Skip to main content

యుద్ధం ఫాల్గుణ మాసం 3/2022 పౌర్ణమి

ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ
నిర్వహణ
******************
శివునూరి లలితాకృష్ణ
 వీరా గుడిపల్లి
********************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
3.మదునూరి సూర్య నారాయణ గారు
4.అపరాజిత రెడ్డి గారు
5.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
6.ముద్దు వెంకట లక్ష్మి గారు
7.డా.వేమూరి సత్యవతి గారు
8.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
9.కొంపెల్లి రామయ్య గారు
10.విజయ లలిత టేకుమళ్ళ గారు
11.తరణికంటి సూర్య లక్ష్మి గారు
12.సింహాద్రి వాణి గారు
13.తంగిరాల నాగలక్ష్మి గారు
14.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
15.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
16.మద్ది పుల్లారావు గారు
17. డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు
18.గొర్రెపాటి శ్రీ ను గారు
19.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
20.కవిత వెంకటేశ్వర్లు గారు
21.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు. 
22.గంగాపురం శ్రీ నివాస్
23.బొప్పెన వెంకటేశ్ గారు
24.జోషి పద్మావతి గారు
25.వేదాంతం సురేష్ బాబు గారు
26.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
27.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
28.పొర్ల వేణు గోపాల్ రావు గారు
29.ఏడెల్లి రాములు గారు
30.పిననక నాగేశ్వరరావు గారు
31.మన్నె లలిత గారు
32.వనపర్తి గంగాధర్ గారు

**********************
కవితా గానం సీసన్ 2




ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ.. సమీక్షలు
*******************
1. వనపర్తి గంగాధర్ గారు
శీర్షిక: శాంతి కపోతం ఎగరేద్దాం
*************
రాజ్యకాంక్ష పాలక డేగల రెక్కల సవ్వడి అనడం గొప్ప ఎత్తుగడ. పాలకుల నిర్ణయాల వైఫల్యాల ఫలితం.. సామాన్యుల ప్రాణ.. ఆస్తినష్టం.
యుద్దం..భీతావహ దృశ్యమని
శాంతిని కాంక్షిస్తూ సాగిన కవిత. అభినందనలు.💅💅

2. మన్నె లలిత గారు
యుగాలు మారినా
******************
ఆది మానవుని నుండీ ఆధునిక మానవుని దాకా
రాజ్యకాంక్ష.. రగిలే పగలు యుద్దానికి కారణాలుగా చెబుతూ..తెలివిని మానవ వికాసానికి కాకుండా వినాశనానికి వినియోగిస్తు న్నారని.. యుద్దం వలన కలిగే నష్టాలను చెబుతూ..యుద్ద విరమణ ఒప్పందం చేయాలని కవిత్వీకరించారు. 
అభినందనలు.💅💅

3. పిన్నక నాగేశ్వరరావు గారు
వ్యక్తులు..వర్గాల మధ్య సంఘర్షణ అంతరంగ యుద్దమని..పూర్వం రాజ్యం విస్తరణ కోసం రాజులు యుద్దం చేస్తూ కత్తులు కటార్లు బల్లేలు వాడారు నేడు మారణాయుధాలు క్షిపణులతో దేశాలను నాశనం చేస్తున్నారని.. యుద్దం ఎందరి నుదుటి బొట్టు రాల్పుతుందో..ఎందరి ప్రాణాలను హరిస్తుందో అని వాపోతూ..
అవినీతి.. దారిద్ర్యం.. మతోన్మాదం వంటివాటిపై సమరం సాగించాలని ఉద్భవించారు.ఆద్యంతం తేట గీతి సౌందర్యం తొణికిసలాడింది. అభినందనలు 💅💅

4. ఏడెల్లి రాములు గారు
శీర్షిక: యుద్దభూమి
******************
కోర్కెలు దుర్యోధన దుశ్శాసన బంధం లా ఉండరాదని..బాంబులు అణ్వాయుధాలు పిడికెడు బువ్వ ను ఇవ్వవని..
యుద్దం.. రాకాసి క్రీడని..వేల ఏళ్లయినా
మనిషి ఇంకా నాగరికుడు కాలేదని..
రాజకీయ సామాజిక ఆర్థిక అసమానతల పై యుద్ధం చేయాలని..చెబుతూ..
భువనం చక్కని దవనం..పరిమళాన్ని కాపాడాలని చక్కని ముగింపు నిచ్చారు. 
అభినందనలు💅💅

5. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు
శీర్షిక: యుద్ద తంత్రం
******************
భూమండలం పై రణము లేని ప్రదేశం లేదనే ఎత్తుగడ బాగుంది. ఆధిపత్యము..రాజ్య విస్తరణ కాంక్ష జాత్యాహంకారము యుద్దోన్మాదానికి దారితీస్తాయని చెబుతూ..
ప్రపంచ యుద్దాల వలన అణుబాంబుల ధార్మికత పర్యావరణానికి జరిగిన భంగం.. ఆర్ధిక కుంగుబాటు ను చక్కగా కవిత్వీకరించారు.
అభినందనలు💅💅

6. పొర్ల వేణుగోపాలరావు గారు
శీర్షిక: యుద్దం వద్దు..బుద్దం ముద్దు
****************
అనాదిగా మంచికి చెడుకు..పగలు రేయి కి.. మనిషికి మనిషికి..జాతులకు మధ్య యుద్దం జరుగుతూనే ఉందన్న ఎత్తుగడ బాగుంది.
ప్రకృతి ఇచ్చిన పదార్ధాలకు ఎవరూ ప్రభువు కాదన్న వాక్యం 
కవితను మెరిపించింది.
యుద్దం పర్యవసానం విషాదమేనని.. మానవాళి
ప్రేమ కరుణ.. ధర్మం న్యాయం కలిగి ఉండాలని కవిత్వీ కరించారు.అభినందనలు💅💅

7. తిప్పావఝల నరసింహ మూర్తి గారు
శీర్షిక : బలి పశువులు
*****************
కరోనా నుంచీ కోలుకుంటున్న వేళ యుద్ధం ఎందుకంటూ ఎత్తుగడ.ఎక్కడ యుద్ధం జరిగినా రేట్లు పెరిగి ప్రజా జీవనం పైన..పిల్లల చదువులపైనా దాని ప్రభావం పడుతుందని.. ఎవరైనా చొరవ తీసుకుని యుద్దాలను ఆపాలని కవిత్వీకరించారు.
అభినందనలు💅💅   

8. తాతపూడి సోమశేఖర శర్మ గారు
శీర్షిక : పోరు నష్టం.. పొందు లాభం
****************
పోరు వలన నష్టమేనని.. పరిష్కారాలు మన చేతిలో ఉంటాయనే ఎత్తుగడతో మొదలు పెట్టారు.
శాంతితో దేనినైనా సాధించవచ్చని.. యుద్ద కాంక్ష తో యుద్దాన్ని చేసినా కనువిప్పు తో బౌద్ధం స్వీకరించి
శాంతి స్థాపనకు కృషి చేసిన అశోకుడు మనకు ఆదర్శమని.. సాటి మనిషి సౌఖ్యమే..మన జీవన పరమార్థం కావాలని ముగించారు. అభినందనలు💅💅

9. వేదాంతం సురేష్ బాబు గారు
అగ్రరాజ్యాల నియంత ధోరణి..రక్త దాహానికి సగటుమనుషులు బలై పోయారని.. సామ్రాజ్య వాదుల దురాక్రమణకు.. సృష్టించిన మారణ హోమానికి ప్రజలు ఆహుతయ్యారని..రగిలిన యుద్దాగ్ని జ్వాలల్లో జనావాసాలు..జీవనాలు మసై పోయాయని.. యుద్దం అంతమైతేనే శాంతని.. యుద్దాన్ని దృశ్య మానం చేస్తూ కవిత్వీకరించారు. అభినందనలు 💅💅

10. బొప్పెన వెంకటేష్ గారు
శీర్షిక : ఒక యుద్ధం చాలదూ
****************
ఆధిపత్యం అహంకారం.. సరిహద్దు పోరాటాలు.. ఊరును స్మశానం లా మారుస్తుందని.. రాజ్యాధికారం..కుర్చీల కోసం మంచితనాన్ని వదిలేస్తున్నాం..సమస్యలను పరిష్కరించుకోలేక మనసునను అవిటిగా చేసేసు కుంటున్నామని కవి భావన. యుద్దం యొక్క వినాశనాన్ని దృశ్యమానం చేసారు. అభినందనలు💅💅

11. అప్సర వలీషా గారు
శీర్షిక: శాంతి కపోతాలు
**************
అర్ధాల అమరికలో ఒదిగితే మాటల యుద్ధం ఉండదనే ఎత్తుగడ బాగుంది.పంతాలతో సమరభేరి మోగుతుందని.. పెంకితనం పెద్దవారికి తగదు.. శాంతితో నే మారణకాండ ఆపగలమని కవిత్వీకరించారు.అభినందనలు.💅💅

12. కవిత వెంకటేశ్వర్లు గారు
సర్వ నాశనం
************
యుద్దమంటే ప్రమాదము సంఘర్షణ.. రాజ్యం విస్తరణ కే దండయాత్రలని..ధన మాన ప్రాణ.. పంటలు నష్టం జరిగి జనజీవనం కుంటు పడుతుందని కవిత్వీకరించారు. అభినందనలు 💅💅

13. గొర్రెపాటి శ్రీను గారు
శీర్షిక: వసుదైక కుటుంబం
***************
యుద్దం ఉన్మాద చర్య అని.. ఆర్థిక మూలాలను దెబ్బ తీసి..అన్ని అనర్థాలకు కారణమై..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాశవిక చర్యని..ప్రపంచ దేశాల మధ్య యుద్ద విరమణ ఒప్పందాలు జరిగాలని కవిత్వీకరించారు.అభినందనలు💅💅

14. సిహెచ్ ఆంజనేయులు గారు
శీర్షిక: ఎంత ఎత్తుకు ఎదిగినా
****************
మనిషి ఒదిగి ఉండాలని..అపుడే ఉన్నతంగా ఎదుగుతాడని..నవోదయాలు సృష్టించి నవనాగరికతా శిల్పం అవుతాడని ముగించారు.అభినందనలు💅💅

15. మద్ది పుల్లారావు గారు
సామ్రాజ్య వాదం సమరానికి కారణమని.. అణుబాంబు కంటే ప్రాణం.. మిస్సైల్ కంటే మానవత గొప్పవని..మారణ హోమం కంటే అనురాగం పంచడమే అసలైన రాజనీతి అన్నారు.అంతటా విశ్వశాంతిని నిలపాలని అన్నారు.అభినందనలు💅💅

16. కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
శీర్షిక : వినాశనం
************
యుద్దం కుత్తుక లను కత్తరించే కరాళ నృత్యమని.. యుద్దం ఒక విస్పోటనం..మానవ జీవన హననం అని..మానవ జాతి హాహాకారాలని ముగించారు. అభినందనలు💅💅

17. అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు
శీర్షిక: వినాశనానికి హేతువు
***************
వర్ణ వర్గ భేదాలతో మానవ జీవితమే ఒక యుద్ధం అన్న ఎత్తుగడ బాగుంది.ఎవరికీ ప్రాణం తీసే హక్కు లేదని.. యుద్దం లోక వినాశనం అంటూ.. అణ్వాయుధాలు దేశ ప్రగతికి ఉపయోగించాలని ముగించారు. అభినందనలు💅💅

18. డా.తంగిరాల నాగలక్ష్మి గారు
***************
పుట్టుకతోనే యుద్దం మొదలవుతుందని..అంతః శత్రువులను గెలవాలని.. యుద్దం వలన ధన మాన ప్రాణ నష్టాలేనని.. అందరూ శాంతియుతంగా సహజీవనం చేయాలనే హితవుతో ముగించారు. అభినందనలు💅💅

19. సింహాద్రి వాణి గారు
**************
గజల్ ప్రక్రియ
చక్కని కాఫియాలు రథీఫ్ లతో అలరించారు.
అభినందనలు

20. టేకుమళ్ళ విజయలలిత గారు
**************
త్రేతా యుగం లో అయినా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయినా యుద్దమంటే
మరణ మృదంగమే మోగుతుందని.. అహాన్ని జయించాలని ముగించారు.అభినందనలు💅💅

21. తరణికంటి సూర్య లక్ష్మి గారు
***************
రాజ్యకాంక్ష యుద్దానికి కారణమని.. యుద్దం అంటే అరాచకం కరువులని..  యుద్దాలను ఆపి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ముగించారు. అభినందనలు💅💅

22. కొంపెల్లి రామయ్యగారు
శీర్షిక : రాకాసి రష్యా
*************
ఉక్రెయిన్ కుందేలు పై రష్యా గాండ్రింపులని..అది అధర్మ యుద్ధం అని..మారణ హోమానికి రాజ్యకాంక్ష కారణమని.. అభ్యుదయ భావాలు గల రష్యాకు అణ్వాయుధాల తో ఆటలు తగదని..విశ్వ మానవాళి క్షేమం కోసం శాంతించాలని ముగించారు. అభినందనలు💅💅

23. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
శీర్షిక : యుద్దమే పరిష్కారమా
**********
అగ్రదేశపు రాజ్య కాంక్ష చిన్న దేశాన్ని నేల మట్టం చేసిందని..యుద్దపు దుష్పరిణామాలు ప్రపంచ దేశాలపై పడతాయని..చర్చలతో శాంతి స్థాపన జరగాలని ముగించారు.
అభినందనలు💅💅

24. వేమూరి సత్యవతి గారు
శీర్షిక : ఆప్త వాక్యం
*************
 యుద్దం స్మశానాన్ని సృష్టిస్తుందని..పుడమికి మంచిది కాదని..హింస విద్వేషం వీడాలని.. మానవుని విద్వంసం నుంచీ దారి మళ్లించాలని ముగించారు.
అభినందనలు💅💅

25. దోసపాటి వెంకట రామచంద్ర రావు గారు
శీర్షిక : ఉన్మాదం
**************
యుద్దం క్షేత్రం లో నేల కొరిగేది సామాన్యులేనని.. అనాదిగా అగ్ర రాజ్యాలు చిన్న రాజ్యాల పైన..బలవంతుడు బలహీనుని పైన పెత్తనం సాగిస్తున్నారని..సామరస్య విఫలమే యుద్దమన్న ముగింపు బాగుంది.అభినందనలు💅💅

26. అపరాజిత రెడ్డి గారు
శీర్షిక : యుద్దము శాంతి
*******************
జాతి మత వర్గ వైషమ్యాలే యుద్ధాలకు కారణాలని.. యుద్దం పర్యావరణానికి హానికరమని..ప్రపంచ యుద్దాన్ని ఆపేలా శాంతి జెండాలను ఎగురవేయాలని ముగించారు. అభినందనలు 💅💅

27. మదునూరి సూర్యనారాయణ గారు
హోలీ
***********
నియంతల స్వార్థం రక్త తర్పణానికి కారణమని.. మృత్యువు స్వైర విహారం చేస్తుంటే..
జనం వలసలు పోతూ.. జీవచ్ఛవాలుగా మిగిలారని ముగించారు. అభినందనలు 💅💅

28. డా.భమిడి మ‌ఱ్ఱి కమలా దేవి గారు
******************
బాంబుల మెరుపులు రక్తపు సెలయేర్లు హాహాకారాలు రోదనలంటూ యుద్ద స్వరూపాన్ని ఎత్తుగడగా మలిచారు. దేశాలమధ్య మనుష్యుల మధ్య.. ఆధిపత్య పోరు ఉంటుందని..యుద్ద పర్యవసానం విషాదమేనని..విశ్వ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పాలని ముగించారు . అభినందనలు 💅💅

29. కోరాడ నరసింహారావు గారు
శీర్షిక : ఎవరితో
*****************
మనిషి పుట్టుకతోనే యుద్దం మొదలవుతుందని..ఉనికి కోసం అస్తిత్వం కోసం సర్వాధికారం కోసం దేశాల మధ్య మనుష్యుల మధ్య యుద్దాలు జరుగుతుంటాయని..గెలవాల్సింది అంతఃశత్రువు తో అని ముగించారు. అభినందనలు 💅💅

30. గంగాపురం శ్రీనివాస్ గారు
*****************
రష్యా సంధించిన శరాలతో ఉక్రెయిన్ తిప్పలు పడుతోందని. ఐక్యరాజ్యసమితి యుద్దాన్ని ఆపి శాంతి స్థాపనకు కృషి చేయాలని ముగించారు. అభినందనలు 💅💅

31. ముద్దు వెంకట లక్ష్మీ గారు
సర్వజనాభ్యుదయం సాధించు
************
సామ్రాజ్య వాదం యుద్దానికి కారణమని.. అద్భుత కళాఖండాలు బూడిదైపోయాయని.. మానవాళి మనుగడ కుంటుపడుతుంది సర్వజనాభ్యుదయాన్ని సాధించాలని ముగించారు.అభినందనలు.💅💅

32. జోషి పద్మావతి గారు
రణం కారణం
***************
యుద్దం నారదుని భోజనమని.. శంఖారావం తో మొదలై అణుబాంబులతో అతలాకుతలం చేస్తుందని ముగించారు. అభినందనలు 
********₹
1
అంశం :-  @ యుద్ధం @
శీర్షిక  :-  * ఎవరితో... !?*
  కోరాడ నరసింహా రావు 
      **************
  మనిషి పుట్టుకే తల్లికడుపులో తొమ్మిదినెలలు,ప్రతికూలాలతో పోరాటంతోనే మొదలయ్యేది !
బ్రతుకంతా...  అడుగడుగు సమస్యలతో... నిరంతరం  తప్పని పోరు !
 మనుషులు  తమ  ఉనికిని అత్యున్నతిలో నిరూపించుకోవాలనిఉబలాటం  కొందరిది..! 
తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవాలని ఆరాటం ఇంకొందరిది ! !
సర్వాధికారోన్మాదం కొందరిది, 
శాంతి, సౌభ్రాతృత్వ ఆకాంక్ష మరికొందరిది !
భయం,పొరుగువాడంటేభయం
తమహక్కుల్నీ, ఆస్తుల్నీ హరించేస్తాడని భయం !!
మనిషికీ మనిషికీమధ్యయుద్ధం
దేశానికీ దేశానికీ మధ్య యుద్ధం 
ప్రపంచ యుద్ధం... ఒకటా... !?
రెండు !
ఆపార  ధన, ప్రాణ నష్టాలు !
నయంకాని, మరపురాని అంగ వైకల్యాలు !తరాలంతరిం చినా తీరని అనారోగ్యాలు!!
ఐనా బుద్దొస్తేగా ఈ మనిషికి !?
 అపరిమితాయుధాలు సేకరించి కయ్యాలకు కాలుదువ్వటం మానేనా !?
మూడో ప్రపంచయుద్దానికి వెరవటం లేదే... !!
 ఓ మనిషి... !
మనిషి జన్మకు యుద్ద మని వార్యమేనోయ్ ! నువ్ యుద్ధం చెయ్యాల్సిందే, శత్రువులను నిర్జించి గెలవాల్సిందే ! గానీ ఎవరితో చెయ్యాలి యుద్ధం !?
గెలవాల్సిందెవరిని ?!
 ఆరుగురు శత్రువులను నీలోనే ఉంచుకుని..., సాటిమనిషిని శత్రువుగా తలచే నీ భ్రమలు వీడవా ?!
నీవు యుద్ధం చెయ్యాల్సింది ఆ నీ అంతర్ శత్రువులతో !
నీ నిజ శత్రువులు వారే... !!
వారితో పోరి గెలువు ! నీకు బయట శత్రువులెవరూ లేరు !!
     *******************
2
అంశం : యుద్ధం
నాకవిత :
శీర్షిక : యుద్ధం
గగనవీథిని బాంబుల మెరుపులు
రక్తపు సెలయేర్లు,క్షతగాత్రుల హాహాకారాలు,రోదన ధ్వనులు
యుద్ధం స్వరూపస్వభావాలివే యుద్ధమంటే ....
అధికారదర్పానికి ప్రతీక
అహంకారదర్పణము
శాంతి విఘాతము
ఆధిపత్య ప్రదర్శనము
పురాణ ప్రసిద్ధము, చారిత్రిక
ప్రసిద్ధము
మనుషులమధ్య, సంస్థల మధ్య, ఇరుతెగలమధ్య
రాజ్యాల, దేశాల మధ్య
జరుగు ఘర్షణ యుద్ధము
సరిహద్ధులతగాదాలు
రాజ్యసంపదల తగాదాలు
యుద్ధాలెన్నో
ఫలితం రక్తపాతం, ప్రాణనష్టం,
దారితీస్తాయి యుద్ధాలు అశాంతికి
కలుగుతుందిభంగం ప్రశాంతతకు
మిగులుతుంది తుదకు అధిక
విషాదం
పరిష్కరించుకోవాలి శాంతియుతంగ 
యుద్ధానికి దారితీసిన సమస్యలను
చర్చించుకోవాలి ఇరుతెగలు
కదనమువలన కలిగే లాభం శూన్యం
రణముసాధించేది రక్తపాతమే
సమ్మతంకాదు కదనం ఎవరికీ
బతుకుదాం మనుష్యులుగ
పంచుదాం ప్రేమను
ఆపుదాం అధికార దాహాలను
ఆర్పుదాం రక్తపు మంటలను
నెలకొల్పుదాం విశ్వసౌభ్రాతృత్వాన్ని.

పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం.
3
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
రంగురంగుల హోళిక 
విషంకక్కుతోంది 
ఆమె నిన్న కామదహనంలో 
కాలనేలేదు.

రక్తదాహంతో విశృంఖలంగా 
తిరుగుతోంది
నియంతల స్వార్థం 
క్షిపణుల లాగే వీరవిహారం చేస్తోంది

లక్షలాది జనం పొట్టచేతబట్టి 
వలస పోతుంటే 
కరగని రాతిగుండెలు 
రక్తతర్పణం కోసం తహతహలాడుతున్నాయి

మృత్యువు స్వైరవిహారం చేస్తుంటే
జీవఛ్చవాలు
సామూహిక దహనాలకోసం ఎదురు చూస్తున్నాయి.

అపరదుర్యోధనులు బురదలో 
నుండి బయటికొచ్చేదాకా
నరహంతక రక్త పిపాస చల్లారదు

ప్రపంచం యావత్తూ 
చేసే ప్రార్థనలు 
బాంబుల మోతలో 
దేవుడికి వినరావడం లేదు.

రంగు రంగుల హోళీ 
రంగులన్నీవెలిసిపోతున్నాయి.
 🌸🌸🌸🌸🌸🌸🌸🌸
   మదునూరి సూర్యనారాయణ
4
శీర్షిక: యుద్ధము _శాంతి!
పేరు: యం అపరాజిత్ రెడ్డి 
ఊరు: సూర్యాపేట 
ఫోన్ నంబర్:9848532031

జాతి మత వర్గ వైషమ్యాలు 
అమానుష యుద్దాలకు మూలాలు 
సామరస్యానికి బహుదూరంగా,,,,,,,,
వెర్రితలలు వేస్తున్న 
మానవుని శాస్త్ర పరిజ్ఞానం!
అగ్గి కుంపటి రాజుకున్నట్లు 
దేశాలకు దేశాలు వినాశనానికి దరిదాపుల్లో 
శత్రు దేశంపై బాంబులు శతఘ్ణులతో దాడులు 
నిజంగా అణు విస్పోటనమే జరిగితే 
ఓజోన్ పొరతో పాటు సర్వం మటుమాయం!
బ్రతికున్న వాళ్ళు రకరకాల కేన్సర్లతో 
చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ 
భయంకర రోగాలతో అతలాకుతలం!
పచ్చని ప్రకృతికి బీటలుపడి 
భీభత్సాలతో ప్రకృతి తిరగబడి 
సునామీలు గర్జించే ఆమ్ల వర్షాలతో 
మనిషన్న వాడిని నలిపి నలిపి నలగ్గొట్టి చంపుతుంది!
మనిషి మనుగడకు విఘాతం యుద్ధం!

వికృత మనస్కుల నేతలకు పుట్టిన విపరీత బుద్ది 
మనుషులను చీమలకన్నా హీనంగా మారణహోమం 
ఇరు దేశాల మధ్య యుద్ధం 
మరోప్రపంచ యుద్ధం కాకుండా 
కారుచీకట్ల యుద్ధ మేఘాలు అంతరించేలా 
తెల్లని శాంతి జెండాలు ఎగరేయాలి!
సామాన్యుల బ్రతుకులు భలికాకుండా 
ఆకలి కేకల పసిపిల్లలు అల్లల్లాడి పోకుండా 
గగనం నిండా శాంతి కపోతాలు ఎగరాలి!!
అపరాజిత్ 
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని నా హామీ
5.
 పాల్గుణ పౌర్ణమి నగదు పురస్కారాల కవితలపోటి కావ్యాగానం సిజన్ 2. 
అంశం:యుద్దం
 శీర్షీక:ఉన్మాదం
 రాచరికవ్యవస్తలో 
రాజ్యవిస్తరణే ముఖ్యం 
సామ్రాజ్యవాదం ప్రభవించడమేలక్ష్యం 
యుద్దమే తక్షణ కర్తవ్యం 
బలహీనులు సామంతలయ్యేవారు 
బలవుతులు సామ్రాట్లుగా ఏలేవారు
 యుద్దంలో విజయం వరిస్తే 
రాజుగారి వీరత్వం 
యుద్దక్షేత్రంలో మరణించినవారు లేక్కేరారు
 నేలకొరిగినవారంతా సామాన్యసైనికులే
 రాజ్యాలు పోయినా రాజులకాలం అంతరించినా
 మారలేదు సామ్రాజ్యవాదం
 అగ్రరాజ్యాలపెత్తనం శృతిమించుతోంది
 అణగారినబ్రతుకుల అణచివేతలకంతేలేదు
 బలవంతుడు బలహినుడిపై దౌర్జన్యం యుద్దం
 దాయాది దేశాల అక్కసు వెల్లగ్రక్కడమే యుద్దం
 మాటలతో కుదరని సామరస్య విఫలమే యుద్దం
 తూటాలను పేల్చడమే యుద్దం 
కోటలను పేటలను కూల్చడమే యుద్దం 
అణుబాంబులు అగ్నిక్షీపణుల ప్రయోగమే యుద్దం
 కోపం ప్రకోపిస్తే యుద్దం 
ఎదుగలను చూడలేకపోవడమే యుద్దం 
మంచికి మానవత్వానికి ఘొరికట్టడమే యుద్దం
 వినాశనం విధ్వసం విచక్షణారాహిత్యం యుద్దం 
అదోక ఉన్మాదం 
అదోక ఉత్తేజం
 అదోక మారణహోమం! 
 ఇది నాస్వీయరచన.
 దోసపాటి వేంకటరామచంద్రరావు 
పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా
 చరవాణి7780594995.
6.
ముద్దు వెంకట లక్ష్మి గారు

శీర్షిక. : సర్వజనాభ్యుదయం 
 సాధించు సామ్రాజ్యవాదంతో మారణాయుధాల ఉత్పత్తిలో తీవ్రాతి తీవ్రంగా పోటీ పడుతూ, 
*యుద్ధం* లో ప్రయోగిస్తున్న ఓ మనిషీ!
 ఎటువైపు పరుగెడుతున్నావో ఒక్కసారి ఆలోచించు ;
 కౄరమృగాలను వశపర్చుకొన్న నువ్వు 
నీలోని క్రౌర్యానికి బానిసవౌతావా?
 మేధస్సునుమధించి మధించి హృదయాన్ని చిలికి చిలికి సృష్టికి ప్రతిసృష్టిని చేసి
 నిర్మించిన యీ మహానిర్మాణాలనూ
 ఈ అద్భుత కళాఖండాలనూ
 అన్నింటినీ బూడిద పాలు చేసేస్తావా?
 నీ గమ్యం సర్వనాశనమేనా? 
మానవాళికిక మనుగడ దుస్సాధ్యమా?!.... 
 కాదు.... కాదు.... నువ్వింకా పెరగాలి 
నిజమైన మానవుడివైతే నీ భావోద్రేకాల పై నువ్వు అధికారివి కావాలి 
ఆవేశానికి ముందు ఆలోచించు
 విజ్ఞానానికి వివేకాన్ని జోడించు 
సహజీవనం పాటించు, 
సర్వజనాభ్యుదయం సాధించు.
7.
కవిత--శీర్షిక---ఆప్తవాక్యం! అసూయల్లో, ద్వేషాల్లో... శత్రుత్వాల్లో, సంకుచితాల్లో.. కక్షల్లో, కార్పణ్యాల్లో... అన్నిటికీ మూలసూత్రం స్వార్ధమే!! యుధ్ధం వీటన్నిటికీ వెన్నంటే వుంటుంది! అదో ఉన్మాదంలా జడలు విప్పుతుంది! పసికూనల్ని, బాలెంతల్నీ కూడా వదలిపెట్టదు! యువసైనికుల్ని పొట్టనపెట్టుకుంటుంది! నెత్తురు తాగుతూ, ఊపిర్లు లాగేస్తూ.. భవనాలు కూలుస్తూ, బాంబుల్ని పేలుస్తూ.. పెద్ద-ఎత్తున స్మశానాల్ని సృష్టిస్తుంది!! పోరు మంచిదికాదు పుడమినెక్కడనూ" అనే శ్రీనాధ కవి వాక్యం... నరజాతి సమస్తం పరపీడనేనన్న శ్రీశ్రీ వాక్యం సత్యమని నిష్క్రియగా పలికినా సాంత్వనలేదు! అదేమిటో సరిహద్దుల్లో ఎపుడూ సామరస్యం వుండదు! రోజు రోజుకీ శత్రుత్వపు-ఊడలు పెరిగే మత్సరాలమర్రిచెట్టవుతుంది!! యుధ్ధమాగాలంటె బుధ్ధిని మార్చే మాట కావాలి! అది ఐ.రా.స.దైనా ,అందరూ మెచ్చే మహాత్ములదైనా.. హింసని వద్దనుకునే బాట కావాలి!! జీవితసత్యాలని నేర్పే చరిత్రదైనా.. పాపభీతిని కల్గించే ప్రవచనాలవైనా.. విద్వేషాలను వద్దనుకునే వసుధైవకుటుంబపు భావన రావాలి!! సర్వమతాలనుండి పిండిన సారంగానైనా.. మానవతా పరిమళాల ధూపంగానైనా..! అలనాటి రాక్షసులమించిన మారణాయుధాలను సృజించగల నేటి మానవమేధస్సుని విధ్వంసం నుంచి.. నిర్మాణాత్మకతగా దారిమళ్ళించాల్సిన బాధ్యత అన్నిదేశాలదీ!! ప్రపంచశాంతిది వెలుగుదారి!! యుధ్ధాలు చీకటికూపాల దానవతకే!! యుధ్ధపు పిలుపు తేలికే!! పర్యవసానాలంచనావేయటం అసాధ్యం!! అవి ఒక రోజుతో అంతం కావు!! అంతు చూస్తాయి సుమా!! ************* ఈ కవిత నా స్వంత రచన. వేమూరి.సత్యవతి.,విజయవాడ. 9885136308
8.
ఆళ్ళ నాగేశ్వరరావు గారు

కవితా శీర్షిక : "" యుద్ధమే పరిష్కారమా?!""

