
సకల పాపాలను హరించు సాధనమున
7
డా.వేమూరి.సత్యవతి.
కవిత
*
శీర్షిక---అవిముక్తం


ఇంతలా మనసు అటే లాగుతుందేమిటి??
మళ్ళీ, మళ్ళీ, మాటి మాటికీ చూడాలనిపించటం ఎందుకు??
ఆ  మందాకిని,  ఆ త్రివేణీ సంగమ దృశ్యాలా?
వారణ,అసి కలసిన ఉత్తరవాహినీ గంగాజలాలా??
పరమేశుని శిరము తాకిన భవ్యతగలదనా??
మహాదేవునికి నెలవైన జ్యోతిర్లింగమనా??
లోపాముద్ర మల్లెతీగల్ని పెంచిన -
-లీలావనమున్నదనా?
అగస్త్యుడొంటికాలితో నిలచి తపమాచరించిన ఇసుక తిన్నెలున్నాయనా??
ఆకాశమార్గంలో పయనిస్తూ, ఇక్కడే ఆగి చూచే లోలార్కాది ద్వాదశాదిత్యులున్నారనా?
సాక్ష్యంచెప్పె సాక్షిగణపతో,డుంఠిగణపతో ఎనిమిది రూపాలున్నాయనా?
ప్రేమగా పిలచి అన్నంపెట్టె అన్నపూర్ణమ్మ తల్లా?
అష్టాదశ పీఠాలైన విశాలాక్షో,ప్రయాగమాధవేశ్వరో,,గయామంగళగౌరీ సమీపమా?
ఈశ్వరార్చనా కళాశీలుడు శ్రీనాధునికి కాశీఖండంరచించేలాచేసిననిర్మలదివ్యవిశ్వనాథ లింగమా?
నగరపాలిక వారాహి ఉగ్రరూపమా?
కాలభైరవుని బెత్తపుదెబ్బల భయమా?
మధ్యాహ్నమైతే విచ్చేసే వియచ్చరులొచ్చే మణికర్ణికాఘట్టమా??
అడుగడుగునా దర్శనమిచ్చే పాపహరమౌ
వేలాది లింగాకారాలా?
జ్ఞానవాపి దర్శనమా?విద్యాజ్ఞానమిచ్చే మహా విశ్వవిద్యాలయమా??
పంచక్రోశ యాత్ర ప్రలోభ పెఢుతోందా?
చివరిక్షణాలకోసం దరిచేరే భక్తులకు తారకమంత్రం వినవస్తుందనా??
మహాస్మశానమనా? అవిముక్తమనేగా!!
మళ్ళీ మళ్ళీ చూస్తేనే సరిపోలా?!!!

                 ------------———
అవిముక్తమనే ఈ కవిత నా సొంత రచన!
డా.వేమూరి.సత్యవతి.
విజయవాడ.-
8
కవితా గానం సీజన్3

