శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
**********************"
************
కవివరుల జాబితా
శివునూరి లలితా కృష్ణ
1. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
2. డా.ఆంజనేయులు గారు
3.ధనాశి ఉషారాణి గారు
4.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు
6.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
7.బాలు కత్తులు గారు
8.మేకల రామ స్వామి గారు
9.పిల్లి హజరత్తయ్య గారుు
10.సయ్యద్ జహీర్ అహ్మద్ గారుు
11.అపరాజిత రెడ్డి గారు
12.ఏ.భూపతి గారుు
13.చేబియ్యం శ్రీనివాస్ గారుు
14.పిన్నక నాగేశ్వరరావు గారుు
15.సునంద వురిమళ్ల గారు
16.డా.బల్లూరి ఉమాదేవి గారు
17.మన్నె పిన్నక లలిత గారు
18. సి.హెచ్ విజయ లక్ష్మి గారు
19.డా.దీపక్ న్యాతి గారు
20.మర్రి జయశ్రీ గారు
21.కొంపెల్లి రామయ్య గారు
22.వల్లాల విజయ లక్ష్మి గారు
23. కవిత వెంకటేశ్వర్లు గారు
24. శ్రీ కాంత్ కడార్ల గారు
25. వనపర్తి గంగాధర్ గారు
26. దారల విజయ కుమారి గారు
27.జక్కిడి వెంకట్ రెడ్డి గారు
28.బి నాగేశ్వరరావు గారు
29.సునంద వురిమళ్ళ గారు
30.కోరాడ నరసింహారావు గారు
31.దీపక్ న్యాతి గారు
32.సుగుణ మద్ది రెడ్డి గారు
33.విజయదుర్గ గారు(వినీల గారు )
34.జక్కిడి వెంకట్ రెడ్డి గారు
35.కె. సి. నరసయ్య గారు
36.నీలా రంగనాథం గారు
37. తాతపూడి సోమశేఖర శర్మ గారు
38. అన్నాప్రగడవేంకట నరసింహారావు రావు గారు
39.మొహమ్మద్ ఆఫ్సర వలీషా గారు
40. దేవికారాణి రత్నాకర్ గారు
41. జంపని శ్రీనివాసమూర్తి గారు
42. వురిమళ్ళ సునంద గారు
**********
[16/06, 6:59 pm] Lalita Sister: వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.
ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు.
ఆరోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు.
ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు
(బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు.
**********************************
జ్యేష్ఠమాసం పౌర్ణమి నగదుబహుమతుల పోటీ ఫలితాలు.....
ప్రథమ బహుమతి
సింహాద్రివాణి గారు
(ఏరువాక )
ద్వితీయ బహుమతులు..10
1.గంగాపురం శ్రీనివాస్ గారు
(యెవరికెరుక)
2.ఆర్. వి. వి. రాజా గారు
(మట్టి దేవుడు )
3.బొప్పెన వెంకటేష్ గారు
(రైతన్న పండగ )
4. దేవికారాణి రత్నాకర్ గారు
(వెన్నెల వాక )
5. పిన్నక నాగేశ్వర్ రావు గారు
(పద్యాలు)
6. జోషి పద్మావతి గారు
(సాహిత్యాధారరైతు పర్వం )
7.తరణికంటి సూర్యలక్ష్మి గారు
(ఏరువాక కవిత)
8. అఫ్సర వలీషా గారు
(ఎదురు చూపు )
9. కొంపెల్లి రామయ్య గారు(ఏరువాక పున్నమి )
10. ఏడెల్లి రాములు గారు
(నాగలి పూజ )
********
సమీక్షలు
న్యాయ నిర్ణేత శ్రీ అరవింద రాయుడుగారు ఇచ్చారు
*********"
*కవితాగానం-02 - సమీక్షలు*
సందర్భం - పౌర్ణమికవితలు
అంశం - ఏరువాక
సమీక్షకుడు- అరవిందరాయుడు దేవినేని
ఏడెల్లి రాములు గారు..