అగ్ర దేశం ఆగ్రహంతో ఊగిపోయి
పుతిన్ రాజ్యకాంక్ష తో రగిలిపోయి
పిచ్చుకపై బ్రహ్మస్త్రం లా
చిన్న దేశమైన ఉక్రె యిన్ పై అణుబాంబుల వర్షం
భవంతులన్నీ నేల మట్టం
శిధిలాల క్రింద శవాలు
బిక్కు బిక్కు మంటూ జనాలు
ప్రాణ భయంతో వలసలు
వేలల్లో జనాలు కోల్పోయారు ప్రాణాలు!
కూలిన భవంతుల్ని పునర్నిర్మాణము కావించవచ్చు
జీవం. కోల్పోయిన జీవుల్ని పునర్జీవనం గావించలేము కదా!
ప్రతి సమస్యకు యుద్ధమే శరణ్యం కాదు
శాంతియుత పరిష్కారమే కావాలి హద్దు!
యుద్ధం చేసే ఇరుదేశాలకే కాదు
చేసే అన్ని ప్రపంచ దేశాలపై కూడా
యుద్ధపు దుష్పరిణామాలు పడతాయి
ఆర్ధికంగా కుదేలు లై
అనారోగ్య పిడితులై
ప్రపంచ ప్రజలు సమస్తం దీర్ఘకాల వ్యాధిగ్రష్టులై మిగులుతారు
మొక్కుబడిగా  చర్చలు జరపక
శాంతి సాధనే లక్ష్యంగా
చర్చలు ఫలాప్రదమయ్యే దిశగా
ఇరుదేశాలు అడుగులిడాలి
మూడో ప్రపంచ యుద్ధపు ముప్పును తప్పించాలి
జనులందరికి  ప్రశాంత జీవనాన్ని పంచాలి!
9.
ఆళ్ళ నాగేశ్వరరావు గారు

కవితా శీర్షిక : "" యుద్ధమే పరిష్కారమా?!""

అగ్ర దేశం ఆగ్రహంతో ఊగిపోయి
పుతిన్ రాజ్యకాంక్ష తో రగిలిపోయి
పిచ్చుకపై బ్రహ్మస్త్రం లా
చిన్న దేశమైన ఉక్రె యిన్ పై అణుబాంబుల వర్షం
భవంతులన్నీ నేల మట్టం
శిధిలాల క్రింద శవాలు
బిక్కు బిక్కు మంటూ జనాలు
ప్రాణ భయంతో వలసలు
వేలల్లో జనాలు కోల్పోయారు ప్రాణాలు!
కూలిన భవంతుల్ని పునర్నిర్మాణము కావించవచ్చు
జీవం. కోల్పోయిన జీవుల్ని పునర్జీవనం గావించలేము కదా!
ప్రతి సమస్యకు యుద్ధమే శరణ్యం కాదు
శాంతియుత పరిష్కారమే కావాలి హద్దు!
యుద్ధం చేసే ఇరుదేశాలకే కాదు
చేసే అన్ని ప్రపంచ దేశాలపై కూడా
యుద్ధపు దుష్పరిణామాలు పడతాయి
ఆర్ధికంగా కుదేలు లై
అనారోగ్య పిడితులై
ప్రపంచ ప్రజలు సమస్తం దీర్ఘకాల వ్యాధిగ్రష్టులై మిగులుతారు
మొక్కుబడిగా  చర్చలు జరపక
శాంతి సాధనే లక్ష్యంగా
చర్చలు ఫలాప్రదమయ్యే దిశగా
ఇరుదేశాలు అడుగులిడాలి
మూడో ప్రపంచ యుద్ధపు ముప్పును తప్పించాలి
జనులందరికి  ప్రశాంత జీవనాన్ని పంచాలి!
10
.[18/03, 8:12 pm] Lalita Sister:
 కవితాగానం ( సీజన్2)19/3/2022/ శనివారము
" ఫాల్లుణ మాసం పౌర్ణమి కవితలపోటీ "
అంశము ! " యుద్ధం "

అమ్మో " యుద్ధం
యుద్ధ మంటేనే భయం
అర్ధం పర్ధం లేని యుద్దాలు
యుద్ధాలకు కారణం యేమిటి !

భూమి పుట్టగానే మొదలు ఈ యుద్ధాలు
భూమిపుట్ర నగనట్ర పశుపక్షి సంపాదనకా
ఎందుకీయుద్ధాలు తాపత్రయాలు !

సరిహద్దు తగాదాలతో
రాజ్యకాంక్షతో
దాయాదుల ఈర్ష్యలతో
తోబుట్టువులనైన తొలగించి
రాజ్యమేలాలనే కాంక్షలు
సార్వభౌమత్వాన్ని పొందాలనే ఆశ
మరి యెందుకీ యుద్దాలు !

ఏమయిననేమి ఈ యుద్ధాలలో
నష్ట పోయేది ప్రజానీకమే
యుద్దానంతరం ఎన్ని అరాజికాలు
ఎన్నిదారుణాలు కరువుకాటకాలు
     యుత్పత్తి నాశనం
స్త్రీలకు అండదండలేక పోవడం
తలచుకుంటేనే భయం !

సామరత్వమన్నది జగతిలో కానరాము
మమతానురాగాలు మరుగునపడె
స్వార్ధచింతన పెరిగి పోయె!

యుగయుగములనుండి మారణ ఘోరయుద్దాలు
జరుగుతున్నాయని పురాణ కధనం
పరమాత్మ పదియవతారము లెత్తినా
మళ్ళీ యధాతధం !

ఐక్యరాజ్య సమితి యుద్దేశమేమిటి
యుద్దాల నరికట్టు మార్గమేది
శాంతితోస్వారాజ్యం సాధించలేదాగాంధి
విశ్వమంత యొకటేనన్న భావనరావాలి
మమతానురాగాలతో ప్రపంచశాంతి జరగాలి
యుద్దాలనరికట్టాలి
          విశ్వం విరాజిల్లాలి !
      తరణికంటి సూర్యలక్ష్మి.
11
                 -----------
[18/03, 8:27 pm] Lalita Sister: యుద్ధం
**********
నా చేతిలో ఉన్న చరిత్ర పుస్తకం
సన్నగా వణుకుతోంది
అంటే నా చేయి, శరీరం కూడా
ఒక్కో పుట మారుతుంటే 
నా కళ్లు చెమర్చి అక్షర బంధాలు
అదృశ్యం కాసాగాయి
నా నయనాలు ఈ పయనం మా వల్ల 
కాదని మొండికేస్తున్నాయి
మరి ప్రత్యక్ష సాక్షుల పరిస్థితి ఏమిటో?
సర్వం కోల్పోయి దీనావస్థకు చేరిన 
వారి దారుణస్థితి ఎలా ఉంటుందో?
ఆ ఊహకి ఒళ్లు గగుర్భాటుకు
లోనవుతోంది
యుద్ధం అంటే ఆస్తినష్టం, ప్రాణ నష్టమేనా
గతకాలపు వైభవ చిహ్నాలు సర్వనాశనం
మానవుడే తన జాతి అంతానికి
మ్రోగించుకునే మరణమృదంగం
ఆ జ్ఞాపకాలు చరితలకు పట్టే చెదలు
త్రేతాయుగపు రామరావణ రణమైనా
ద్వాపరయుగపు కురుక్షేత్ర సంగ్రామమైనా
కలియుగపు ప్రపంచ యుద్ధాలైనా
నేటి ఉక్రెయిన్-రష్యా సమరమైనా
కారణం ఒకటే
"అనంత విశ్వం ఆసాంతం నా సొంతం
నాకే సొంతం నన్ను మించి ఇంకెవరు?"