శ్రావణమాసం పౌర్ణమి బహుమతుల పోటీకి

అంశం: వారణాసి
తిప్పావఝల నరసింహమూర్తి

ఏం క్షేత్ర నామస్మరణే అత్యంతపుణ్యప్రదమో
ఏం క్షేత్రంలో అడుగిడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందో
ఏం క్షేత్ర నివాసం పాపనాశన హేతుహో
ఏ క్షేత్రంలో మరణంమోక్షప్రదమో
ఎక్కడ పుణ్యకార్యాలు చేస్తే కోటి రెట్లు ఫలం లభిస్తుందో
ఎక్కడ గ్రద్దలు ఎగరవో
ఎచ్చట గోవులు పొడవవో
ఎక్కడ శవాలకు వాసన పట్టదో
అదే సప్త ముక్తి నగరాల్లో ఒకటైన వారణాసి.
శివుడు త్రిశూలాగ్రంమీద సృష్టించిన
భూభాగమే కాశి
సృష్టంతా నశించినా చెక్కు చెదరని దే ఈ పుణ్యక్షేత్రం.
శివరూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమే ఈ దివ్య క్షేత్రం.
స్వయంగా పరమశివుడు నివసించే
కైలాసమే పురాతన పుణ్యక్షేత్రం.
అర్థచంద్రాకారంలో కాశీని ఆనుకొని ఉన్న గంగ ఆయన సిగలో జాబిల్లి.
గంగాస్నానం సర్వ పాప హరం.
గంగా స్నానంతో పునర్జన్మ హతం.
గంగ పరమశివుని దైవత్వానికి ద్రవ రూపం.
కాశీప్రవేశం దుర్లభం అందరికీ.
కాలభైరవుని అనుమతుంటేనే
అవుతుందది సాధ్యం.
క్రొంగొత్త రూపు రేఖల తో మెరిసిపోతోందిపుడు కాశీ.
 ఒక్కసారైనా దర్శించుకొందాం విశ్వేశ్వరుని జ్యోతి ర్లింగం.
విశాలాక్ష్మి శక్తిపీఠం దర్శనంతో పొందుదాం అంతులేని పుణ్యం.
అన్నపూర్ణా దేవి దర్శనంతోమన జన్మలు చేసుకొందాం సార్ధకం.
9
నాగ లక్ష్మి తంగిరాల 
*
 అంశం వారణాసి
డా. నాగలక్ష్మి తంగిరాల
గలగల ప్రవహించే నదీమ తల్లులు
వరుణ అసి   గంగా వాహినిలో కలిసే
పవిత్ర స్థలమే వారణాసి
గంగా హారతుల తో
 అకుంఠిత భక్తిప్రపత్తులతో
హరహర మహాదేవుని సేవించే అఘోరాలతో
శివశివ యంటూ శివ భక్తులైన యాత్రికులతో కళకళ లాడుతూ
దేదీప్యమానంగా వెలిగే పట్టణం కాశీ   బెనారస్ గా మారిన బరణసి  
ఆడవారి పట్టు  చీరలకు బెనారస్
 కంచి పట్టులా
యుగాంతంలో అన్ని పట్టణాలు మునిగిన
మిగిలేది కాశి ఒక్కటే
పరమ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది
బ్రహ్మ హత్య పాతక నివారిణి కాశి
కాశీలో మరణం ముక్తి కారకం
మోక్ష ప్రదాయని కాశి
కాశీ కాశీ అన్న చాలు కాశీ వాస ఫలితం 
వచ్చేస్తుంది
కాశీ  క్షేత్ర దర్శనం జన్మ జన్మల కలుష హరం
కాశీ గంగా స్నానం సర్వ పాపహరం
ఎనభై ఘాట్ల సముదాయం పవిత్ర గంగానది
ప్రతిఘాట్ కీ ఓ విశిష్టత
కాలభైరవు డే క్షేత్ర పాలకుడు
 అందాల రాశి  అన్నపూర్ణమ్మ కొలువైన 
శక్తిపీఠం
జ్యోతిర్లింగమై మహాదేవుడు వెలసిన క్షేత్రం కాశి
సాక్షి గణపతితో విశాలాక్షి విశ్వేశ్వ రుల
సన్నిధానం కాశి
అడుగడునా లింగాల లో విశ్వేశ్వర దర్శనం
శ్రీనాధ కవిసర్వభౌమ కావ్య ఖండం కాశీ ఖండం
తులసీదాసుని రామచరిత మానసం
గ్రంథ రూపం దాల్చినదిచ్చటే
కపివరుడు విహరించే వినోదస్థలి కాశి
 ఆది శంకరులకు ఆత్మజ్ఞానం కలిగించిన 
 మరో కైలాసం కాశి
వ్యాసుడు పురాణ రచన చేసిన పుణ్యస్థలం కాశీ
కాశీ వేదాలకు  మూలం   
వేదపండితుల నిలయం 
కాశీ కాశీ యనినంతనే
కాశీ విశ్వేశ్వరుండు కామిత ఫలములిచ్చి
ఆశీర్వదించు
దాశరధి సదా జపించు దైవంబే కాశీవిశ్వనాధుడు
కాశి కాశి కాశి అందాం  కాశీ విశ్వనాధుని
శరణు వేడదాం 
భక్తి ముక్తు లను పొందుదాం
10
మొహమ్మద్. అఫ్సర వలీషా
కవిత
*
కవితా గానం( సీజన్ 3)
అంశం...వారణాసి 
శీర్షిక....ముక్తి కి మార్గం

జీవన పోరాట కష్ట సుఖాల
జోలెలో
సంసార కడలి ఊగిసలాటల మధ్య 
కడసారైనా తనివితీరా కాశీలో మునిగి ముక్తి పొందాలనే జనాల కోరికల కలశం....  

వరుణ, ఆస్సి రెండు నదులు 
గంగా నదితో మమేకమై
వారణాసిగా పేరొందిన కాశిలో
మునకలేసి ఇష్టమైనది 
వదులుకోవాలనే ఓ ఆశయం....   

అవిముక్తక, ఆనందకానన,
మహాస్మశాన,సురధాన,బ్రహ్మ వర్ధక,
సుదర్శన, రమ్య , కాశి ఇతిహాస పురాణాలలో 
ఈ వారణాసి ఎన్నటికీ  కాదు అతిశయం...

దీపాల నగరం, విద్యా నగరం
మందిరాల నగరం,ఆధ్యాత్మిక రాజధాని ,
సంస్కృతి రాజధాని ఇంత చరిత్రాత్మకతను చూడాలనే అందరికీ  ఓ ఆశ...

అయోధ్య, మధుర,గయ,కాశి,
అవంతిక,
కంచి, ద్వారక సప్తముక్తి పురాలని హిందువుల ప్రగాఢ విశ్వాసం...

హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి
ఋగ్వేదం,రామాయణం, మహాభారతం 
స్కాంధ పురాణంలలో వారణాసి ప్రసక్తి ప్రశస్తం...

ఆర్యుల మత తత్వ శాస్త్రాలకు మూలం
పురాతత్వ అవశేషాల వారణాసి 
వేదకాల  ప్రజల ఆవాసం...

విద్యకు, పాండిత్యానికి , ఆధ్యాత్మికతకు
హిందుస్తానీ సంగీతానికి, శిల్పం,వస్త్రం,సుగంధ ద్రవ్యాలకు
ప్రాచీన సంస్కృతికి వారణాసి ఓ ముఖ్య  కేంద్రం...
హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేద వ్యాసుడు,
శంకరాచార్యుడు, కబీర్ దాసు, తులసీదాసు,
మున్షీ ప్రేమ్ చంద్, లాల్ బహదూర్ శాస్త్రి,
పండిట్ రవి శంకర్, బిస్మిల్లా ఖాన్ 
ఎందరో చారిత్రాత్మక ,పౌరాణిక, 
సంస్కృతిక ప్రముఖులు నడయాడిన నగరం..

ఎన్నో దేవాలయాల సముదాయం
ఎన్నెన్నో ఏళ్ల క్రితమే శివుడు 
స్థాపించిన నగరమని సారాంశం.....!!