అన్నదాతను ప్రకృతిప్రేమికునిగా వర్ణిస్తూ హలదారుడై బలరాముని ప్రస్తావన ఏరువాక కవితలో రావడం బాగుంది...వ్యాథినిరోధకుడైన శక్తిగా చంద్రుని అభివర్ణించారు..రైతులను పరోపకారులనీ వారెక్కడ ఉన్నా పచ్చగా ఉంటుందనడం బాగుంది శుభాకాంక్షలు
💐
గంగా పురం శ్రీనివాస్ గారు...
ఏరువాకంటే ఎవరికెరుక అంటూనే కవి మన మనసును తనవశంచేసుకున్నాడు....ఓ ఉత్కంఠ టెంపో ఆసక్తి శీర్షికద్వారా రేకెత్తించడం ఓ చతురమైన పద్ధతి ఓ బలమైన వ్యూహం...పాఠకున్ని మంత్రముగ్ధున్ని చేస్తుంది కాసేపు ఆ మాత్రంచాలు కవితలో ఉన్న బలాలు పఠితల మనసులోకి జొరబడడానికి సాంప్రదాయాలను కలుపులా తీసిపడేయడం అనే అభివ్యక్తి శక్తివంతమై ఒప్పింది..."నవ" తరం అంటూనే ఏమెరుక అనడం కొత్తసినిమా ఏంబాలేదు అనడం ...సినిమా బాలేదు అనడానికంటే కొత్తదనం ఉంటుంది మఱి! ఇక కవి మునుముందుకు సాగుతూ అన్నీ వివరాలు ముందుంచుతూ ఏమెరుక అని ముక్తాయించడం...ఆకర్షణీయమై ఒప్పింది...వారికి అభినందనలు
💐
సింహాద్రి వాణి గారు...
చినుకురాలెను సాగగ రైతుకార్యముల్ అంటూ ఏరువాకనేపథ్యమైన మేఘవిన్యాసాన్ని చక్కగావర్ణించారు....భిన్నములైన పద్యములను అభివ్తక్తి ఉన్నతిని చాటుటకు ఉపయోగించే విధానం బాగుంది...అభినందనలు
💐
R. V. V. రాజా గారు...
తొలకరిసైన్యం...ఆశల తలపాగా...మడిమదిని పాదాలపెదాలతో ముద్దాడమనడం వంటి తీరైన భావచిత్రాలతో కవితను తీర్చిదిద్దిన కవి పసిడిధాన్యరాసులను కలవరిస్తున్నాడనడం బాగుంది...దేశానికి వెన్నెముక ఎలా అయ్యాడో గుర్తుచేయడం కవితలో పొసగింది అభినందనలు
💐
బొప్పెనవెంకటేష్ గారు..
రైతన్నపాదానికి మట్టిని పారాణిగా వర్ణించడం బాగుంది...ఏరువాక మండుటెండను పండు వెన్నెలగా మార్చిందనడమూ బాగుంది ...సిరిధాన్యాలు రాసులై పోవాలనే ఆకాంక్ష బాగుంది
అభినందనలు
💐
దేవికారాణి రత్నాకర్ గారు...
రైతుల ముంగిళ్ళలో ముగ్గుల సంతకం అంటూనే...వేకువ రాక ఈ ఏరువాక అనడం బాగుంది...పల్లె పద్ధతులను ఏరువాను వర్ణించిన తీరు బాగుంది.. అరమరికలు లేని రైతుబిడ్డలంటూ వారి ఐకమత్యాన్ని గుర్తుచేయడమూ బాగుంది...
శుభాకాంక్షలు
💐
జోషి పద్మావతి గారు...
పురాణేతిహాసాల ఇతివృత్తాలను స్పృశిస్తూ
లయాత్మకంగా కవనధారను చిలికించారు. వివధ ప్రాంతాల్లో ఏరువాక ప్రశస్తిని గుర్తుచేశారు శుభాకాంక్షలు
💐
పిన్నక నాగేశ్వరరావు గారు.....