ఎంత దురహంకారం?
ఆ ఆలోచన మదిని తొలిచేస్తుంటే
ఆవేశంగా, అసహనంతో, ఆక్రోశంతో
అరవాలనిపించింది
కానీ ఎవరి పై??
ఈ సారి కళ్ళు మూసుకుని
మనోనేత్రం తెరిచా
ఎదురుగా బుద్ధుడు, ఏసు
అశోకుడు, మహాత్ముడు
మరింత నిశితంగా పరికించా....
అమ్మలుగన్నయమ్మ
లలితా పరాభట్టారికా దేవి
ఆమె చల్లని చూపులతో నా సందేహ నివృత్తి.
కేవలం రెండే రెండు అక్షరాలు
పఠించడం, లిఖించడం సులువే
మరి త్యజించగలిగితే
మానవుడే మహనీయుడు
అదే "అహం"
అహన్నీ అంతమొందిస్తే
తనను తాను గెలిచినట్లే
అండపిండ బ్రహ్మాండాలను జయించినట్లే
సమస్త ప్రాణికోటిని సంరక్షించి నట్లే
~~~~~~~~~~~~~
విజయలలిత టేకుమళ్ళ
ఉపాధ్యాయిని
12.
[19/03, 5:52 am] Lalita Sister: కవితా గానం (సీజన్ 2)
కవనజ్యోతి పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి
అంశం:-- యుద్ధం
ప్రక్రియ:--గజల్
రచన:--సింహాద్రి వాణి
చరవాణి:--7569820872

ఆచితూచి అడుగులనూ వెయ్యవలెను యెప్పుడైన
స్వార్థానికి దారులనూ ముయ్యవలెను‌ యెప్పుడైన

మనుషులనూ చంపుటేల బాంబులతో యుద్ధంలో
శాంతిసౌఖ్య ‌దారులనూ తెరవవలెను యెప్పుడైన

రాక్షసత్వ క్రీడలేల రణరంగం నందు చూడ
ఒకరినొకరు చంపుకొనుట మానవలెను యెప్పుడైన

విజ్ఞానం పెంచుకొనుట వినాశనం కొరకు కాదు
కక్షాకార్పణ్యాలను కడగవలెను యెప్పుడైన

మనిషిమనసు మృదువైనది లోకమంత కక్షలేల?
ప్రేమికడలి గుండెలోన నింప వలెను యెప్పుడైన

యుద్ధమేల భువిపైనా చంపుకొనుట భయానకం
రక్తపాత ధారలనూ ఆపవలెను 
యెప్పుడైన

యుద్ధమంటె ధనాధనా దూసుకెళ్ళు గుళ్ళెకాదు
మనసుల మధ్యకు మమతలు పంపవలెను యెప్పుడైన

నచ్చనట్టి చెడుపైనా చెయ్యాలీ సమరాన్నీ
దుర్మార్గం మొదలంటా తుంచవలెను యెప్పుడైన

భువిపైనా మానవతను నింపాలీ సింహాద్రీ
యుద్ధోన్మాదపు చర్యలు ఆపవలెను యెప్పుడైన

హామీ:-- ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి
13
అంశం: యుద్ధం
డా. తంగిరాల నాగలక్ష్మి

 జీవి భూమి మీద పడగానే
మొదలవుతుంది యుద్ధం
అడుగడుగునా  జీవన పోరాటం
"Struggle  for  existance "

యుద్ధం నిబద్ధం
అనేది శుద్ధ అబద్ధం
ప్రత్యక్షం గా చూస్తున్నాం
ఈనాడు ఏం జరుగుతోందో
ఆనాడు ఈనాడు ఏ నాడు
యుద్ధం తప్పదు
యుద్ధం అంటే 
చెలగాటం
 పోరాటం
సంగ్రామం
 సంఘర్షణ
ప్రతిఘటించటం
దేవ దానవుల మధ్య జరిగేదే యుద్ధం
సురా సురుల సంగ్రామం అంటే 
మంచి చెడుల సంఘర్షణ
మనవునకు తప్పదు అంతర్యుద్ధం
అంతః శత్రువులను జయించటం కాదు సాధ్యం 
అందుకే యుద్ధం చేసి గెలవాలి
బాహ్య శత్రువుల్ని సులభంగా గెలుస్తాం
అసలు శత్రువు లే ఉండరు
అంతః శత్రువుల్ని గెలిస్తే
చరిత్ర తిరగేస్తే అన్నీ యుద్ధాలే
రాచరికం పోయి ప్రజాస్వామ్యం
వచ్చిన ఈ దాడులు జరుగుతున్నాయి

యుద్ధాలకి  ఫలితాలు
ధన మాన ప్రాణ నష్టాలు
అశాంతి అనారోగ్యం 
ఆందోళనలు  అల్ల కల్లోల్లాలు
ఆశా నిరాశలు నిస్పృహలు
విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం
జీవ రసాయన యుద్ధాలైనా
వైమానిక దాడులైనా
సాంకేతిక పరిజ్ఞానం తో చేసిన మారణాయుధాల విధ్వంసమైనా
యుద్ధానికి ఒకవైపు గెలుపు
మరోవైపు ఓటమి
అంతేగా
 దేనికోసం మరి ఈ యుద్ధాలు
భౌతిక శరీరానికే ఇవన్నీ 
పోయేటప్పుడు ఏమి తీసుకెళ్లలేము 
ఒక్క 
పుణ్య పాపాల చిట్టా తప్ప
అనితెలిసినా 
ఎందుకీ ఆరాటం
పరువు. ప్రతిష్టల కోసం వద్దు పోరాటం
పంతాలు పట్టింపులతో యుద్ధాలు వద్దు
ప్రపంచ శాంతి కి బద్ధులమవుదాం
దారుణ హింసా కాండని ఆపుదాం
ఆంక్షలతో గాదు ఆశయాలతో
ఆక్రమణ లతో కాదు ఆనందాలతో
అంగబలంతో కాదు ఆర్ధిక ఉన్నతితో
అన్యోన్యం గా ఐకమత్యంతో
పరస్పర గౌరవాభిమానాలతో
శాంతియుతంగా సహజీవనం సాగిద్దాం
సరిహద్దుల నిఘా రద్దు చేయిద్దాం 
సర్వ సమానత్వం సాధిద్దాం
యుద్ధం వద్దని యుద్ధం చేద్దాం
14.
 ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

శీర్షిక:-వినాశానానికి హేతువు
...........................................
నేటి సమాజాన కులమత భేధాలతో
వర్గ వైషమ్యాలతో ,పేద గొప్ప
నలుపు తెలుపు శరీరవర్ణ తారతమ్యాలతో
సగటు మానవుని జీవితమే ఒక పోరాటం....!!

ఎవరిచ్చారు. నీకు  హక్కు
ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకుని
వారి తలవ్రాతలు మార్చేందుకు చేసే ప్రయత్నం
ప్రాణం పొసే అధికారం నీకు లేనప్పుడు
ప్రాణం తీసే హక్కు లేదని తెలుసుకో....!!

శాస్త్ర సాంకేతిక జ్ఞానం పెరిగినది
సమాజాభివృద్ధి కొరకు, లోక కల్యాణం కొరకని
అణ్వాయుధాలు దేశప్రగతికి మాత్రమే కానీ
వినాశానానికి  ఉపయోగించకు....!!

యుద్ధం ఒక ప్రళయం
యుద్ధం లో తండ్రిని కోల్పోయి,భర్తను పోగొట్టుకుని,
పిల్లలను దూరం చేసుకున్న వారి ఆర్తనాదాలు
నీ వినాశానానికే అని తెలుసుకుని
సోదర భావంతో యుద్ధం వద్దు
శాంతి అహింసలే ముద్దు అని
వసుదైక కుటుంబానికే చాటుదాం....!!

  లోకా సమస్తా సుఖినో భవంతు.

15
కవనజ్యోతి పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
కవితా గానం సీౙన్ 2
అంశం:: యుద్ధం
శీర్షిక..... వినాశనం... 18/03/2022
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
6281697982
8497924605
*********************************

యుద్ధం ఒక ఉన్మాదం
అది మహా వినాశకర వికృత రాక్షస క్రీడ
భయానక రుధిర ధారల ప్రహేళిక
గెలుపు ఓటమిల వైకుంఠ పాళి
చిత్తు బొత్తుకై ఎగరేసిన రక్తపు బొట్టు
కుత్తుకలనుత్తరించుకొనె కత్తుల కరాళ నృత్యం

మనిషిలోని మదమాత్సర్యాలు.... మహత్వ కాంక్షతో...
మారణహోమం సృష్టించి మహోగ్ర జ్వాలల్లో
మానవ నివాస వాటికలను మాడ్చి మసి చేసే
కదనకాలాగ్నితో లేచె
ధుమ ధుమలాడే ధూమ్ర వర్ణజ్వాలల ధూమం.. కారు మబ్బులా క్రమ్ముకొని ధరణీ తలాన్ని అతలాకుతలం చేసె విహ్వల 

యుద్ధం ఒక విస్ఫోటనం.....ఫలితంగా
రక్తపు మడుగులో శవాల గుట్టలు
అగ్నికీలల్లో ఆహుతైన జీవుల ఆత్మల ఆర్తనాదాలు
తెగిపడిన మస్తిష్కాలు... ఛిద్రమైన కళేబరాలు
కుళ్ళిన శవాలలొ పురుగుల లుకలుకలు  
నక్కల విందు భోజనం.... అవి ఆనందంలో వేసే భయానక ఊళలు

కాల భైరవుని కార్యస్థలిలో 
ట్యాంకుల గుండ్ల వర్షం....నేలకొరుగుతున్న మహాప్రసాదాలు...మానవ సమూహాలు
అభం శుభం తెలియని అనేక జీవరాశులు

లోహ విహంగాలు కురిపించె బాంబుల ధాటికి  భస్మీపటలం అవుతున్న మహానగరాలు 
విద్య ఉపాధి ఆరోగ్య కేంద్రాలు.... అంతేకాదు మానవ జీవన హననం

అత్యాధునిక మిస్సైల్సుతో సుదూర ప్రాంతం లోని
ఆయువు పట్టులను తుత్తునియలు చేసి
ఖండిత మొండాల ఘోర వినాశనం పై
భేతాళ భీకర నృత్యాలు... 
చూసిన మానవ జాతి హాహాకారాలు ఆర్తనాదాలు

స్వీయ రచన:::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
18032022.
16
[మద్ది పుల్లారావు గారు

సామ్రాజ్య వాదం విశ్వాన్ని వణికిస్తుండె
మానవ మారణహోమంతో అవని దద్దరిల్లుచుండె
సుందర నగరాలు వల్లకాడుల్లా మారుతుండె
పసిప్రాణాలు సైతం పండుటాకుల్లా రాలుచుండె
అగ్రరాజ్యాల భీకర యుద్దోన్మాదంతో  
పృధ్విలో రుధిరదారలు కురుస్తుండె
సమరాన్ని రగిలించేది భీతి
సహనాన్ని హర్షించేది ప్రీతి
అనురాగం చేసే శాసనమే అసలైన రాజనీతి
ప్రేమ సస్యం పండాలంటే ధ్వేషం దుక్కి దున్నాలా?
విజేతలగుటకు విశ్వాన్నే భస్మం చేయాలా?
వినాశం జరిగితే కాదు వివేకం పెరిగితే గెలుపు
కుత్తుకలను నరికితే కాదు గుండియలు కలిపితే గెలుపు
లక్ష ప్రాణాలు ఆర్పేసిన కత్తి
ఒక్క ఊపిరిని నిలబెట్టగలదా?
వేయి తోటలను నరికిన చేయి
ఒక్క పూవును పూయించ గలదా?
అణుబాంబులు కాదు మానవ ప్రాణాలు నిలపాలి
మిస్సైల్ కాదు మానవత్వం పరిమళించాలి