హామీ...ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా  హామీ ఇస్తున్నాను🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ. గో. జి )
11
*
డా. బల్లూరి ఉమాదేవి
కవిత
*
శీర్షిక: ముక్తి నగరి వారణాసి 

1తే.గీ:పరమ పావన మైనట్టి వారణాసి
     యందు వెలసెను ప్రఖ్యాత మైన యట్టి
    శివుని లింగము భక్తుల చేత సతము
     కొలువ బడుచు విశాలాక్షి గూడి తాను.

2ఆ.వె: బౌద్ధులకును కాశి వాస స్థలంబయ్యె 
      జైన మతము వారు సంత సాన
      కొలువు దీరి రిచట కూర్మితో నలనాడు
     పావన స్థలమనుచు వసుధ యందు.

3తే.గీ: పార్వతీదేవి కన్నులు పడినయట్టి    
    దివ్య  ప్రాంతమై భాసిల్లె దేశమందు 
   క్షుత్తుబాధలు దీర్చుచు శూలి సతియు
   తావిశాలాక్షిగ వెలసె ధరణి యందు.

4. ఆ.వె:వారణాసి యందు పదిహేడవ దయిన
      శక్తి పీఠ మందు చక్కగాను
    నేక శిలను వెలసె నిచట విశాలాక్షి
   భక్త జనుల కెల్ల, వరము లొసగ

 
5ఆ.వె: మంగళమ్ము గూర్చ మంగళ గౌరిగా
   కొలువుదీరె సతియు కువలయాన
విసమ నేత్రు తోడ వెలసె విశాలాక్షి
   కాశి పురము నందు ఘనము గాను.
.

6.ఆ.వె విద్యల నగరముగ విలసిల్లె నీ పురి 
    పట్టుచీరలకిది వాసికెక్కె
      ముక్తి కోరువారు ముదముతో నరుదెంచి 
        చేయు చుందురెపుడు  శివుని సేవ

7.ఆ.వె:ఆదిపూజితుడగు నద్రిజా సుతుడు ను
        కొలువుదీరె నిచట కూర్మితోడ
        కాశి నగర  మదియు కైవల్యపథమని
        బిందుమాధవుండు విడిది చేసె
12
డా.దీపక్ న్యాతి 
కవిత
*
కవిత గానం సమూహం
కవనజ్యోతి రాఖీ పౌర్ణమి
వచన కవిత పోటీల కొరకు
 తేది : 05-08-2022
అంశం : వరలక్ష్మీ వ్రతం

శీర్షిక : సౌభాగ్యవతుల వ్రతం 

సర్వమంగళ సంప్రాప్తికై సకలాభీష్టాలకై
నిత్య సుమంగళిగా వర్ధిల్లుటకై
సకల ఐశ్వర్యాలను ఆశించి, పుత్రపౌత్రాదులను పొందేందుకై 
పార్వతీ దేవి లాంటి పుణ్యస్త్రీలు
ఈశ్వరుడు ఆసక్తిగా వివరించిన
విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేర
నామకరణీకరించిన శ్రావణ మాసంలో
శ్రీ లక్ష్మిదేవిని త్రికరణ శుద్ధిగా
భక్తి శ్రద్ధలతో చారుమతి ఆచరించిన
అష్టలక్షులలో ఒకరైన వరలక్ష్మీ
మాత వ్రతాన్ని దీక్షతో చేసుకొని 
కృపకు పాత్రులై సిరి సంపదలు
పొందుతారని దక్షిణ భారత దేశంలో
ప్రాచూర్యం పొందిన శుక్రవార వ్రతమిది
సంస్కృతి సంప్రదాయాలు  ఒలకబోసే 
సుకార్యాలతో ఒకరినొకరు ప్రోత్సహించే
వనితా మూర్తుల పసందైన వ్రతమిది

డా.దీపక్ న్యాతి
B - 207,మేఘాద్రి హైట్స్,
మేడ్చల్ మల్కాజ్గిరి,
తెలంగాణ - 87
9849488837
13
[06/08, 6:27 am] Lalita Sister: *కవితాగానం సీజన్-3*
*శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీలు*
అంశము: *వారణాసి*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *భూకైలాసం!*
ప్రక్రియ: *వచనకవిత*
*********************
*ఆయోధ్యా, మధురా, గయా, కాశీ, కాంచీ, అవంతికా, ద్వారకా.. సప్తపురములలో ప్రసిద్ధ క్షేత్రం!*

*భువిపై వెలసిన కైలాసమే వారణాసి...మన కాశీ క్షేత్రం!*

*వరుణ, అసి నదుల సంగమమే వారణాసిగా మారినది!*

*చరిత్రకంటే ప్రాచీనమైన చరిత్ర కలిగిన చారిత్రక నగరమిది!*

*భక్తికి, ముక్తికి, శక్తికి,యుక్తికి, వ్యక్తికి,రక్తికి నిలయమాయె!*

*ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటైన విశ్వనాథుని లింగక్షేత్రం!*