చక్కనిపద్యాలతో కవితను రాస్తూ వ్యవసాయాన్ని ఫలసాయంకోసంచేసే పనిగా కాక యజ్ఞంగా వర్ణించడం...బాగుంది శుభాకాంక్షలు
💐
తరణి కంటి సూర్య లక్ష్మి గారు..
మోరలెత్తె నారు మొక్కలనడం బాగుంది...అలతిపదాలతో పద్యం చక్కగా అల్లినారు శుభాకాంక్షలు
💐
అఫ్సరవలీషాగారు...
ఏరువాక సందర్భంగా ఇంటింటా రైతు జరుపుకునే వేడుకలు వంటకాలూ సాంప్రదాయాలను స్పృశించారు శుభాకాంక్షలు
💐
కొంపెల్లి రామయ్య గారు..
పల్లెవాతావరణం మీ కవితలో సొగసుగా వెల్లడైంది...వేద ఇతిహాసాలకు జానపద విశ్వాసాలకూ ఐతిహ్యాలకు నెలవైంది మీకవిత..శుభాకాంక్షలు
💐
ఇంద్రావత్ రాహుల్ గారు..
నాగలి జడివాన స్పర్శకు వేచిఉందనడం బాగుంది ప్రతీవాక్యంలో పల్లెవాతావరణం కనిపించింది శుభాకాంక్షలు
💐
దారస్నేహలత గారు..
శ్రమైకజీవనసౌందర్యపు గుర్తులేననంటూ...సాంప్రదాయాలను రైతులకష్టసుఖాలను గుర్తుచేసుకోవడం బాగుంది శుభాకాంక్షలు
💐
జక్కిడి వెంకట్ రెడ్డి గారు...
భారతీయసాంప్రదాయాలను రైతుకష్టాన్ని కవిత్వంచేశారు శుభాకాంక్షలు
💐
మేకల రామస్వామి గారు
పల్లె వాతావరణాన్ని మీ కవితలో చక్కగా వర్ణించారు శుభాకాంక్షలు
💐
సయ్యద్ జహీర్ అహ్మద్ గారు...
వ్యవసాయ కుటుంబాలలో వేడుకగా జరుపుకునే ఏరువాకను కవితలో చక్కగా వర్ణించారు శుభాకాంక్షలు
💐
పిట్ల కావ్య గారు..
వ్యవసాయకుటుంబాలలోని ఆప్యాయతలను వేడుకలను చక్కగా వర్ణించారు శుభాకాంక్షలు
💐
నాశబోయిన నరసింహ గారు...
...తరతరాల భారతీయసాంప్రదాయ సొబగులను గుర్తుచేశారు బతుకువిత్తనాలు మెతుకుల పంటకొరకే అంటూ వ్యవసాయిక బతుకుచిత్రాన్ని గీశారు...ఎడ్లను నందీశ్వరునితో పోల్చి మనసాంప్రదాయంలో జంతువులకున్న స్థానాన్ని గుర్తుచేశారు.
💐
వనపర్తి గంగాధర్ గారు..
పుడమితల్లి పులకరించిన దృశ్యాన్ని...రైతుకళ్ళల్లో మెరిసిన ఆనందన్ని కవిత్వం చేశారు...ఊరి ఐకమత్యాన్ని ప్రస్తుతిస్తూ....పంచభూతాలను కనికరించమని ఆకాంక్షిస్తూ ముగించారు....
💐
గొర్రె పాటి శ్రీను గారు...
రైతన్నల తపస్సంటూ వ్యవసాయాన్ని ప్రస్తుతించారు..రైతేరాజుకావాలన్న అభిమతాన్ని కవితలో ప్రస్తావించారు...కష్టాన్ని ఇష్టంచేసుకోమనే సందేశం కవితలో ప్రస్ఫుటమైంది
💐
నారుమంచి వాణి ప్రభాకరి గారు..