యుద్దటాంక్ లు కాదు కారుణ్యం వికసించాలి
అగ్రరాజ్యాలు చొరవ చూపాలి
విశ్వశాంతికై కరములు కలపాలి
శాంతి కపోతం ఎగురవేయాలి
కరుణే కలియుగ ధైవమని తెలియండి
ప్రేమే సర్వ ప్రకృతని నినదించండి
17

 డాక్టర్ సి హెచ్ ఆంజనేయులు గారు

ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి ఒదిగి ఉండడం అతని జీవితంలో ఉన్నత స్థానానికి నడిపిస్తుంది మానవుని విలువ మంచిని చేకూర్చిన అప్పుడే 10 మంది హృదయాల్లో నిలిచిపోయే మానవీయ మూర్తిగా మిగులుతాడు మనిషే కదా నవ మానవుడిగా నవోదయా లు సృష్టిస్తాడు నవనాగరికత శిల్పం మూర్తి అవుతాడు
18
కవితా గానం
అంశం : యుద్ధం
శీర్షిక :  వసుదైక కుటుంబం
రచన : గొర్రెపాటి శ్రీను  

శాంతి మంత్రం కానరాని చోట ..
అశాంతి కరాళ నృత్యం చేసే చోట..
యుద్ధం అనివార్యమవుతుంది !
జన జీవితాలను అతలాకుతలం చేసే ఉన్మాద చర్య 
యుద్దమై దేశాల మధ్య పగలు ప్రతీకారాలకు నెలవై 
ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతూ
యుద్ధం సర్వ అనర్థాలకు మూలమవుతుంది !  
బలవంతుడు బలహీనుడి పై విరుచుకు పడుతుంటే 
లోకం చోద్యం చూస్తున్నట్లు చూస్తుందే కానీ 
యుద్దాన్ని నిలువరించే ప్రయత్నం చేయదు !
ప్రపంచమంతా ఆర్థిక లాభాల అన్వేషణ లో ఉండగా ..
ఎవరికి వారే తమ దేశ స్వప్రయోజనాలని గణిస్తుంటే ..
యుద్ధం నేడు ఒక పాశవిక చర్య నే కాదు..
శత్రు దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసి ప్రయోజనాన్ని పొందాలనే దుశ్చర్య !
ప్రపంచమంతా శాంతి చేకూరాలని 
సమస్త మానవాళి సుఖసౌఖ్యాలతో బ్రతకాలని ..
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు 
ఈ నేలపై సంతోషంగా జీవన సాగించాలని ..
దేశాల మధ్య స్నేహ బాంధవ్యాలు వెల్లువిరిసి ..
విశ్వశాంతి కపోతం వినీల గగన సీమలో స్వేచ్ఛగా విహరించే 
శుభపరిణామాలు వికసించాలని ఆశిద్దాం !
యుద్ధ విరమణ ల ఒప్పందాలతో ప్రపంచమంతా వసుదైక కుటుంబం లా 
వర్థిల్లాలని కోరుకుందాం !

                                                 -   గొర్రెపాటి శ్రీను
19.
కవితా గానం సీజన్ 2
కవన జ్యోతి
ఫాల్గుణ మాస పౌర్ణమి నగదు పోటీకి
అంశం: యుధ్ధం
శీర్షిక:బలిపశువులు

కరోనానుంచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడ్డాంఅనుకొంటున్నా/
ఇదేందయ్యో!అదేందో యుధ్ధం జరుగుతున్నాదట గదా/ 
రష్యా వాళ్ళు,ఉక్రెయిన్ వాళ్ళు కొట్టుక సస్తాఉన్నారటగదా/
భారతంలో ధర్మరాజు ఐదూళ్ళుచాలు,యుధ్ధంవధ్ధన్నాడట కదా/
అశోకుడు కళింగ యుధ్ధం తర్వాత యుద్దాలే చేయనన్నాడట కదా/
మరి వీళ్ళకెందుకయ్యో యుధ్ధం మంటే ఇంత ఉబలాటం?
యధ్ధంవద్దురా నాయనా అని శాంతి వచనాలు సెప్పేటోళ్ళేలేరా?
బలవంతుడు నాదే పైచేయని విర్రవీగతా ఉన్నాడా?
సరేలే,వాళ్ళక్కడెక్కడో కొట్టుక సస్తే మనకు పోయేదేముందిలే
అనుకొన్నా/
అదేందయ్యో!ఇచిత్రం!
ఏడ యుధ్ధం జరిగినా అమాంతం పెరిగిపోతాయి రేట్లు/
ఈ యాపారస్తులకు లేవా దయాదాక్షిణ్యాలు/
పొద్దుతిరుగుడు నూనె ధర ఆకాశాన్నంటె/
ఏజ్జరిగినా బలిపశులమయ్యేది పేదోళ్ళమేగా/
రేట్లిలాపెరిగిపోతే మేమెట్లాబతికేది?
ఇదేశాల్లో సదువుకొనే పిలకాయలంతా ఈయుధ్ధంవల్ల
పేణాలుఅరచేతిలో పెట్టుకోని
ఎవరిఇండ్లకు వాళ్ళు పరుగులుతీసారటగా/
మద్యలో అదరాబదరావస్తే వాళ్ళు సదువులేమైపోను?
చైనాలో పుట్టిన కరోనా పెపంచాన్నే గడగడలాడించినట్లు ఈయుద్ధాల పెభావంఅందరి మీదా పడేటట్లు ఉంది/
అయ్యా,ఎవరో ఒకరు చొరవ తీసుకొని  యుద్దాన్ని ఆపండయ్యా
ఎవరిదార్న వారి బతుకులు బతకనీయండయ్యా!

తిప్పావఝల నరసింహమూర్తి
‌ఋచ్చిరెడ్డి పాళెం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
20.
 కవితా గానం కవితల పోటీ
అంశం:: యుద్దము
శీర్షిక:: సర్వ నాశనము
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
తేదీ::19.3.22...శనివారం
సెల్:: 8309920625

యుద్ధం కాదేవరికి మోదము
ఎవ్వరూ చెప్పారు ఆమోదము
ఎవరికి కాదు ప్రమోదము
తప్పక సంభవించు ప్రమాదము!!

యుద్దము వల్ల నష్టము కష్టము
నెరవేరుతుంది ఒకరి అభీష్టము
గెలుపోటముల మధ్య సంఘర్షణ
మనసు అల్లకల్లోలా రణగొణ!!

రాజ్య విస్తరణకని చేస్తారు రణం
దురాక్రమణకు ఒడిగట్టి
బలహీనత పసిగట్టి
చేస్తారు దండయాత్ర

ధన మాన ప్రాణాలకు ముప్పు
ఆస్తులు అంతస్థులకు నిప్పు
పచ్చని పంట చేలకు గండం
భూముల సారం నిస్సారం
పంటలు పండక
జనజీవనము సాగక
చెందిన అభివృద్ది నేలను తాకగా
సాధించిన ప్రగతి సర్వనాశనము కాగా

తల్లికి పిల్లలు దూరమై
పిల్లలు తల్లికి కనుమరుగై
భార్యకు భర్త వెరై
భర్తకు భార్య దవ్వయి
సంపాదించిన దంతా వదిలేసి
బ్రతికితే చాలని ఆశతో
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని
పరుగులు తీసే నిస్సహాయులు
పరదేశానికి పోయిన శరణార్థులు

తినడానికి తిండి దొరకదు
తాగడానికి నీరు లభించదు
బ్రెడ్డు ముక్కకై తండ్లాట
గుక్కెడు నీటికై కొట్లాట
సరియైన ప్రాంతానికై వెతుకులాట

అస్త్రా శస్ర్తాలు కాలంపోయి
బాంబులు క్షిపణులు వేసే
కాలం వచ్చింది
అణుబాంబులు పడితే
అంతా నాశనము
క్షిపణులను వేస్తే పచ్చని
పొలాలు నాశనము
కనిపించిన మేరా శ్మశానము
వల్లకాడు ప్రత్యక్షము
అందుకే.....
యుద్దము నిషిద్ధము కావాలి
ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞలు చేయాలి
21
అంశం...యుద్ధం 
శీర్షిక....శాంతి కపోతాలు

అర్ధాల అమరికలో మనుషులు  ఒదిగినప్పుడు 
మాటల చేతల యుధ్ధం ఉండదు కదా...

పంతాలు పట్టింపుల 
ఊయలూగ నప్పుడు 
ఆవేదనల సమర భేరి మోగదు కదా....

ఆత్మ విశ్వాసపు రెక్కలు 
తప్పును తప్పు అని విదిలిస్తే
ఆక్రోశాల  ఉరికంబం ఎక్కించడం న్యాయ మేనా....

నేనే పెద్ద నా మాటే వినాలనే
పట్టు దలల పెంకితనం
పగ్గాలు విసిరి అన్యాయపు 
అందలం ఎక్కాలను కోవడం
అగ్రులకు అలంకారమేనా....

మానవత్వపు ఆలోచనలు
మస్తిష్కంలో నింపుకుని
శాంతి కపోతాల వోలే
ఆలోచనల పుటలు తిరగేసినప్పుడే
మారణ కాండకు అడ్డుకట్ట వేయగలం....!!

హామీ ...నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను 🙏

మొహమ్మద్ .అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ. గో .జి)
22

నిర్వచనాలేవైనా వైవిధ్యభరితమై
జీవన పయనాన అడుగున అడుగై 

అనునిత్యం అమరమయ్యుంటుంది సమరం
సరిలేరు నాకెవ్వరంటుంది ఈ కయ్యం 

విరాహాన వుంటుంది విరసాన వుంటుంది
సరసాన రసికతకు ఊపిరి నేనేనంటుంది  

నాకముననున్న నారదునికి భోజనమయ్యింది
అకారమును సైతం మార్చివేస్తుందీసమరం  

నవరసాలకూ నాందిగా వుంటానంటుంది
నవనాడులనూ జాగృతపరచి కాచేనంటుంది

వగచిన మగువకు తెగువ తేగలదీతగువు
పురుషుని పౌరుషం ఋజువుచేయగలదీపోరు 

శంఖారావం,నగారామ్రోతతో మొదలైంది నాడు
అణుబాంబులతో అతలాకుతలం చేసిందినేడు
23
[19/03, 8:19 pm] Lalita Sister: కవితా గానం పోటీలు
తేది.19.03.2022
అంశం: యుద్ధం

"ఓ క్రెయిన్ కావాలి!"
*****************

తన దేహంలోంచే 
రాలిపడ్డ ఒక విత్తనం
స్వతంత్ర మొక్కై పెరిగి
శాఖోపశాఖలుగా విస్తరించి
మూలాలను మూలన పడేసి
కొమ్మలిరిగిన చెట్టైంది!

కొమ్మలు తిరిగిన పొట్టేలు
తన అండగుంటదని వచ్చీరాని
మీసాలను మెలేసి మోసపోయింది
తన ఒడిలో పెరిగిన కూనను
తనవైపుకు తిప్పుకోకుండా
రష్యా శంఖారావమాలపించి
తెప్పలు తెప్పలుగా శరాలు సంధించి
ముప్పు తిప్పలు పెడుతుంది

అమ్ములపొదిలోని అస్త్రాలను
"బుడాపెస్ట్" సాక్షిగా అప్పగిస్తే,
ఒప్పంద పత్రానికి అప్పగింతలిచ్చి
తొండి యుద్ధానికి తెరలేపింది!

విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం
అయస్కాంత ధర్మమైతే
విభిన్న ధృవాలు వికర్షించుకోవడం
రాజ్యాధికార మర్మం
తమదే పైచేయి కావాలని
పసికూనపై ఆధి'పైత్య'పు ప్రయోగం!

ఎవరి ఆలోచనలు వారివే
ఎవరి పన్నాగాలు వారివే
పట్టు వదలమంటే
పది తలల నాగు పగకు
బలౌతామని బెంబేలు
దెబ్బతగిలినోడికే నొప్పి తెలుస్తది
ఎగదోసేవాడిది ఏంపోతది?

ఐక్యరాజ్య సమితి ఆపదు
భధ్రతా మండలికి బాధ్యత లేదు
నాటో రెచ్చగొట్టే మాటలాపదు
అంతర్జాతీయ న్యాయస్థానం
అన్యాయాన్ని నిలదీయదు
శాంతి స్థాపన సంస్థలన్నీ
యుద్ధ సినిమాకే సిద్ధమయ్యాయి

ఊబిలో చిక్కి ఉక్కిరిబిక్కిరౌతున్న
ఉక్రెయిన్ ను పైకి లేపడానికి
ఓ క్రెయున్ అందించేదెవరో
గాయపడ్డ ఉక్రెయిన్ దేహానికి
ముందుండి మందులనిచ్చేదెవరో
ముగింపు పలికే
తెగింపు వాక్యం పలికేదెవరో?


           
            *...గంగాపురం శ్రీనివాస్*
                      04.03.2022
24
*ఒక యుద్ధం చాలదూ...?*

అవి సమయాన్ని ముల్లులా గుచ్చుతున్న రోజులు
ఆధిపత్యపు అహంకారం కళ్ళు తెరిస్తే
జాలి కరుణలు మసకబారితాయి
హద్దులు మీరిన మనిషి సరిహద్దు పోరాటాలు కత్తి కన్నా పదునెక్కుతాయి
గుండె తెగిన శ్వాసలు..
మానవత్వం మడుగులో ఎర్రెర్రగా పారుతుంది

ఆయుధాలు అమానుషంగా చల్లాక..
విధ్వంసపు వికృత ఆకృతిలో  ఊరుకు ఊరే స్మశానంలా మొలుస్తుంది
కంటగింపు కావలించుకొని కలుపుమొక్క మనిషిని పాతిపెడుతుంది

యుద్ధం రక్తం తాగుతున్న కొద్దీ మనిషి మదంతో ఉబ్బిపోతుంటాడు

స్వార్థం ప్రేమను విస్పోటంలా పేలుస్తుంది
మమతను సమూలంగా మట్టు పెడుతుంది

రాజ్యాధికారి కోసం..
చేదెక్కిన శ్వాసతో మారిన ముఖం రంగుతో మనకు మనమే మాయని ప్రేత కళ వీస్తున్నాం

కుర్చీల కోసం ఖూనీ కుతంత్రం
ఇది ఏ రాజ్యాంగానికి సంకేతం..?

శాంతిని తెల్లని పావురంలా గాలికి వదిలి
ఎర్రని రక్తంలో ఇప్పటికీ మంచితనాన్ని ముంచేస్తున్నాం

తరాలు మారినా తారతమ్యం శూన్యం

సమస్యని సానుకూలంగా కుదుర్చుకోవడం చేతకానపుడు
రెండు చేతులు నరుక్కోటానికి ఒక యుద్ధం చాలదూ..?
మనిషివని మరవడానికి..
మనసుకున్న అవిటితనం చూపడానికి..‌‌
24
జోషి పద్మావతి గారు

*రణం-కారణం*
************
నిర్వచనాలేవైనా వైవిధ్యభరితమై
జీవన పయనాన అడుగున అడుగై 

అనునిత్యం అమరమయ్యుంటుంది సమరం
సరిలేరు నాకెవ్వరంటుంది ఈ కయ్యం 

విరాహాన వుంటుంది విరసాన వుంటుంది
సరసాన రసికతకు ఊపిరి నేనేనంటుంది  

నాకముననున్న నారదునికి భోజనమయ్యింది
అకారమును సైతం మార్చివేస్తుందీసమరం  

నవరసాలకూ నాందిగా వుంటానంటుంది
నవనాడులనూ జాగృతపరచి కాచేనంటుంది

వగచిన మగువకు తెగువ తేగలదీతగువు
పురుషుని పౌరుషం ఋజువుచేయగలదీపోరు 

శంఖారావం,నగారామ్రోతతో మొదలైంది నాడు
అణుబాంబులతో అతలాకుతలం చేసిందినేడు
25.
కవితా గానం సీజన్ 2
       యుద్ధం
*************
అగ్రరాజ్యం మహత్వ కాంక్ష
నియంత ధోరణీ పోకడ
కాలకూట విషం కక్కింది
కరడు గట్టిన రాతి గుండెలు
సగటు మనుషుల
రక్త తర్పణం కోరాయి
మృత్యువు కోరలు సాచి
స్వైరవిహారం చేస్తుంటే
రావణకాష్టం రగులుతూనే ఉంది
తీరని రక్త దాహానికి
లక్షలాది మంది ప్రజలు
జీవచ్ఛవాలుగా మారిన వైనం
మృత్యువు కరాళ నృత్యం చేస్తూ
కబళిస్తూ ఉంటే
బాంబుల మోతల హోరులో
అగ్ని శకలాలు వెదజల్లుతూ
క్షిపణుల వీరంగం
పిట్టల్లా రాలుతున్న  శవాల పైన
భీకర ప్రచండ తాండవం
సామ్రాజ్య వాదుల దురాక్రమణకు
సామాన్యుల గుండె కోత
మానవ మారణ హోమంలో
ఆహుతి అవుతున్న
మానవ కళేబరాలు
కూలిపోతున్న ఆకాశ హర్మ్యాలు
ఆశల సౌధాలు
జరుగుతున్న నర మేధంలో 
పేలుతున్న ఫిరంగుల వర్షంలో
రగులుతున్న యుద్ధాగ్ని జ్వలల్లో
మాడి మసైపోతున్న
జనావాసాలు
పిల్లికి చెలగాటం
ఎలుకకు ‌ప్రాణ సంకటం
యుద్ధం యుద్ధం యుద్ధం
కాదెప్పుడు ఇది నిబద్ధం
సర్వత్రా ఇది నిషిద్ధం
ఎప్పుడు దీనికి అంతం
ఎప్పుడు అవుతుంది శాంతం

🖋️ వేదాంతం సురేశ్ బాబు
       చంద్రపూర్
26.
కవితా గానం పోటీ కోరకు 
అంశం... యుద్ధము 
శీర్షిక... పోరునష్టం...పొందులాభం 
తాతపూడి సోమశేఖర శర్మ 
యానాం, 8328079336

పోరు నష్టం పొందు లాభం 
పొందిగ్గా మనముంటే పోరేలేదు 
పరిష్కారంవుంది  మన చేతుల్లోనే 
పలకరింపుతోనే పరిమళించుమనం 
పోరుకుకూడాభయమే మంచిపిలుపుకు 

పోరుతో ఏ కార్యము సాధించలేము 
శాంతితో మనం దేనినైనాసాధించగలము 
నేడు యుద్ధం చేసేవారిదే రాజ్యము 
నీతినిజాయితీలకు అసలు తావులేదు
న్యాయం,అన్యాయం నశించిపోయాయి 

పూర్వకాలంలో మహారాజులకు 
యుద్ధకాంక్షఅనే దాహం మహామెండు
ఎన్నోరాజ్యాలు రాజ్యాలు కూలిపోయేవి 
రణరంగంలో అనేకమంది సైనికులు 
అన్యాయంగాఅక్రమంగా హతమారిపోయేవారు 

అశోకుడు యుద్ధకాంక్షతోనే 
అనేకమైన దేశాలు జయించినా 
ఆతని ఆశ నిరాశగానే మిగిలింది 
కళింగరాజ్య అతులిత పోరాటంతో 
కనువిప్పుకలిగింది కనికరముఅయింది
కళ్ళతో చూడలేని  లెక్కలేనన్ని శవాలు
అశాంతి మూర్తి హృదయం చలించింది 
భీషణ ప్రతిజ్ఞతో భౌద్ధమతం స్వీకరించి 
పుణ్యమైన కార్యక్రమాలెన్నో పూర్తిచేసి 
చరిత్రలో అశోకుడు అమరంగనిలిచాడు

యుద్ధంవద్దు రణంవద్దు పోరాటమొద్దు 
రాజకీయనాయకుల్ల పదవీవ్యామోహంవద్దు  ఈచిన్నజీవితంలోమనం శాంతితోజీవిద్దాం                          సాటి మనిషి సుఖ సౌఖ్యానికిసాయపడని దుర్భలులం 
సదాఅందరికీసాయపడుతూ ఉండడమే
మన ధ్యేయం మన జీవిత పరమార్ధం 

ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
27.
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీకి....

అంశం: యుద్ధం

పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి:9505152560
**********************"
     *యుద్ద తంత్రము* 

రణము కాని ప్రదేశము
భూమండలంపై లేదు దేశము
ఆధిపత్య భూతం శిరస్సుపై చిందులు వేస్తూ
పురెక్కింది నరాలపై జోడు గుర్రాల స్వారీ
రాజ్య విస్తరణ రాక్షస కాంక్ష
భీకర హాహాకారాల జిహ్వ చాపుతూంది
యుద్ద మేఘాలు ఆవరించగ
చిన్న రాజ్యాలపై అగ్రరాజ్యాల విజృంభణ!

యుద్ధోన్మాదం మానసికంగా ఆత్మానందం
తనలోని శాడిస్టును శాంతపరచు వినోదము
రుచి మరిగిన రక్తపిశాచి ఆకృత్యాలు
రుచి చూడాలని అర్రుల తాపత్రయము...

యుద్ధం నేటి కొత్త క్రీడ
కాదు
ప్రపంచ యుద్దాలు చేసి ఏం  సాధించినట్టు?
జాత్యహంకార బుద్ధుల కదనోత్సహపు కదలికలు,
ఆర్థిక పుష్టి,
ద్రవ్య నిధులు సతతం హరితంపై
కన్నెర్రజేయు కుట్ర పూరిత విష సంకల్పం!
అణుబాంబుల విస్ఫోటనం
అణువణువున ఉత్పత్తి ధార్మిక శక్తి
పర్యావరణం!!
పర్యావరణంకు భంగం కలిగించే మరణించేవు!
అణుబాంబుల విస్ఫోటనం
అణువణువున ధార్మిక శక్తి
పర్యావరణానికి భంగం కలిగించే ఋతువు!
హిరోషిమా మరియు నాగసాకి అణుబాంబు విస్ఫోటనం
నేటికి కోలుకోలేని ప్రభావం!
క్షీణాయువుకు ప్రేరకము....
యుద్ధంతో సర్వం నష్టము!
       ***
        హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.
28.
[20/03, 7:46 am] Lalita Sister: *కవనజ్యోతి పౌర్ణమి కవితల పోటీ*
*ప్లవ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితా పోటీలు*

అంశము: *యుద్ధం*
తేదీ: *19-03-2022-శనివారం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట-రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *యుద్ధం వద్దు-బుద్ధం ముద్దు*
ప్రక్రియ: *వచనకవిత*
*********************

*మంచికి-చెడుకు; పగటికి-రేయికి; నీకు-నాకు నిత్యం యుద్ధం*

*రామరావణులు,కృష్ణకంసులు, కురుపాండవులు ఎపుడూ సిద్ధం*

*జగతిన వంచన, పాపుల పంచన, లంకకు వంతెన, పోరుకు చింతన*