*భారత దేశపు సప్త పురములలో స్థానం పొందిన నగరమిది!*

*గంగలో మునుగగ తొలగు పాపములు!*

*లింగమును చూడగ తొలగు శాపములు*

*పండిత,పామర, కవి,కళాకారులు, నేతల జోతలనందిన క్షేత్రము!*

*అగస్త్యుడు, వ్యాసుడు,ఆదిశంకరుడు.. అగణిత ఋషులకు ఆలవాలమయే!*

*హిందూ ధర్మము, బౌద్ధము, జైనము, భక్తిఉద్యమములకునిది నిలయము!*

*వేదము,నాదము, యజ్ఞము, యంత్రము, మంత్రము,తంత్రము సమ్మేళనమిది కాశీ నగరము!*

*తులసీ, కబీరు, కవి రైదాసు.. అందరి భక్తికి మూలస్థానమిది!*

*గట్టి కోటలకు, మెట్టు ఘాటులకు, పట్టు చీరలకు పెట్టినపేరిది!*

*గంగా హారతి, విద్యా భారతి, లింగపు మూరితి, కి కాశీ ప్రతీతి!*

*దీపపు నగరము, దేహపు దహనము, పాపపు హరణము, శాపనివారణము!*

*వారణాసికిక లేదురా పోటీ! అన్ని నగరముల దీనికిది సాటి!*

*కారణ జన్ముల కడపటి క్షేత్రము.. జన్మరాహిత్యపు ధర్మక్షేత్రము!*

*అదే అదే వారణాసి! అఖండ పుణ్యాల రాశి!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
14
నల్లు రమేశ్


కాశీకి ఓ మారు

 కైలాసముందో లేదో
 కాశీకి కట్టెను పరిచయం చేసుకోవాలి
 బూడిద రహస్యాన్ని
 బోధిసత్వుడై సిద్ధించుకోవాలి

 అలుపు రాని గంగ
 పాపాలు హరిస్తుందో లేదో గాని
 పంకిలమై బేల చూపులు చూస్తున్నప్పుడు
 కాస్త స్వచ్చంగా హత్తుకోవాలి

 వల్లకాటి వత్సలుడు
 అశరీర వర్ధనుడు
 జంగమ జీవుల ఈశ్వరుని చేరి
 జ్యోతినై మనసు వెలిగించుకోవాలి

 కపాల భోక్తలు
 కల్మషహారులై సంచరించే చోట
 సర్వ సంశయాలు త్యజించి
 నేనన్న అహం నిర్జించుకోవాలి
పూట పూటని లాలించి
 ఆకలి జలాలు ఆవిరి చేసే
 అన్నపూర్ణమ్మ అక్కున చేరి
 ఆత్మకు అర్థం అర్ధించుకోవాలి

 వారణాసి దర్శనం
 మరు జన్మకు దర్పణం
15

సింగీతం సంతోష్ కుమార్ 

శివుని కాంతి నగరం
ప్రపంచ సాంస్కృతిక నగరం
భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి
హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి
హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము
శివుడే స్వయంగా నివాసముండే నగరం
అతి మహిమాన్మిత నగరం
గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకమే క్షేత్రము
కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల కాశీ
విష్ణు మూర్తి హృదయం నుంచి వెలువడి
సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న  ఆధ్యాత్మిక 
నగరం
స్వయంగా శివుడు నివాసం ఉండే నగరం
ప్రళయ కాలంలో కూడా నీట మునగని ప్రాచీన 
నగరంభూమిపై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రాల్లో కాశి ఒకటిరెండు నదుల సంగమ నగరం
పన్నెండు జోతిర్లింగాల్లో శ్రేష్ఠమై పద్నాలుగు భువన భాండాల్లో విశేషమైన స్థలం....
16
[06/08, 11:30 am] Lalita Sister: *వారణాశి*
*పావనక్షేత్రములరాశి*

ఓం నమఃశ్శివాయ  ఓం భవః హరయ
పర, అపర కర్మ భూమి, సంకల్ప కార్య భూమి శివత్వం చైతన్యంగా నిలిచిన నైమత్తిక కార్యశాల
ఆర్య భూమి, ఆర్ష ధర్మమేలుతున్న భూమి
ఆది దేవుడే ప్రణవ నాదంగా పలుకు భూమి
భవహరుని భాగ్యోదయ దివ్య సుందర భూమి
వైరాగ్య విద్యా ధ్యాన ముద్ర నేర్పిన గురు నివాస భూమి ఓంకారమై
ప్రాకారమై అనంత హిమవన్నగ శిఖరమే భక్తులు
భవును తలచి కొలిచి తరించే కైలాస భూమి
ఆ జీవనమౌ సుగుణాకారమైన భూమి సదా శివుని భవహరుని కార్యక్షేత్ర
ఛత్రమట భక్తయోగ పదన్యాసి వారణాసి
ఓం నమఃశ్శివాయ
ఓం భవ హరాయ.
డా.పార్వతీపతి
9441688048

17
శ్రావణమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం:-- వారణాసి
శీర్షిక:--భూలోక స్వర్గం
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872

నీతి న్యాయం ధర్మాలను పగలూ రాత్రీ పరిమళింపజేస్తూ యుగయుగాలుగా గంగ కృష్ణ కావేరి వంటి పవిత్ర నదీ ప్రవాహాలతో పాటు అవిశ్రాంతంగా ప్రవహిస్తూ‌ ప్రయాణిస్తూ ఆధ్యాత్మక తరంగాలలో ముంచెత్తుతూ
అద్భుత భక్తిభావ ముప్పొంగ జేసే విశ్వేశ్వర దేవాలయం వున్న ప్రదేశం