చిరుజల్లులతో కలిగే ఆనందాన్ని కవితలో పంచారు...పలుగు పారల్ని పూజించే దేశ జీవనతత్వాన్ని కళ్ళముందుంచారు...జనం మధ్య మమతానురాగాలను ఆకాంక్షించారు శుభాకాంక్షలు
💐
V. T. రాజగోపాలన్ గారు
.సీతాయజ్ఞం అంటూ పౌరాణిక ఇతివృత్తాన్ని కవితలో ప్రస్తావించారు...భూమిపూజను అనాదిగా వస్తున్న సంప్రదాయాలను వర్ణించారు...
శుభాకాంక్షలు
💐
మద్ది పుల్లా రావు గారు..
రైతు అన్నదాత మాత్రమేకాదు భవిష్యత్ ప్రదాత అని వ్యాఖ్యానించారు.. ఆడుతూ పాడుతూ పనిచేసే వైనాన్ని కీర్తించారు...ప్రకృతి చిత్రాలకు పట్టంగట్టారు శుభాకాంక్షలు
💐
పిల్లి హజరత్తయ్య గారు
భారతీయ సంప్రదాయాల్ని ఆటపాటల్ని గుర్తుచేశారు...బండ్లలాగుడు ఏరువాకకు నిండుదనమని చెప్పారు..ఇళ్ళలో ఆడపడుచుల కోలాహలాన్ని కవితలో అక్షరమానంచేశారు శుభాకాంక్షలు
💐
Ch ఆంజనేయులు గారు
..తడిసిన భూమిని తడిధనం అని వర్ణించారు...చేలో కురిసిన చెమరను అక్షరబద్దంచేశారు..
శుభాకాంక్షలు
💐
B. నాగేశ్వరరావు గారు
....పంచభూతాలే ప్రాణమిత్రులు రైతన్నకు అనడం బాగుంది...జోడెద్దులను ఆప్తమిత్రులతో పోల్చడమూ బాగుంది......నగరీకరణ నేపథ్యంలో కుదేలవుతోన్న వ్యవసాయరంగాన్ని వృత్తిమరచిన వైనాన్ని కవిత్వంచేయడం బాగుంది అభినందనలు
💐
ఆళ్ళ నాగేశ్వరరావు గారు
"కర్షకుల దివ్య పర్వదినం......ఆరుగాలం కష్టాల్ని గుర్తుచేశారు...ఎద్దుల అలంకరణ బండ్ల లాగుడు ఆటల్ని సంప్రదాయాలను కవితలో అక్షరీకరించారు శుభాకాంక్షలు
💐
మన్నె పిన్నక లలిత గారు
చినుకులను అతిథులుగా వర్ణించారు..నోరుతెరచిన బీడులని నోరుతడుపుకునే నేలను అభివర్ణించారు...
గోగునార తోరణాన్ని గుర్తుచేయడం బాగుంది..వస్త్రధారణలు...ఎడ్లముస్తాబులు పండుగ సొబగులు కవితలో కనిపించాయి...
శుభాకాంక్షలు
💐
దారల విజయకుమారి గారు..
చంద్రున్ని ఓషధీపతి అన్నారు..సస్యశ్యామల కలలను తెచ్చే ఏరువాక అని ప్రస్తుతించారు...కృషిపూర్ణిమో హలపూర్ణిమో అంటూ ఎద్దుల ముస్తాబుఘట్టాన్ని వర్ణించడం బాగుంది శుభాకాంక్షలు
💐
చేబియ్యం శ్రీనివాసరావు గారు
రైతురాజ్యం ఆనందరాజ్యం అని వర్ణించారు... సాంప్రదాయాలకు పట్టంగట్టి జానపదాల.వైశిష్ట్యాన్ని కవితలో అక్షరీకరించారు... లోకం ఆకలితీర్చే కార్యం సఫలంకావాలని ఆకాంక్షించారు శుభాకాంక్షలు
💐
బాలు కత్తుల గారు..
మట్టివాసన అంటూ కవితను ఆరంభిస్తూ రైతుమనసుపులకరించిన వైనాన్ని అక్షరబద్ధంచేశారు..రాముడుభీముడు అనే పేర్లతో పల్లె జంతువులకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రస్తావించారు..