*కులమేదైనా,మతమేదైనా, గతమేదైనా,అభిమతమొకటే!*

*ఎలుక-పిల్లి-కుక్క-నక్క; కప్ప-పాము-డేగ-వేట*

*జాతులమధ్య జాగృతమయ్యే మనుగడకోసం పోరాటం*

*అవసరాలకు, ఆశయాలకు,అధికారాలకు ఆరాటం!*

*అవమానానికి,అహంభావానికి,అస్తిత్వానికి,ఆక్రమణవాదానికి*

*తరతరాలుగా జరిగే యుద్ధం.. కాలం కాల్చే కాలని కాష్టం!*

*ఘజనీ,ఘోరీ,లోధీ, తుగ్లక్, హిట్లర్, ముసోలిని,సద్దాం,లాడెన్*

*మనిషెవరైనా,పేరేదైనా, మనసున భావం..చూపె ప్రభావం!*

*స్వార్థ తరంగం..ధన చతురంగం..బల రణరంగం..మరణ మృదంగం*

*గడి గడి కొకరితో శత్రుత్వం... గదిలో కెళితే మిత్రత్వం!*

*అర్థం లేనిది..అర్థం కానిది.. "అర్థం"కోసం అవనిలో అనర్థం*

*ఏమా లక్ష్యం.. ఏది అలక్ష్యం... ఏ ఉద్దేశ్యం... ఏ సందేశం...*

*తుపాకీ మీటను నొక్కే ముందు ఒక్క క్షణము ఆలోచించు*

*సిపాయి దుస్తుల వేషము వీడు... అపాయ సూచన భావము వీడు..*

*ప్రకృతి ఇచ్చిన పదార్థములపై పట్టా రాసిన ప్రభువెవడోయ్*

*ఉపాయముంటే ఊరందరితో ఉన్నది కాస్తా పంచుకు తినవోయ్!*

*కసాయి మనసుల కషాయపాత్రలో విషాలు నిండితే విషాదమేనోయ్!*

*ఎవ్వడు రాజు? ఎవ్వడు బంటు? ఎవ్వడికెవ్వడు నమ్మిన బంటు?*

*యుద్ధం వద్దు... బుద్ధం ముద్దు... సిద్ధం హద్దు... బుద్ధిని దిద్దు!*

*శాంతి, సౌఖ్యం, జాలి, ప్రేమ, సత్యం, ధర్మం, న్యాయం చూడు!*

*మనసు,మమత, కరుణ,ఆదరణ కలిగిన నాడే దొరుకును తోడు!*

*********************
హామీపత్రము: *ఇది నా స్వీయరచన.. దేనికీ అనువాదం, అనుకరణ కాదు. ఈ పోటీకి ప్రత్యేకంగా రాసినది!*
29
[20/03, 7:47 am] Lalita Sister: కవితా గానం
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం
ఏడెల్లి రాములు
అంశం*యుద్ధం
శీర్షిక*యుద్ధభూమి
(పంచేంద్రియాల అదుపులో సాఫల్యతే శాంతి)

నీవు ఎంచుకున్న మార్గము చెప్పు
మంచేదో చెడేదో అదే చెబుతుంది

కోర్కెలు దుర్యోధన దుశ్శాసనుల
మైత్రీ బంధమైతే -
 ఆ బాహువుల్లో చిక్కుకున్నోళ్ళే
 పుతిన్ డ్రాగన్ యుద్ధోన్మాదులు
వాడు మతిచెడిన మృత్యుపంజరం
దోమ ఎనుగు తొండంలో దూరితే
తలకొట్టుక సచ్చినట్లు
వాడి యుద్ధోన్మాదమే వాడికే చావు
డప్పు కొడుతుంది

శాస్త్ర సాంకేతిక విజ్ఞానం
బాంబులను కనిపెట్టినా
అణ్వాయుధాలను మూటగట్టినా
పిడికెడు బువ్వను ఇవ్వవు
కసికెడు నీళ్ళను తాపించవు

మానవవాదం మరచి
రాకాసి క్రీడ ఆడే దుష్టత్వం యుద్ధం

గెలిచినోడికీ కంటినిండా కునుకు రాదు
ఓడినోడి జవసత్వాలకు ఆసరా
దొరకదు

 ఇందులో నేరస్తులెవరూ?!
యుద్ధ కోరలకు చిక్కి ముక్కలైన  
ప్రాణులదా?
తునాతునకలైన చరిత్ర కట్టడాలదా?
వేవేల ఏళ్ళ నాగరికత ఒంటబట్టని
మూర్ఖులదా?

ప్రకృతి సంపదలను సట్టుబండలు జేసి
పసిపిల్లలను శ్వాసలకు ఊపిరి తీసే
ఓ మానవాధమా ఏమిటో ఈ నరమేదం
ఎక్కడికీ ఈ చరిత్ర ప్రస్థానం

యుద్ధమంటే
సామాజిక రాజకీయ ఆర్థిక నిరక్షరాస్యత అసమానతలపై యుద్ధం చేయాలి
అవినీతి బంధుప్రీతి లంచగొండితనం పై అవిశ్రాంతంగా యుద్ధం చెయ్యాల్సిందే

ఈ భువనం ఒక చక్కని దవనం
పరిమళం వీడకుండా కాపాడాలి
 
ఏడెల్లి రాములు ✍️
ది*19*03*2022(23*44)
ఎల్కలపెల్లి
జిల్లా* పెద్దపల్లి
30
[20/03, 7:47 am] Lalita Sister: కవితా గానం(సీజన్2).        19--3--2022.
పిన్నక నాగేశ్వరరావు.
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- యుద్ధము.

1. తే.గీ.
వ్యక్తులకు మధ్య ఘర్షణ, వర్గములు, తె 
గలకు మధ్యలో వచ్చు సంఘర్షణలను 
యంతరంగ యుద్ధమ్మని యనుచునుంద్రు
చిన్న సమరమ్ముగా దీని చెప్పవచ్చు.

2. తే.గీ.
రాజ్య విస్తరణ కొఱకు రాజులు మును
దండయాత్రలు చేసి యుద్ధములు జరుప
వాడిరి కటార్లు, కత్తులున్, బల్లెములను 
గజ, తురగ, పదాతి దళముల్ కదనమందు.

3. తే.గీ.
కాల గమనాన మార్పులు క్రమముగాను
వచ్చి యుద్ధమొనర్చెడు పద్ధతులును
మారిపోయె, నాధునికపు మారణాయు
ధములు, క్షిపణులు వంటి పదార్ధములకు
క్షణములో నాశనమగు దేశమ్ములెల్ల.

4. ఉ.
యుద్ధము వచ్చినంత నెవరుందురు నెవ్వరు
                                               లేకపోదురో
యిద్ధరణిన్ పునీతులగు నెందరు నింతుల
                                           బొట్లు రాలునో
వృద్ధులు, పిల్లలున్, యువక వీరుల ప్రాణము
                                          లెన్ని పోవునో 
యుద్ధపు కాంక్షలన్ వదలి యుర్విని శాంతిగ 
                                        చేయబూనుమా!
5. తే.గీ.
యుద్ధమనగ నాశనము చేయుటకె కాదు
మంచి కార్యముల నిల సాధించుటకును 
సమరమును ప్రకటించుట సహజమె యగు
నుగ్రవాదము నణచి వేయుటకును నవి
నీతి, దారిద్ర్యమున్, మతోన్మాదములను 
తరుముటకు సాయపడును యుద్ధమిపుడు.
**************************************
31
[20/03, 7:48 am] Lalita Sister: పౌర్ణమి మాస కవితల పోటీ
కవన వేదిక
అంశం :యుద్ధం
శీర్షిక: యుగాలు మారినా..!?
*************************
యుగాలు మారినా యువత మారదా ?
యుద్ధాలు ,యుద్ధాలు అంటూ ఆస్తులు పెంచుకుంటూ ఆప్యాయతలు చంపుకుంటూ 
రాజ్య కాంక్షతో ఆనాడు 
రగిలే పగలతో ఈనాడు 
తెలివితేటల ఆయుధాలు 
మానవ వికాసానికి కాక
 మానవ నాశనానికి నాంది
 పెరిగే జనాభాకు జన నష్టం ఒక అరిష్టం
 పెంచుకున్న మేథస్సుతో తయారైన ఆయుధం
 ప్రయోగం చేసిందో వికృత మానవాకారం
 కష్టపడి కట్టిన కట్టడాలు, సంపాదన నేలమట్టమై 
విలపిస్తున్నాయి 
ఆకాశంలో ఎగురుతున్న మానవాకారాలు 
కాలుతున్న యుద్ధ వీరుల శవాలు 
కన్నీరు కార్చే కరుణామయులే లేని దౌర్భాగ్యం
 ఎవరికి ఎవరు ఏమి కారు, లేని శత్రుత్వం తీస్తుంది ఉసురు రాజాధినేతలు  వేసే అధికార ముద్ర 
అమాయకుల బలితో ఆత్మార్పణం 
అధికారులు చేయాలి యుద్ధ విరమణ ఒప్పందం 
ఆది మానవుడు నుండి ఆధునిక మానవుని వరకు 
'కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం' 
మధ్యలో ఎందుకీ మారణ హోమాలు ?
ప్రాణం పోసే వారికే ప్రాణం తీసే హక్కు 
అంతవరకు పిల్లా పాపతో బ్రతకనివ్వండి
 పాటించాలి ప్రతిఒక్కరూ
"సర్వేజనా సుఖినోభవంతు "తారక మంత్రం.
++++++++++++++++++++++++++++++
హామీ పత్రం 
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
మన్నెలలిత 
హైదరాబాద్
741 686 32 89
32
[20/03, 7:48 am] Lalita Sister: *కవితా గానం సీజన్ 2,పాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం*
*****************************
*అంశం:యుద్ధం*
*శీర్షిక:శాంతి కపోతం ఎగరేద్దాం*
*తేదీ:19.03.2022*

రాజ్యకాంక్ష పాలక డేగల రెక్కల సవ్వడులలో
నలిగి పోతున్నారు చిన్న దేశాల ప్రజలు
క్రూర పాలకుల కబంధ హస్తాలలో
బలైపోతున్నారు సామాన్యప్రజలు
రాక్షసత్వానికి పరాకాష్ట యుద్ధం

మతోన్మాదమైతేనేం,రాజ్యవిస్తరణ ఐతేనేం
కారణం ఏదైతేనేం ,సందర్భం ఏదైతేనేం
సామాన్యుల కుత్తుకలు తెగిపడాల్సిందే
అసువులు అంతవాయువుల్లో కలవాల్సిందే
ప్రాణ,ఆస్తి నష్టం కలగాల్సిందే
దేశ అభివృద్ధి తిరోగమనమై పోవాల్సిందే

పాలకుల యుద్ధోన్మాదానికి సైనికుల,
ప్రజల రక్తం ఏరులై పారుతుంది
చిన్నా భిన్నమైన మానవ కళేబరాల
భీతావహ దృశ్యం ప్రపంచయవనికపై
మాయని మచ్చయి నిలిచిపోతుంది

ఈ ఉన్మాద యుద్ధాలను ఆపుదాం
శాంతి చర్చలే  మార్గమని చాటుదాం
దేశాల స్నేహ సౌబ్రాతృత్వాలను పెంచుదాం
ప్రజలలలో సుఖ జీవనం వెల్లివిరిసేలా చూద్దాం
ప్రపంచమంతా శాంతి కపోతమై ఎగిరేలా చేద్దాం


*పేరు:వనపర్తి గంగాధర్*
ఊరు:హన్మకొండ
చరవాని:9440146435


హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...