అది అతి ప్రాచీన నగరం
హిందువులతో పాటు అన్యమతస్థులకూ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం
ఎందరో ప్రముఖులతో అనుబంధం కలిగియున్న స్థలం
అన్నపూర్ణ విశాలాక్షి దుర్గామాత మొదలైన దేవాలయాలున్న పావన ప్రదేశం
అక్కడ ప్రాణాలు విడిచిన జన్మ‌రాహిత్యాన్ని ప్రసాదించే‌ పుణ్యక్షేత్రం
ఎన్నో స్మశాన వాటికలున్న శవదహనాల కేంద్రం
ప్రకృతి శోభలతో అలరారుతున్న భూతల స్వర్గం
కృష్ణునికీ, సాందీపునికీ జ్ఞానం ప్రసాదించిన విద్యాకేంద్రం
పాండవులకు పాప ప్రక్షాళన చేసిన దివ్యక్షేత్రం
ఎందరో మహనీయులతో అనుబంధం పెనవేసుకున్న ప్రదేశం
ఆధ్యాత్మిక విద్యా సంస్క్రతుల 
రాజధాని
వారణ, అసి అనే నదులు పవిత్ర గంగానదిలో కలుస్తూ వారణాసిగా పేరు పొందిన ప్రదేశం
ఇంత గొప్ప చరిత్ర వున్న గంగానదినీ, వారణాసినీ కలుషితం కాకుండా కాపాడుకోవడం అందరి కర్త్వవ్యం

హామీ:-- ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి
18
[06/08, 9:04 pm] Lalita Sister: *కవితా గానం*
 *శ్రావణ మాస పౌర్ణమి పోటీలకు*
 *అంశం -వారణాసి*
 *రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి*
 *శీర్షిక- పంచాక్షరి మంత్రాక్షరిగా….*


 ప్రళయకాల విన్యాసాలను
 విరచించే మునికది ఆవాసం
 ప్రణవనాద గమకాలను
 చిందించే ఆ చిద్విలాసం

 నాది నేనని విర్రవీగిన
 అహంకారపు ఆత్మఘోషకు
 ఆయువు తీరిన ఆటలో
 ఆత్మ జ్ఞానపు ఆఖరి ప్రస్థానం

 చెడిపోయే శరీరాన్ని వదిలి
 విడిపోయే ఆత్మ పయనానికి
 అంతర్యామి దిశానిర్దేశం

 తెరదించే నాటకానికి
 తెరతీసే రుద్ర విన్యాసం 
 అక్షయ పాత్రల అన్నపూర్ణను
 బిక్ష మెత్తే ఆటొక అద్భుతం

 పుట్టుక, గిట్టుక నడుమన
 నలిగిన బతుకుకు
 ఊరట సందేశం
 పంచాక్షరి మంత్రాక్షరి ప్రతిధ్వనించు
 భక్తయోగ పదన్యాసి *వారణాసి*
19
[06/08, 9:47 pm] Lalita Sister: కవితా గానం
తేదీ:: 6.8.22...శనివారం
అంశం:: వారణాసి
శీర్షిక:: కాశీ

వారణ అసి కలిసి
వారణాసిగా ప్రసిద్ధి
గంగలో స్నానము పాపాలకు
తిలోదకము
సుప్రసిద్ధమైన ఘాట్లు
నిత్యము కాలే శవాల గుట్టలు
కాశీలో మరణము కైలాస
దర్శనము
తురుష్కుల దండయాత్రల కారణాన ఇరుకైన సందులు
ఇప్పుడు విశాలమైన వీధులు
కళ్ళకు కనువిందు జేసే అంగళ్లు
రంగు రంగుల సుందరంగా
తీర్చిన దీపాలు
నిత్యము జరిగే అన్నదాన ప్రసాదాలు
అన్నపూర్ణ దేవి కొలువైన క్షేత్రము
పరమేశ్వరుని దివ్యధామము
అనిశము భక్తులతో కిటకిట
లాడు ప్రదేశము
మంత్రోచ్ఛారణలతో పూజలతో
నైవేద్యాలతో జరుగు కైంకర్యాలు
వేదఘోషలతో పరమపవిత్ర
కైలాసాగిరి సమూహము
సాయంకాలము గంగా దేవి కిచ్చే మంగళ హారతులు
చూసి తీరవలసిందే
జన్మలో ఒక్కసారైనా కాశీని
చూడవలసిన పుణ్య క్షేత్రము!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
20

శ్రావణ పౌర్ణమి కవితల పోటీ. 
అంశం: వారణాసి 
రచన: ముడుంబ తిరువేంకటాచార్యులు మానుకోట 
****** ****** ****** ******* 

కాశీ, వారణాసి 
నోరు తిరగని ఆంగ్లేయుడి 'బెనారస్' 
ప్రపంచంలోనే అతి పురాతన పట్టణం 
భారతీయ ఆధ్యాత్మికచరిత్రకు 
ప్రథమ సాక్షీభూతం 
సత్యసంధతకే పరీక్ష పెట్టిన విశ్వామిత్రునికి 
కనువిప్పు కలిగించిన 'హరిశ్చంద్రుడు' 
మొక్కవోని విధినిర్వహణ 
గావించిన మరుభూమి, 
భువిపై వెలసిన నిజకైలాసం, 
సాక్షాత్ విశ్వేశ్వరుడే కొలువైయున్న దివ్యపీఠం,
జగన్మాత "అన్నపూర్ణేశ్వరి" చిద్విలాసం, 
"అమ్మ" వొడిలో "డుంటిగణపతి" ఉల్లాసం, 
కాశివాసుల పాపపుణ్యాలను గణించే
"కాలభైరవుని" అట్టహాసం, 
అందరికీ అన్నం పెట్టిన "అమ్మ" ఆగ్రహానికి 
బద్ధుడై బహిష్కారం పొందిన వ్యాసుడు 
ఒకప్పుడు నడయాడిన నేల, 
అడుగడుగున శివుడే కొలువైన ఆలయాల హేల, 
తలపై నుండే గంగమ్మ 
తన(శివుని)యింటి వాకిట నడయాడుతున్న
అలల అడుగుల గలగల, 
"అరిషడ్వర్గాల"చే పీడితులై, 
తప్పొప్పులెంచక చేసిన దురితాల ప్రక్షాళనకై 
ఒక్కసారైనా శివయ్యను దర్శించి, 
జన్మ చాలించాలని జనులు తపనపడే రంగభూమి, 
అడుగడుగున తన దరిచేరిన ఆర్తులను తనలో లీనం చేసుకుంటూ వారి పాపాలను కడిగేస్తున్న గంగమ్మ, 
ఋతు, కాలమానాలకతీతంగా నిత్యం భక్తుల 
శివనామస్మరణ మార్మోగుతున్న ఆధ్యాత్మిక ప్రపంచం, 
"ఓం నమశ్శివాయ", 
"హరహర మహాదేవ", 
"శంభో శంకర" అంటూ 
జననమరణ భయరాహిత్యం కొరకు 
మనమూ వెళ్లి శివయ్యనూ, అమ్మనూ
కనులారా దర్శించి, గంగమ్మ వొడిలో మునకేసి 
తరిద్దాం, భక్తజనులారా! పదండి. 
@@@@ @@@@@ @@@@@ @@@@@@ @@@@@ 