💐
తిప్పావఝలనరసింహమూర్తి గారు..
తొలకరి దుక్కికి.గిలిగింతలన్నారు...వ్యవసాయ యజ్ఞానికి ఎద్దులను ఋత్వీకులుగా అభివర్ణించడం బాగుంది..
దేశానికి వెన్నెముక రైతంటూ ఆయన సంక్షేమాన్ని కోరుకుంటూ కవితముగించారు శుభాకాంక్షలు
💐
జంపని శ్రీనివాసమూర్తి గారు
ఆకాశబంధువు భూదేవికి పంపించే చినుకుల వర్తమానం అంటూ తొలకరిని సూత్రీకరించారు... దేశ ఆకలితీర్చే దేవుళ్ళు ఈ రైతులనడం బాగుంది..ఆర్థికవ్యవస్థ పట్టుగొమ్మలని ..వారి స్థైర్యాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు శుభాకాంక్షలు
💐
తాతపూడి సోమశేఖరశర్మ గారు
అన్నపూర్ణగా భూమిని పూజించే రోజే మంచిరోజని వర్ణించారు...ఏరువాక పాటల్ని ప్రస్తావించారు...అక్షయంగా పైరు పాకే విధాన్ని తెలిపి రైతుశ్రేయస్సును ఆకాంక్షించారు శుభాకాంక్షలు
💐
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు....
ఏరువాక ప్రాశస్త్యాన్ని తెలిపారుధర్మానికి చిహ్నం వృషభం అన్నారు..పల్లెపదాల్నీ జానపదాల్ని...సాంప్రదాయాల్నీ కవితలో స్పృశించారు
💐
కవిత వెంకటేశ్వర్లు గారు..
.రైతులకు రమ్యమైన పండుగంటూధాన్యరాసుల వృద్ధిని కాంక్షించారు..ఇంద్రునికీ వృష్టికీ గలబంధాన్ని తెలిపి వృష్టి సువృష్టి కావాలనడం బాగుంది శుభాకాంక్షలు
💐
అంశం:- ఏరువాక
శీర్షిక:-
రైతన్నల రమణీయ పండుగ
...........................
తొలకరి జల్లుల ఆగమనంతో
పుడమితల్లి పులకింతలతో
రైతన్నలు ఆనంద పారవశ్యంతో జ్యేష్ట మాస పౌర్ణమి నాడు జరుపుకునే
సనాతన సంప్రదాయం
ఏరువాక పున్నమి.......!!
వర్షఋతు ప్రారంబానికి
ఏరువాక ప్రతీక
పొలందున్నడానికి సిద్ధంచేసే నాగలిని ఏరు అని ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభించే రోజు .
ధర్మానికి సనాతన సంప్రదాయం లో వృషభం చిహ్నం.తెల్లవారుజామున వృషభాలకి పూజచేసి, పులగం ప్రసాదాన్ని తినిపించి అలంకరించి
పొలంలోకి తీసుకొచ్చి
హలంకట్టి ఒకవైపు రైతన్న మరొక వైపు వృషభం ఉండి
జానపదగీతాలతో దేముని
ప్రార్ధించి దున్నే పౌర్ణమి
ఏరువాక.........!!
ఆడబడచులను ఇంటికి పిలచి పసుపు, కుంకుమలనిచ్చి గౌరవించే రోజు కొసరాజు రాఘవయ్య రోజులు మారాయి సినిమాలో వ్రాసిన
"ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న"
అన్న చక్కటి గేయం ద్వారా
మన సాంప్రదాయం లో
ఏరువాక పౌర్ణమితో
వ్యవసాయ పనులు ప్రారంభమై పాడిపంటలతో
దేశ సుభిక్షతకు కారణం అవుతుందని తెలియచేసే
దేశానికి వెన్నెముక రైతన్నలకు ముఖ్యమైన పండుగ రోజు ........!!
...........................
లోకా సమస్తా సుఖినోభవంతు.
................................
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
9963265762
.................................
Comments
Post a Comment