ఇది నా స్వంత రచన. ఏ ఇతర రచనలకు అనుకరణ గానీ, అనుసరణగానీ, అనువాదం గానీ కాదు.

ముడుంబ తిరువేంకటా చార్యులు, మానుకోట.
21
[07/08, 7:48 am] Lalita Sister: కవన జ్యోతి నిర్వహించు వింతలు పోటీకి

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
*********************
      *వారణాసి*

వరుణ అసి అను
రెండు ఉపనదులు
గంగానదిలో సంగమ పురి *వారణాసి* 
పాళీ భాషలో *బారణాసి* లేదా బవారస్ 
కాలక్రమేణా మారిన *బెనారస్*
యమహా నగరి కాశీ పురి!
హైందవ జాతికి పవిత్ర పుణ్యక్షేత్రం
పురాణేతిహాసాలలో
దివ్య ధామము
గంగా నది స్నానాచరణ పాపహరణం
ఇక్కడ మరణం దహనం
మోక్ష ప్రాప్తికి మూలం 'అవిముక్తక'
ఐదు వేల సంవత్సరాల క్రితం శివస్థాపత్యం పౌరాణిక కథనం!
దేశ సప్త పవిత్ర నగరాల్లో ఒకటి
అనేక ఆధ్యాత్మిక గ్రంధాలలో దాని ప్రసక్తి అదే కాశీపురి!
కురుక్షేత్ర సంగరమానంతరం 
పాండవుల భృత్యహత్య
బ్రహ్మ హత్యా పాతకాల విముక్తం
సప్త ముక్తి పురాణాలలో నొకటి
విశాలాక్షి విశ్వనాథుల సాక్షి
ఆనంద కానన మహాస్మశాన సురదాన సుదర్శన
బ్రహ్మవర్తన కాశీకి అప్పు పేర్ల సందడి...
       ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

        హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
22
[07/08, 9:40 am] Lalita Sister: కవిత గానం_సీజన్ 3
శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీ
అంశం :వారణాసి
పేరు :మన్నె లలిత 
ఊరు :హైదరాబాద్
చరవాణి సంఖ్య :7416863289

శీర్షిక: ముక్తిధామం.

కాశీ నామాంతరం వారణాసి
వరుణ ,అసి రెండు నదులు
పవిత్ర గంగలో సంగమం
మందిరాల నగరం, దీపాలనగరం,
 విద్యానగరం, అత్యంత పురాతన నగరం
వారణాసి
యుగయుగాలుగా పేరు మారని ఊరు
శివుడు స్థాపించిన నగరం 
హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి
అనేక పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో
కాశీినగర ప్రసక్తి
బ్రిటిష్ వారి వాడుకలో బెనారస్
బుద్ధ కాలంలో కాశీ రాజ్య రాజధాని
పదునైదు వేల ఆలయాలు, ఎనుబది నాలుగు ఘూట్ లు
అన్నపూర్ణ ,విశ్వేశ్వర ఆలయాలు
చుట్టుపక్కల గ్రామాలకు అతిపెద్ద స్మశాన వాటిక
కాశి
ఆసియాలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం 
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
పేరులో "హిందూ "ఉన్న సర్వమత 
విద్యార్థులకు ఆశ్రయం
అందరి దాహం గంగ తీరిస్తే 
ఆకలి అన్నపూర్ణ తీర్చి
శివుడికేి బిక్ష వేసిన కాశి అన్నపూర్ణ
భరతమాత మందిరంతో
దేశభక్తిని ప్రబోధించిన నగరం
పంచగంగ స్నానాలు, పెద్దల పిండ ప్రదానాలు
ఉదయ సాయం సంధ్యలందు 
కనువిందు చేసే గంగా హారతులు
ఆత్మ తృప్తినిచ్చే ఆధ్యాత్మిక నగరం
చనిపోయేవారి చెవిలో శివుడు పలికే 
అమృత నగరం
కాకులు లేని , ముగ్గు వేయని నగరం
అర్ధరాత్రి కాలే శవం బూడిదతో 
శివుని అభిషేకించే ప్రత్యేకతగల నగరం
పునర్జన్మ లేకుండా ముక్తి పొందాలనుకునే 
వారికి ఆశ్రయమిచ్చే నగరం
చివరి దశలో కాశీలోమరణించాలనుకునే
 వారికి ఆప్యాయంగా ఆశ్రయమిచ్చే నగరం
బుద్ధ  ప్రబోధనలు,జైనులు, వివిధ మతాలవారు
ఆశ్రయించిన నగరం
సారనాథ్ , వ్యాస కాశీలతో వాసికెక్కిన వారణాసి 
జీవితంలో ఒక్కసారి అయినా చూడాలనుకునే
ముక్తిధామం కాశి క్షేత్రం.

హామీ: ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.

మన్నె లలిత
హైదరాబాద్
23

[07/08, 7:38 pm] Lalita Sister: కవితా గానం (సీజన్ 3)  కవితల పోటీకి

అంశం:"వారణాసి"
శీర్షిక : మహిమాన్విత పుణ్యస్థలి
రచన: గొర్రెపాటి శ్రీను
చరవాణి : 9652832290


హిందువులు అత్యంత పవిత్ర ప్రదేశం గా భావించే మహా పుణ్యక్షేత్రం కాశీ !
మహా స్మశానంగా దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న 
ముక్తిని ప్రసాదించే దివ్యక్షేత్రం..
సాక్షాత్తు మహాశివుడు స్థాపించిన మహానగరం కాశీ !
గంగానది ఈ క్షేత్ర సమీపాన పారుతుంటే..
ఇక్కడ వెలసిన మణికర్ణికా ఘాట్,దశాశ్వమేధ ఘాట్
లాంటి స్నానఘట్టాలెన్నో మరణించిన మనిషికి ముక్తిని ప్రసాదించే మహిమాన్విత ప్రదేశాలు !
మదన్ మోహన్ మాలవ్య స్థాపించిన
"బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" వారణాసి ని
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యానగరంగా నిలిచేలా చేస్తుండగా ..
వారణాసి పట్టు చీరలకు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరమై వర్థిల్లు తుండగా ..
ఇలలో కాశీ క్షేత్రం ఆర్థికంగా,ఆధ్యాత్మికంగా గుర్తింపు పొంది 
విశ్వవిఖ్యాత మవుతుంది !
ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు !
ఇక్కడ విశ్వేశ్వరాలయం లో ని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి గా వుండి 
సత్ కీర్తిని అందుకొంటుండగా..
సకల ప్రాణకోటి నీ రక్షించే సదాశివుడు కొలువై వున్న పుణ్యస్థలి కాశీ !
కాశీ క్షేత్ర దర్శనం ..నయన సమ్మోహనం !
కాశీ క్షేత్ర వీక్షణం ..మానవ జన్మ ధన్యం ..సకల ముక్తి ప్రదాయకం !
   - గొర్రెపాటి శ్రీను
24
*శీర్షిక :* పవిత్ర క్షేత్రంబు 

భక్తి నిలయంబు వారణాసి
సకల వేదాలకు పుణ్య స్థానంబు
సుగంధ పరిమళ భరిత
పవనంబు వారణాసి క్షేత్రంబు!!...

ఈశ్వరుడు కొలువైన ముక్తి
గ్రంధంబు వేదాల సారంబు
శివ కరుణoభు కల్గు వారణాసి
భక్తులు కొంగు బంగారు మందిర్!!..

సకల పాండిత్యoబు
వేదాల సారంబు నిత్యoబు
నిన్ను కొలిచేను శంభో స్వామి
ఓ గరళ కంఠంబు!!...

చేతిలో కపాలంబు 
జాటాజుల హర హర 
మంగళ హారతి, కర్పూరంబు
కొలిచేను స్వామి
ఓ మహేశ్వర స్వామి
ఇవే నమస్కారంబు ఈషా!!!..

*ఇంద్రావత్ రాహుల్*
నిజామాబాద్
9848054079
25
[అంశము :-- వారణాసి(52).
కవితా గానం(సీజన్ 3). 4--8--2022.
పిన్నక నాగేశ్వరరావు.
శ్రావణ మాస పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- వారణాసి.

1. తే.గీ.
వాసికెక్కె పూర్వము "కాశి" పట్టణముగ
నతి పురాతన క్షేత్రమై యలరె నాడు
"వరుణ","అసి" నదులిచ్చట పాఱి కలిసె
గంగ లోన, కనుక వాడుకగను నాటి
కాశి "వారణాసి"గ మారి ఖ్యాతినొందె. 

2. తే.గీ.
గంగలో స్నాన మాచరించంగ, తొలగి
సర్వ పాపములును పునర్జన్మ లేక
మోక్షమును పొందు నమ్మకము కలదనుచు
విశ్వసింతురు హిందువుల్ విశ్వమందు.

3. తే.గీ.
విశ్వనాథుడు వెలసిన వేదభూమి
యన్నపూర్ణ, విశాలాక్షి యాలయములు
కాలభైరవ వంటి దేవాలయములు 
కలిగి పేరొందె "మందిరముల నగరము"
గాను నాటి పురాతన కాశి పురి.

4. తే.గీ.
శివుడు స్థాపించె వారణాసి నగరమును
దేశ యాధ్యాత్మికము,సాంస్కృతికము,శాస్త్ర
కళలు, విద్యల కేంద్రమై ఖ్యాతి నొందె
వారణాసి బెనారసు పేర నాడు.

5. తే.గీ.
కాశిలో మరణించ మోక్షమ్ము కలుగు
ననుచు కోరుకొందురు మరణమ్ము నిచట
చావబోవు వారి చెవిలో శంకరుండు
స్వయముగాను మంత్రోపదేశమ్ము చేయు
ననెడు విశ్వాసము ప్రజల యందు కలదు.

6. తే.గీ.
వ్యాసు డిచ్చోట వసియించ వచ్చి యొక్క
దినమునందున భిక్ష నర్ధించ నూరి
యందు లేశమున్ దొరకలేదనుచు నాగ్ర 
హించి యూరికిన్ శాపము నివ్వబోయె.

7. తే.గీ.
అంత పార్వతీదేవియున్ వ్యాస శాప
మును గ్రహించి "కాశి"కి కల్గు ముప్పు తొలగ
జేయ ముందుగా శాపమిచ్చె నిట కాలు
పెట్టకూడదనుచు వ్యాస విభుని కపుడు,
వ్యాసుడున్ గాశి నగరముఁ వదలి వెళ్ల
"వ్యాస కాశి" యనుచు పిల్చి రా పురమును.
**************************************

26
శ్రావణ మాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం : వారణాసి
శీర్షిక : ఆత్మానంద నిలయం 
******************************
శివ స్థాపితమై సప్తముక్తిపురాలలో ఒకటిగా వెలుగొందిన సురధాన..ఆయుర్వేదం పంచకర్మ లతో ప్రజలను నిత్యం కాచుకునే సుదర్శన

విద్య పాండిత్య సాహిత్య కళా శిల్ప వస్త్ర సుగంధాలను ఉదరంలో దాచుకున్న ఆనందకానన

గంగా తీరాన్ని గర్వంగా కప్పుకుని 
పురాణాలలో తళుక్కున మెరిసిన అవిముక్తక

దశాశ్వమేధ లో గంగా హారతి
సస్యశ్యామలం కోసం గంగా అహోత్సవం
కార్తీకాన..కదంబ వృక్ష సమీపాన కాళీయుని మర్ధనా గానం కోసం 

కాలభైరవ అనుమతితో కాశీ విశ్వేశ్వర కరుణ పొంది..సకల పాపాల పరిహారం..
ఒక్క గంగాస్నానం కోసం వేచి వెళ్ళదీసే
జీవితాలలో..

ఆదిశంకరుల నుంచి జాలువారిన బ్రహ్మ సూత్ర భాష్యం..భజగోవింద స్తోత్రం  ప్రతిధ్వనిస్తుంది 

మరణిస్తున్న చెవిలో తారకనామ ఉపదేశం
దహన సంస్కారాల మహాశ్మశానం..కాస్తంత తాత్వికతను నీతో తీసుకుపొమ్మంటుంది

గుండెలవిసినపుడో..దిక్కుతోచనపుడో..చెల్లాచెదురైపోయినపుడో..ఆ దీపాల నగర విశ్వనాథుడు కరునిస్తాడని..విశాలాక్షి అక్కున చేర్చుకుంటుందని..మనసు పరిగెడుతుంది

గంగా ఒడిలోని రమ్యలో మునగడమంటే మృత్యుంజయునితో మమేకమవ్వడమని తెలిసి

ఆ బ్రహ్మ వర్ధ కు ఎన్ని నివేదనలో ఎన్నెన్ని ఆత్మార్పణ లో..శివైక్యం కోసం తపన పడి తపించే మనసులు

ఆ వారణాసి కి చేరితే ఎద ఇక ఎగిసిపడదు.. గందరగోళమేదీ దరిచేరదు..ఆత్మానందం ఎన్నటికీ ముగిసిపోదు

డా.దారల విజయ కుమారి 

హామీ పత్రం
************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన.అనువాదం కాదు.ఎక్కడా ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
27
[08/08, 8:29 pm] Lalita Sister: కవితా గానం
అంశం*వారణాశి

ఆధ్యాత్మిక అమృతవాహిని
నా వారణాశి పుణ్యరాశీ క్షేత్రం
అఖిల లోకాలకు అన్నం పెట్టే అమ్మ
కాశీ అన్నపూర్ణాదేవీ నమో నమః 
సర్వ జగత్తును పాలించే ప్రభువా
నా తండ్రీ సర్వేశ్వరాయా నమో నమః
కాశీ విశ్వేశ్వరాయ నమో నమః

తండ్రీ
నీ జటాజూటంలోంచి
ఈ లోకాన్ని కాపాడగా 
అమృత గంగను భువికి విడూ
అతివృష్టి అనావృష్టి లేని 
సమతను పంచూ 
సకలభూత నాథా నమః

ద్వాదశ రాశులు
ద్వాదశాదిత్యులు
నిఖిల జగతి నీవే
నిను నిత్యం కొలిచే భాగ్యం మాదే

హిమం నీవే
సుమం నీవే
పూజా నీవే
ఫలమూ నీవే
ప్రత్యుపకారం నీవే
ప్రజోత్పత్తి నీవే
మాలోని అహం ననచగా 
కోపాగ్ని లేని అమరప్రేమ నీవే

మా ప్రశ్నలు నీవే
మాలోని మాలిన్యం తొలగించే
కరుణ్యమూర్తివి నీవే

తండ్రీ కాశీ పరమేశ్వరా పరమాత్మా
నరుల కుటిలచేష్టలు కుంటినడకలు
ఎన్ని కుంకుమతిలకాలు రాల్చాయో

గాలివాటంగా ఈటల్లాంటి మాటల్తో
సచ్చీలులెందరు గాయపడ్తున్నరో
ధర్మం తప్పిన మనుషుల వైఖరుల్లో
సత్యం దర్శించని తీర్పులెన్నో

నీ నటరాజ నృత్య పాద ముద్రలతో
రాకాసి తనాలను పాతాళానికి తొక్కి
నిను నమ్మి శరణన్న వారికి
పూర్ణస్వస్థతను భద్రతను ప్రశాంతతను ప్రసాదించు

ఏడెల్లి రాములు ✍️

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...